
Daily Current Affairs in Telugu 15 December- 2022
6వ ఎడిషన్ మేఘాలయ లో ప్రారంభమైన ఇండో -కజకిస్తాన్ ఉమ్మడి శిక్షణ వ్యాయామం “KAZIND-22 :

6వ ఎడిషన్ ఇండియా –కజకిస్తాన్ దేశాల యొక్క ఉమ్మడి శిక్షణ వ్యాయామం “KAZIND-22″ మేఘాలయలోని ఉమ్రోయ్ లో 15 డిసెంబర్ 2022 వరకు నిర్వహించబడుతోంది. ప్రాంతీయ కమాండ్, 11 గూర్ఖా రైఫిల్స్ మరియు భారత సైన్యానికి చెందిన దళాలతో సహా కజకిస్తాన్ సైన్యం యొక్క దళాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. UN శాంతి అమలు ఆదేశం ప్రకారం, సెమీ అర్బన్ / జంగిల్ దృష్టాంతంలో కౌంటర్ కార్యకలాపాలను చేపట్టేటప్పుడు సానుకూల సైనిక కజ కిస్తాన్ ఖాన్ దేశ ఆర్మీతో ఉమ్మడి వార్షిక శిక్షణా వ్యాయామం 2016లో ఎక్సర్సైజ్ ప్రబల్ దోస్తిక్‌గా ప్రారంభించబడింది, ఇది తర్వాత కంపెనీ స్థాయి సంబంధాలను నిర్మించడం, ఒకరి ఉత్తమ పద్ధతులను గ్రహించడం మరియు కలిసి పనిచేసే సామర్థ్యాన్ని ప్రోత్సహించడం ఈ వ్యాయామం యొక్క లక్ష్యం.
క్విక్ రివ్యు :
ఏమిటి : 6వ ఎడిషన్ మేఘాలయ లో ప్రారంభమైన ఇండో -కజకిస్తాన్ ఉమ్మడి శిక్షణ వ్యాయామం “KAZIND-22
ఎక్కడ : KAZIND-22
ఎవరు : మేఘాలయ లో
ఎప్పుడు : డిసెంబర్ 15
భోపాల్‌లో జరుగనున్న ఇంటర్ నేషనల్ సైన్స్ ఫెస్టివల్ -2022 :

ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (IISF) – 2022 జనవరి 2022లో భోపాల్ లో జరుగుతుంది మరియు భారతదేశం జి-20 అధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత జరిగే కీలక ఈవెంట్లలో ఇది ఒకటి. IISF అనేది భారత ప్రభుత్వం యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎర్త్ సైన్స్ మంత్రిత్వ శాఖల ప్రాజెక్ట్, ఇది విజ్ఞాన భారతి సహకారంతో దేశం అంతటా ప్రముఖ శాస్త్రవేత్తల నేతృత్వంలోని స్వదేశీ నీతితో జరిగే సైన్స్ ఉద్యమం.కాగా ఇది 2015లో ప్రారంభమైనప్పటి నుండి, IISF 2022 తొమ్మిదవ ఎడిషన్.
క్విక్ రివ్యు :
ఏమిటి : భోపాల్‌లో జరుగనున్న ఇంటర్ నేషనల్ సైన్స్ ఫెస్టివల్ -2022
ఎక్కడ : మద్య్రప్రదేశ్ లోని భోపాల్
ఎప్పుడు : డిసెంబర్ 15
బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు-2022 గెలుచుకున్న పుంగనూరు పరిశోధనా కేంద్ర౦ :

అంతరించిపోతున్న పుంగనూరు జాతి ఆవుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా పలమనేరులోని పుంగనూరు పరిశోధనా కేంద్రానికి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు-2022 లభించింది. జాతీయ స్థాయిలో అరుదైన, అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు కృషి చేసే సంస్థలకు భారతీయ వ్యవసాయ పరిశోధనామండలి ఏటా ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. ఈ నెల 23న కిసాన్ దివస్ సందర్భంగా న్యూఢిల్లీలో జరుగనున్న కార్యక్రమంలో ఈ అవార్డు కింద ప్రత్యే ప్రశంసాపత్రంతో పాటు నగదు బహుమతిని ప్రదానం చేయనున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొట్టివైన పుంగనూరు జాతి పశువులు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకం. కేవలం 3 అడుగుల పొడవు మాత్రమే పెరిగే ఈ జాతి పశువులు రెడ్, బ్రౌన్, బ్లాక్, తెల్లటి రంగుల్లో తోక నేల భాగాన్ని తాకే విధంగా ఉంటాయి. ఏడాదికి సగటున 5 నుంచి 8 శాతం కొవ్వుతో 500 కేజీల వరకు పాల దిగుబడి ఇస్తాయి. ‘మిషన్ పుంగనూర్’ కింద ఈ జాతి పశువుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 60 కోట్లతో కార్యాచరణ రూపొందించింది. జాతీయ స్థాయిలో ఈ ఏడాది నాలుగు కేటగిరీలలో బీర్ కన్జర్వేషన్స్ కోట్లతో కార్యాచరణ రూపొందించింది. జాతీయ స్థాయిలో ఈ ఏడాది నాలుగు కేటగిరీలలో బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డులను ఐసీఎఆర్ ప్రకటించగా, కేటిల్ కేటగిరీలో పుంగనూరు జాతికి ఈ అవార్డు లభించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు-2022 గెలుచుకున్న పుంగనూరు పరిశోధనా కేంద్ర౦
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ లోనివి
ఎవరు : పుంగనూరు పరిశోధనా కేంద్ర౦
ఎప్పుడు : డిసెంబర్ 15
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-5 పరీక్షను విజయవంతంగా ప్రయోగించిన భారత్ :

అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-5 పరీక్ష విజయవంతమైంది. ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లను ఛేదించగల సత్తా దీనికి ఉంటుంది. ఒడిశా లోని ఏపీజే అబ్దుల్ కలాం దీని నుంచి డిసెంబర్ 15న తెల్లవారుజామున దీనిని పరీక్షించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పొరుగు దేశమైన చైనా వద్ద మంగ్ పింగ్ 11 వంటి క్షిపణులున్నాయి. వీటి. యొక్క పరిధి 12000 నుంచి 15,000 కి.మీ. ఉంటుంది. ఈనేపధ్యంలో చైనాను దృష్టిలో పెట్టుకుని భారత్ రూపొందించింది.. గత ఏడాది అక్టోబరులోనూ ఇలాంటి క్షిపణి పరీక్షను మనదేశం నిర్వహించింది ఈ అస్త్రం అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను చేదించగలదు 15 టనుల వారిన్ ను మోసుకుపోగలదు
క్విక్ రివ్యు :
ఏమిటి : ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-5 పరీక్షను విజయవంతంగా ప్రయోగించిన భారత్
ఎక్కడ : భారత్
ఎప్పుడు : డిసెంబర్ 15
ఐటీఎఫ్ ప్రపంచ చాంపియన్ టైటిల్ కు ఎంపికైన రఫెల్ నాదల్, ఇగా స్వైటెక్ :

ఈ ఏడాది రెండేసి గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన రఫెల్ నాదల్ (స్పెయిన్), ఇగా స్వైటెక్ (పోలెండ్) ఐటీఎఫ్ ప్రపంచ చాంపియన్ టైటిల్ కు ఎంపికయ్యారు. గ్రాండ్ స్లామ్, బిల్లీ జీన్ కింగ్ కప్, డేవిస్ కప్ టోర్నీలను ప్రతిపాదికగా తీసుకుని ఐటీఎప్ ఇటీవల ఈ పురస్కారాలను ప్రకటించింది. కాగా ఈ అవార్డు గెలుచుకోవడం నాథల్ కు ఇది అయిదోసారి. 2008, 10, 17, 19 సీజన్లలోనూ నెగ్గాడు. ఈ ఏడాది నాదల్ ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు గెలిచాడు. స్వైటెక్ ఈ సీజన్లో ఫ్రెంచ్, యుఎస్ ఓపెన్ ట్రోఫీలు నెగ్గింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐటీఎఫ్ ప్రపంచ చాంపియన్ టైటిల్ కు ఎంపికైన రఫెల్ నాదల్, ఇగా స్వైటెక్
ఎవరు : రఫెల్ నాదల్, ఇగా స్వైటెక్
ఎప్పుడు : డిసెంబర్ 15
Daily current affairs in Telugu Pdf November - 202 |
---|
Daily current affairs in Telugu 01-11-2022 |
>Daily current affairs in Telugu 02-11-2022 |
Daily current affairs in Telugu 03-11-2022 |
Daily current affairs in Telugu 04-11-2022</strong> |
Daily current affairs in Telugu 05-11-2022 |
Daily current affairs in Telugu 05-11-2022 |
Daily current affairs in Telugu 06-11-2022</strong> |
Daily current affairs in Telugu 07-11-2022 |
Daily current affairs in Telugu 08-11-2022 |
>Daily current affairs in Telugu 09-11-2022 |
Daily current affairs in Telugu 10-11-2022 |
Daily current affairs in Telugu 11-11-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |