
Daily Current Affairs in Telugu 14 November – 2022
ప్రతిష్ఠాత్మక మరకేష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఎటైల్ డియోర్ అవార్డు’గెల్చుకున్న రన్ వీర్ సింగ్ :

బాలీవుడ్ కథానాయకుడు రణ్ వీర్ సింగ్ కు ప్రతిష్ఠాత్మక మరకేష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఎటైల్ డియోర్ అవార్డు’ పురస్కారం అందుకున్నారు. నవంబర్ 14న అయన ఇంస్టా గ్రామ్ లో ఈ విషయాన్ని పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా ప్రపంచాన్ని ఏకం చేస్తుంది. నా నటన, వృత్తి, సాంస్కృతిక, భౌగోళిక సరిహద్దులు దాటి ఇంతదూరం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ కు ఎంపిక చేసినందుకు మరకేష్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులకు కృతజ్ఞతలు. ప్రపంచ వేదికపై భారతీయ సినిమాకు ఒక సాంస్కృతిక రాయబారిగా మారెనందుకు గర్వపడుతున్నా అంటూ అందులో వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రతిష్ఠాత్మక మరకేష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఎటైల్ డియోర్ అవార్డు’గెల్చుకున్న రన్ వీర్ సింగ్
ఎవరు : రన్ వీర్ సింగ్
ఎప్పుడు : నవంబర్ 14
టిబెట్ పీఠభూమిపై డావో చెంగ్ రేడియో టెలిస్కోపు నిర్మాణాన్ని పూర్తి చేసిన చైనా దేశం :

అంతరిక్ష పరిశోధనల విషయంలో చైనా క్రమంగా దూసుకుపోతోంది. చంద్రుడిపై శాశ్వతంగా నీడలో ఉండిపోయే ప్రాంతాలపై పరిశోధనల నుంచి గ్రహశకలాలపైకి వ్యోమనౌకలను పంపడం వరకూ అనేక ఆలోచనలను చేస్తోంది. ఇప్పుడు సూర్యుడి వివరాలను వెలుగులోకి తీసుకురావడానికి శక్తిమంతమైన టెలిస్కోపులను సిద్ధం చేసింది. టిబెట్ పీఠభూమిపై డావో చెంగ్ రేడియో టెలిస్కోపు (డీఎస్ బీ) నిర్మాణాన్ని చైనా పూర్తి చేసింది. వచ్చే ఏడాది జూన్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించే వీలుంది. 11 కోట్ల డాలర్ల వ్యయంతో దీన్ని చైనా నిర్వంచింది. దీని సాయంతో అంతరిక్షం లో వాతావరణంపై బానుడి యొక్క ప్రభావం గురించి తెలుసుకోవచ్చు ..
- ఈ టెలిస్కోప్ లో 313 డిష్ యాంటెన్నాలు ఉంటాయి. ఒక్కోదాని వెడల్పు 6 మీటర్లు. ఇవన్నీ కలిసి ఒక భారీ టెలిస్కోపుగా ఏర్పడాతాయి. దీని వెడల్పు 3.14 కిలోమీటర్లు. రేడియో తరంగ దైర్ఘ్యంలో ఇది సూర్యుడిని చిత్రీకరిస్తుంది.
- సూర్యుడి నుంచి ఆకస్మాత్తుగా వచ్చే రేడియో ధార్మిక విస్పోటాలను కరోనల్ మాస్ ఇజెక్షన్ (సీఎంఈ)లుగా పిలుస్తారు. అవి విశ్వంలో చాలా దూరం వ్యాపిస్తాయి.
- చైనా దేశ రాజధాని : బీజింగ్
- చైనా దేశ కరెన్సీ :రెన్మిన్బి
- చైనా దేశ అద్యక్షుడు : షి జిన్ పింగ్
క్విక్ రివ్యు :
ఏమిటి : టిబెట్ పీఠభూమిపై డావో చెంగ్ రేడియో టెలిస్కోపు నిర్మాణాన్ని పూర్తి చేసిన చైనా దేశం
ఎవరు : చైనా దేశం
ఎప్పుడు : నవంబర్ 14
ప్రసారభారతి ముఖ్య కార్యనిర్వహణాధికారి గా గౌరవ్ ద్వివేది నియామకం :

ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర క్యాడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి గౌరవ్ ద్వివేది ప్రసారభారతి ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా నవంబర్ 14న నియమితులయ్యారు. 1995 బ్యాచ్ కు చెందిన ఆయన ఈ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగుతారు. ఆయన లోగడ పౌరవేదిక ‘మై గవర్నమెంట్ ఇండియా సీఈవోగా సేవలందించారు. శశిశేఖర్ వెంపటి 2017 నుంచి ఈ ఏడాది జూన్ వరకు ప్రసారభారతి సీఈవోగా బాధ్యతలు నిర్వ హించారు. ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ మయాంక్ అగర్వాల్ స్థానంలో గౌరవ్ ద్వివేది నియమితులయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రసారభారతి ముఖ్య కార్యనిర్వహణాధికారి గా గౌరవ్ ద్వివేది నియామకం
ఎవరు : గౌరవ్ ద్వివేది
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు : నవంబర్ 14
ప్రతిష్టాత్మక అర్జున పురస్కారం 2022 ను గెలుచుకున్న నిఖత్ జరీన్ ,శ్రీజ :

అత్యుత్తమ ప్రదర్శనతో దూసుకెళ్తున్న తెలంగాణ క్రీడాకారిణులు నిఖత్ జరీన్. ఆకుల శ్రీజ ప్రతిభకు గుర్తింపు లభించింది. ప్రపంచ వేదికలపై పతకాలు సాధించిన ఈ అమ్మాయిల ఖాతాలో ఇప్పుడు ప్రతిష్టాత్మక అర్జున పురస్కారం చేరింది. 2022కి గాను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఇటీవల 25 మంది అథ్లెట్లతో ప్రకటించిన అర్జున అవార్డుల జాబితాలో బాక్సర్ నిఖత్, టీటీ క్రీడాకారిణి శ్రీజకు చోటు దక్కింది. 26 ఏళ్ల నిజామాబాద్ బాక్సర్ నిఖత్ ఈ ఏడాది 52 కేజీల విభాగంలో ప్రపంచ చాంపియన్ గా నిలిచి ఆ ఘనత సాధించిన, భారత అయిదో మహిళా బాక్సర్ గా రికార్డు సృష్టించింది అదే దూకుడు కొనసాగించిన ఆమె కామన్వెల్త్ క్రీడల్లోనూ పసిడి పంచ్ విసిరింది. 2011లో ఆమె జూనియర్ ప్రపంచ రాంబిన్ టైటిల్ గెలిచింది. ఇప్పుడు. దక్షిణ భారత్లోనే అర్జున అవార్డుకు ఎంపికైన తొలి మహిళా బాక్సర్ గా నిలిచింది. ‘మరోవైపు టేబుల్ టెన్నిస్లో హైదరాబాద్ అమ్మాయి శ్రీజ ఆదరగొడుతోంది. కాష్ట స్వెల్త్ క్రీడల మిక్స్డ్ డ్ డబుల్స్లో శరత్ కమల్తో కలిసి ఆమె స్వర్ణాన్ని ముద్ర్యాడింది. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ చాంపియ నగా నిలిచిన మొదటి మహిళా టీటీ క్రీడాకారిణి అమెనే కావడం విశేషం.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రతిష్టాత్మక అర్జున పురస్కారం 2022 ను గెలుచుకున్న నిఖత్ జరీన్ ,శ్రీజ
ఎవరు : నిఖత్ జరీన్ ,శ్రీజ
ఎప్పుడు : నవంబర్ 14
భారత ఒలింపిక్ సంఘం కు ఎంపికైన భారత స్టార్ క్రీడాకారులు పివి సింధు,మేరి కోమ్ గగన్ నారంగ్ :

స్టార్ క్రీడాకారులు పి.వి. సింధు, మేరీ కోమ్, గగన్ నారంగ్ లు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అథ్లెట్స్’ కమిషన్ కు ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 10 మంది క్రీడాకారులు కమిషన్ కు ఎంపికయ్యారు. సింధు (బ్యాడ్మింటన్), మేరీ (బబాక్సింగ్), గగన్ (షూటింగ్), 7వ కేశవన్ (వింటర్ ఒలింపియన్), మీరాబాయి చాను. (వెయిట్ లిఫ్టింగ్), ఆచంట శీరత్ కమల్ (టేబుల్ టెన్నిస్), రాణి రాంపాల్ (హాటీ), యూని దేవి (పెన్సింగ్), బజరంగ్ లాబ్ (రోయింగ్, పి.కూనా (షాట్పుట్) ఏకగ్రీవంగా కమిషన్ కు ఎన్నికయ్యారు కమిషన్ 10 పదవులకు పది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరంతా ఏకగీవ్రంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ఉమేశ్ సిన్హా ప్రకటించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐపిసి) అలెట్స్ కమిషన్ సభ్యుడు అమీన్ బింద్రా, ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (బీసీఐ) అర్గెట్స్ కమిషన్ సభ్యుడు సద్దాం సింగ్ మిగతా రెండు పదవుల్ని భర్తీ చేయనున్నారు. మొత్తం 12 మందితో ఐడిఏ ఆర్గెట్స్ కమిషన్ భర్తీ అవుతుంది. 2018లో ఐసిసిడి బింద్రా (ఎనిమిదేళ్ల కాల పరిమితి), 2011లో సూరా ఓసీఐకి ఎన్నికయ్యారు. 2018లో ఐసిసిడి బింద్రా (ఎనిమిదేళ్ల కాల పరిమితి), 2011లో సూరా (నాలు గేవి) ఓసీఐకి ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత ఒలింపిక్ సంఘం కు ఎంపికైన భారత స్టార్ క్రీడాకారులు పివి సింధు,మేరి కోమ్ గగన్ నారంగ్
ఎవరు : పివి సింధు,మేరి కోమ్ గగన్ నారంగ్
ఎప్పుడు : నవంబర్ 14
అత్యంత విలువైన ఆటగాళ్ల జట్టులో చోటు దక్కించుకున్న భారత స్టార్లు విరాట్ ,సుర్యకుమార్ యాదవ్ :

తాజా ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో ‘ ప్రదర్శనల ఆధారంగా ఎంపిక చేసిన అత్యంత విలువైన ఆటగాళ్ల జట్టులో భారత స్టార్లు విరాట్ కోహ్లి సూర్యకుమార్ యాదవ్ చోటు దక్కించుకున్నారు. స్థిరంగా రాణించిన కోహ్లి (296 పరుగులు) ఈ టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా నిలవగా మెరుపు ఇన్నింగ్స్ లతో సూర్య (233) పరుగులు) ఆకట్టుకున్నాడు. అత్యధిక పరుగుల జాబితాలో సూర్యది మూడో స్థానం పాకిస్ధాన్ 82 పరుగుల సంచలన ఇన్నింగ్స్ ఆడిన విరాట్, తర్వాత బంగ్లాదేశ్ (61 నాటౌట్), నెదర్లాండ్స్ (62) నాటౌట్), ఇంగ్లాండ్ (50) పై ఆర్ధసెంచరీలు నమోదు చేశాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : అత్యంత విలువైన ఆటగాళ్ల జట్టులో చోటు దక్కించుకున్న భారత స్టార్లు విరాట్ ,సుర్యకుమార్ యాదవ్
ఎవరు : విరాట్ ,సుర్యకుమార్ యాదవ్
ఎప్పుడు : నవంబర్ 14
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |