
Daily Current Affairs in Telugu 15-06-2021
దేశంలోనే అత్యంత విలువైన స్టార్టప్ కంపెని గా నిలిచిన బైజుస్ కంపెని :

దేశంలోని విద్యార్థులకు నూతన టెక్నాలజీని సహాయంతో ఆన్లైన్ ద్వారా విధ్య బోదన చేస్తూ ఒకేసారి మార్కెట్లోకి దూసుకోచిందిఈ బైజూస్ ఎడ్యుకేషన్ అనే యాప్. దీనిలో ఎల్ కేజీ నుంచి ఐఏఎస్ వరకు శిక్షణ అందిస్తున్నారు. ఈ యాప్ యొక్క సేవలను 8 కోట్ల మందికి పైగా విద్యార్థులురూ వినియోగించుకుంటున్నారు. ఈ సంస్థ తాజాగా యుబిఎస్ గ్రూప్, జూమ్ వ్యవస్థాపకుడు ఎరిక్ యువాన్, బ్లాక్న్, అబుదాబి సావరిన్ ఫండ్ ఎడిక్యూ, ఫీనిక్స్ రైజింగ్-బెకన్ హోల్డింగ్స్ వంటి పెట్టుబడిదారుల నుంచి 2,500 కోట్ల రూపాయల (సుమారు 340 కొట్ల మిలియన్ డాలర్స్) ను సేకరించింది. దీంతో బైజుస్ స్టార్టప్ కంపెనీ లో విలువ 16.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ రౌండ్ ఫండింగ్ సేకరించిన తర్వాత బైజూస్ మార్కెట్ విలువ ఏకంగా రూ.1.20 లకషల కోట్లు దాటేసింది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న స్టార్టప్ కంపెనీ పేటీఎంను బైజుస్ కంపెనీ అధిగమించింది. ప్రస్తుతం పేటీఎమ్ యొక్క మార్కెట్ విలువ 16 బిలియన్ డాలర్లగా ఉంది. 2020లో బైజుస్ సుమారు 1 బిలియన్ నిధులను సేకరించింది. వెంచర్ ఇంటెలిజెన్స్ గణాంకాల ప్రకారం.. 2019లో 553 మిలియన్ డాలర్లతో పోలిస్తే భారతదేశ ఎడ్-టెక్ స్టార్టప్ 2020లో 2.2 బిలియన్ డాలర్లు సేకరించాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో కంపెనీ ఆదాయం 100 శాతం పెరిగి రూ.5,600 కోట్లకు చేరుకుంది. జిల్లా నుంచి ఒక సంస్థను పరిగణనలోకి తీసుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: దేశంలోనే అత్యంత విలువైన స్టార్టప్ కంపెని గా నిలిచిన బైజుస్ కంపెని
ఎవరు: బైజుస్ కంపెని
ఎప్పుడు: జూన్ 15
వన్ డిస్ట్రిక్ట్ వన్ గ్రీన్ అవార్డును దక్కించుకున్న ఎఫ్.సి.ఆర్.ఎస్.ఐ :

వన్ డిస్ట్రిక్ట్ వన్ గ్రీన్అనే అవార్డును ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (ఎఫ్సీఆర్ఎస్ఐ) కైవసం చేసుకున్న దీని ద్వారా ఈ సంస్థకు మరో గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో స్వచ్ఛత, పచ్చదనం అనే అంశం లో పోటీలో ఫారెస్ట్ కాలేజీ గ్రీన్ చాంపియన్ గా నిలిచింది. మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఒక జిల్లా ఒక పచ్చని విజేత (వన్ డిస్ట్రిక్ట్-వన్ గ్రీన్) అవార్డును సాధించింది. పరిశుభ్రత, పచ్చదనం పెంపుదలకు సంబంధించిన అంశాలలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలో ఒక్కో సంస్థను పరిగణలోకి తీసుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: వన్ డిస్ట్రిక్ట్–వన్ గ్రీన్ అవార్డును దక్కించుకున్న ఎఫ్.సి.ఆర్.ఎస్.ఐ
ఎవరు: ఎఫ్.సి.ఆర్.ఎస్.ఐ
ఎక్కడ: తెలంగాణ లోని ములుగు
ఎప్పుడు: జూన్ 15
ఐసిసి మే నెలకు ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికైన ముష్పికర్ రహీం ,కాథరిన్ బ్రైన్ :

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) మే నెలకు ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల విజేతలుగా స్కాట్లాండ్కు చెందిన కాథరిన్ బ్రైస్, బంగ్లాదేశ్‌కు చెందిన ముష్ఫికర్ రహీమ్‌లను ప్రకటించింది. బంగ్లాదేశ్ శిబిరం నుండి, ముష్ఫికర్ రహీమ్‌ను ఐసిసి పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా 2021 మేకు ఎంపిక చేశారు. మే నెలలో శ్రీలంకపై ముష్ఫికూర్ ఒక టెస్ట్ మరియు మూడు వన్డేలు ఆడాడు. అక్కడ శ్రీలంకతో జరిగిన తొలి వన్డే సిరీస్‌ను అధిక పరుగులు చేయడం ద్వారా బంగ్లాదేశ్ వారి మొదటి వన్డే సిరీస్‌ను గెలవడానికి సహాయపడింది ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు ఏడాది పొడవునా అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్లలో పురుష మరియు మహిళా క్రికెటర్ల ఉత్తమ ప్రదర్శనలను గుర్తించి జరుపుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐసిసి మే నెలకు ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికైన ముష్పికర్ రహీం ,కాథరిన్ బ్రైన్
ఎవరు: ముష్పికర్ రహీం ,కాథరిన్ బ్రైన్
ఎప్పుడు: జూన్ 15
లిథువేనియా ఓపెన్ అంతర్జాతీయ టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన మాళవిక బన్సోద్ :

లిథువేనియా ఓపెన్ అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ యువతార మాళవిక బన్సోద్ విజేతగా నిలిచింది. లిథువేనియాలోని కౌనాస్లో జూన్ 13న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల మాళవిక 21-14, 21-11తో నాలుగో సీడ్ రేచల్ దారగ్ (ఐర్లాండ్)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన మాళవిక తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం.
క్విక్ రివ్యు :
ఏమిటి: లిథువేనియా ఓపెన్ అంతర్జాతీయ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన మాళవిక బన్సోద్
ఎవరు: మాళవిక బన్సోద్
ఎప్పుడు: జూన్ 15
ఆస్ట్రేలియా ఒలింపిక్ స్విమ్మింగ్ ట్రయల్స్ 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో కొత్త రికార్డు నమోదు :

ఆస్ట్రేలియా ఒలింపిక్ స్విమ్మింగ్ ట్రయల్స్ లో మహిళల 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. 19 ఏళ్ల కేలీ మెకియోన్ జూన్ 13న ఈ ఘనతను సాధించింది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ లో జరిగిన పోటీల్లో కేలీ 100 మీటర్ల లక్ష్యాన్ని 57.45 సెకన్లలో అందుకొని 57.57 సెకన్లతో 2019 లో రేగన్ స్మిత్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును సవరించింది. టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన కేలీ ఈ రికార్డును తన దివంగత తండ్రి షోల్టోకు అంకింత ఇస్తున్నట్లు తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆస్ట్రేలియా ఒలింపిక్ స్విమ్మింగ్ ట్రయల్స్ 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో కొత్త రికార్డు నమోదు
ఎప్పుడు: జూన్ 15
భారత మాజీ వాలీబాల్ కెప్టెన్ నిర్మల్ మిల్కా సింగ్ కన్నుమూత :

భారత మాజీ వాలీబాల్ కెప్టెన్ నిర్మల్ మిల్కా సింగ్ కన్నుమూశారు. స్ప్రింటర్ లెజెండ్ మిల్కా సింగ్ యొక్క భార్య అయిన మాజీ భారత మహిళా వాలీబాల్ జట్టు కెప్టెన్ నిర్మల్ మిల్కా కౌర్ కోవిడ్ -19 సమస్యల కారణంగా కన్నుమూశారు. నిర్మల్ మిల్కా సింగ్ పంజాబ్‌లోని మహిళల క్రీడల మాజీ డైరెక్టర్ గా కూడా ప్రభుత్వం నియమించింది..
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత మాజీ వాలీబాల్ కెప్టెన్ నిర్మల్ మిల్కా సింగ్ కన్నుమూత
ఎవరు: నిర్మల్ మిల్కా సింగ్
ఎప్పుడు: జూన్ 15
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |