
Daily Current Affairs in Telugu 14 December- 2022
స్వలింగ సంపర్కుల వివాహాల అమలుకు సంతకం చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడేన్ :

స్వలింగ సంపర్కుల వివాహాలకు అమెరికాలో చట్టబద్ధత లభించింది. ఇందుకు సంబంధించిన బిల్లు (సేమ్ సెక్స్ మ్యారేజ్ ప్రొటెక్షన్ బిల్) పై అధ్యక్షుడు జో బైడె న్ సంతకం చేశారు. దీంతో బిల్లు చట్టరూపం దాల్చింది. ఈ చట్టం ద్వారా సమానత్వం దిశగా అమెరికా మరో అడుగు వేసిందని జో బైడెన్ గారు పేర్కొన్నారు. స్వేచ్ఛ, న్యాయం కొందరిది కాదని అందరి సొంతమని చెప్పే విధంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు బ్రెడెన్ సంతకంతో స్వలింగసంపర్కులు సంతోషంలో మునిగిపోయారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : స్వలింగ సంపర్కుల వివాహాల అమలుకు సంతకం చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడేన్
ఎవరు : అమెరికా అద్యక్షుడు జో బైడేన్
ఎప్పుడు : డిసెంబర్ 14
ఐరాస కార్యాలయ ఆవరణలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ :

హింస, సాయుధ ఘర్షణ, ఇతరత్రా అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్న ప్రపంచంలో శాంతి, సుస్థిరత నెలకొనడానికి మహాత్మా గాంధీ సిద్ధాంతాలు దోహదం చేస్తాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ గారు పేర్కొన్నారు. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటో నియో గుటెరస్ తో కలిసి డిసెంబర్ 14న ఆయన ఐరాస కార్యాలయ ఆవరణలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనిని భారతదేశం ఐరాసకు బహుమతిగా పంపింది. ఐరాస ప్రధాన కార్యాలయంలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. అహింస, శాంతి, నిజాయతీలకు ప్రతిరూపం గాంధీ మహాత్ముడు ఐరాసలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పడం ద్వారా ఈ ఆదర్మాలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకొంటున్నట్లవుతుంది’ అని జైశంకర్ అన్నారు. ‘సామ్రాజ్యవాదుపై మహాత్మా గాంధీకి ఉన్న వ్యతిరేకతే ఐరాసకు పునాది అని గుటెరస్ చెప్పారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐరాస కార్యాలయ ఆవరణలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్
ఎవరు : ఎస్. జైశంకర్
ఎప్పుడు : డిసెంబర్ 14
నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు-2022 గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ :

నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు-2022లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల (ఎస్ ఏ) విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీ ఎస్ ఈ సీఎం) ప్రథమ పురస్కారం. సాధించింది. ఢిల్లీలో డిసెంబర్ 14న నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారు చేతులు మీదుగా రాష్ట్ర విద్యుత్తుశాఖ ప్రత్యేక ముఖ్యకార్య దర్శి కె.విజయానంద్ మిషన్ సీఈవో కె. చంద్రశ్ ఐర్రెడ్డి అవార్డు అందుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు-2022 గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ :
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర౦
ఎప్పుడు : డిసెంబర్ 14
ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థాన౦ లో నిలిచిన బెర్నార్డ్ ఆర్నాల్డ్ :

విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా, స్సేస్ ఎక్స్ ట్విటర్ అధిపతి సీఈఓ ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానాన్ని కోల్పోయి, రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఆయన నికర సంపద విలువ డిసెంబరు 14న 175.50 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఫ్రెంచ్ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ . ఎల్పీఎం హెచ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బెర్నార్డ్ ఆర్నాల్డ్ నికర సంపద 190,90 బిలియన్ డాలర్లకు చేరడంతో, రియల్-టైమ్ బిలియనీర్ జాబితాలో ఆయన అగ్ర స్థానం దక్కించుకున్నారని ఫోర్బ్స్ తెలిపింది.133.70 బి.డాలర్ ల సంపద తో ప్రపంచ కుబేరుల జాబితా మూడో స్థానంలో భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కొనసాగుతున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థాన౦ లో నిలిచిన బెర్నార్డ్ ఆర్నాల్డ్
ఎవరు : బెర్నార్డ్ ఆర్నాల్డ్
ఎప్పుడు : డిసెంబర్ 14
సోలార్ సెల్స్ సామర్థ్యాన్ని పెంచే దిశగా ముందడుగు వేసిన గువాహటిలోని ఐఐటీ పరిశోధకులు :

సోలార్ సెల్స్ సామర్థ్యాన్ని పెంచే దిశగా గువాహటిలోని ఐటీ పరిశోధకులు ముందడుగు వేశారు. ఇందుకోసం కీలకమైన పెరో ఎ్స్కట్ నానో క్రిస్టల్స్ (పీఎస్సీ) ఉత్పత్తికి వినూత్న విధానాన్ని కనుగొన్నారు. ఆప్టో ఎలక్ట్రానిక్స్ రంగంలో పురోగతికి ఇది దోహదపడుతుంది. సోలార్ సెల్స్ తోపాటు ఎల్డీ సాధనాల్లో ఉయోగించడానికి మెరుగైన ముడి పదార్థాల అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రధానంగా పెరోవ్స్కైట్లపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. ఇవి అష్టోఎలక్ట్రానిక్ లక్షణాలు పుష్కలంగా కలిగిన ఒక తరగతి స్ఫటికాలు. కాంతిని వెదజల్లే గ్రహించే ఉపకరణాల సమర్ధతను ఇవి మెరుగుపరుస్తాయి. గాలి, తేమలో వాటి స్థిరత్వం అంతంత మాత్రమే. ఐఐటీ పరిశోధకులు మాత్రం ఆ లోపాన్ని సొమ్ము చేసుకోవాలని నిర్ణయించారు. ఈ పదార్థాలకు సహజంగా ఉండే ఆయానిక్ స్వభావంతో తేమను బంధించుకునేలా చేస్తే రసాయన పరివర్తన జరుగుతుందని, మెరు గైన పీఏన్సేలను ఉత్పత్తి చేయవచ్చని తేల్చారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : సోలార్ సెల్స్ సామర్థ్యాన్ని పెంచే దిశగా ముందడుగు వేసిన గువాహటిలోని ఐఐటీ పరిశోధకులు
ఎవరు : గువాహటిలోని ఐఐటీ పరిశోధకులు
ఎప్పుడు : డిసెంబర్ 14
చంద్ర అంతరిక్ష నౌక ను విజయవంతంగా విజయవంతంగా ప్రయోగించిన యు.ఎ ఈ :

యు.ఎ ఈ తొలి సారిగా అరబ్ నిర్మించిన చంద్ర అంతరిక్ష నౌక ను విజయవంతంగా ప్రయోగించింది.స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ నిన్న అరబ్ నిర్మించిన మొట్టమొదటి చంద్ర అంతరిక్ష నౌకను అంతరిక్షంలోకి తీసుకువెళ్ళింది. ఫ్లోరిడా లోని కేప్ కేన వెరెల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి దీనిని ప్రయోగించారు రషీద్ రోవర్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో దుబాయ్ కి చెందిన మహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ వారు నిర్మించారు. మరియు దీనిని HAKUTO –R ల్యాండర్ ద్వారా డెలివరి చేస్తున్నారు.దీనిని జపాన్ దేశ లూనార్ ఎక్స్ ఫ్లోరేషణ్ కంపెని ఇన్స్పేస్ ఇంజనీరింగ్ చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : చంద్ర అంతరిక్ష నౌక ను విజయవంతంగా విజయవంతంగా ప్రయోగించిన యు.ఎ ఈ
ఎవరు : యు.ఎ ఈ
ఎప్పుడు : డిసెంబర్ 14
Daily current affairs in Telugu Pdf November - 202 |
---|
Daily current affairs in Telugu 01-11-2022 |
>Daily current affairs in Telugu 02-11-2022 |
Daily current affairs in Telugu 03-11-2022 |
Daily current affairs in Telugu 04-11-2022</strong> |
Daily current affairs in Telugu 05-11-2022 |
Daily current affairs in Telugu 05-11-2022 |
Daily current affairs in Telugu 06-11-2022</strong> |
Daily current affairs in Telugu 07-11-2022 |
Daily current affairs in Telugu 08-11-2022 |
>Daily current affairs in Telugu 09-11-2022 |
Daily current affairs in Telugu 10-11-2022 |
Daily current affairs in Telugu 11-11-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |