Daily Current Affairs in Telugu 13&14 September -2022
భారతనూతన అటార్నీ జనరల్ గా తిరిగి నియమితులైన ముకుల్ రోహాత్గి :

సీనియర్ న్యాయవాది ముకుల్ రోహాత్గి గారు మరోసారి భారత అటార్నీ జనరల్ గా నియమించింది.కేంద్ర ప్రభుత్వం.ఆయన అక్టోబర్ 1 నుంచి అటార్నీ జనరల్ గా బాద్యతలు చేపట్టనున్నారు.ఈ మేరకు కేంద్రం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసింది.ఆయన ఈ పదవి చేపడితే ఇది రెండో సారి అవుతుంది.గతంలో అడిశనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గా కూడా అయన చేసారు.గతంలో ఎజి గా పని చేసిన రోహాత్గి గారు 2017 లో ఈ బాద్యతల నుంచి వైదోలగటం తో 15 వ అటార్నీ జనరల్ గా కేకే వేణు గోపాల్ గారిని నాటి ప్రభుత్వ౦ నియమించింది.ఆ తర్వాత ఎజి వేణుగోపాల్ గారి పదవి కాలంను పొడగించారు.అది కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 30 ముగియడం తో ఆయన ఈ పదవిలో దాదాపు ఐదేళ్ళు కొనసాగుతున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారతనూతన అటార్నీ జనరల్ గా తిరిగి నియమితులైన ముకుల్ రోహాత్గి
ఎవరు : ముకుల్ రోహాత్గి
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు : సెప్టెంబర్ 13
డిల్లీలోని పార్లమెంట్ భవనానికి బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానం ఆమోదించిన తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ :

తెలంగాణా రాష్ట్ర శాసన సభ సెప్టెంబర్ 14న రెండు తీర్మానాలను ఆమోదించింది.ఒకటి న్యు దిల్లిలోని కొత్త పార్లమెంట్ భవనానికి బి.ఆర్ అంబేద్కర్ గారి పేరును పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ మరొకటి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త విధ్యుత్ సవరణ బిల్లు 2022 కి వ్యతిరేఖంగా ఒక బిల్లు ఆమోదించింది.ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖా మంత్రి కేటిఆర్ గారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొని యాడారు.కొత్తగా నిర్మించే పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడం సముచితమని అసెంబ్లీ కేంద్రానికి ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శాసన సభలో ఎనిమిది బిల్లులు ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది.మోటార్ వెహికల్ పన్నుల చట్టం సవరన్ బిల్లు విశ్వవిద్యాలయ ఉమ్మడి నియామక బోర్డు బిల్లు ప్రైవేటు విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లు జి.హెచ్.ఎం.సి పురపాలక చట్ట సవరణ బిల్లుల్ జి.ఎస్టి చట్ట సవరణ బిల్లు ,ప్రైవేట్ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లు అజమబాద్ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లు తెలంగాణా పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ సూపర్ న్యుమరేషణ్ సవరణ బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెట్టగా శాసన సభ ఏక గ్రీవంగా ఆమోదం తెలిపింది.
- తెలంగాణా రాష్ట్ర రాజధాని :హైదరబాద్
- తెలంగాణా రాష్ట్ర సిఎం : కే.చంద్ర శేఖర్ రావు
- తెలంగాణా రాష్ట్ర గవర్నర్ : తమిలసై సౌందర రాజన్
క్విక్ రివ్యు :
ఏమిటి : డిల్లీలోని పార్లమెంట్ భవనానికి బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానం ఆమోదించిన తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ
ఎవరు : తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ
ఎక్కడ: తెలంగాణా రాష్ట్ర౦
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎరిట్రియా దేశ తదుపరి భారత రాయబారిగా ప్రకాష్ చంద్ నియామకం :

ప్రకాష్ చంద్ ఎరిత్రియా దేశానికి తదుపరి భారత రాయబారిగా నియమితులయ్యారు.ఎరిట్రియా లో అతని ప్రస్తుత నియామకానికి ముందు ఆటను 2019నుంచి బాలిలో భారత కాన్సుల్ జనరల్ గా పని చేసాడు.ఆటను MEA లో కాన్సులర్ పాస్ పోర్ట్ మరియు వీసా విభాగంలో డైరెక్టర్ గా పని చేసారు.న్యు డిల్లి తో పాటు ఉగాండా ,యుకె ,ఈజిప్ట్ ,చైనా మరియు ఆస్ట్రియా లోని భారతీయ మిషన్ ల వివిధ హోదాల్లో పని చేసారు.ఎరిత్రియా దేశం ఎర్ర సముద్ర తీరంలో ఈశాన్య ఆఫ్రికా దేశం .ఇది ఇతియోఫియా సుడాన్ మరియు జిబౌటి లతో సరిహద్దులను పంచుకుతుంది.
- ఎరిట్రియా దేశ రాజధాని : అస్మారా
- ఎరిట్రియా దేశ కరెన్సీ : ఎరిత్రియన్ నక్ఫా
- ఎరిట్రియా దేశ అద్యక్షుడు : ఇసాయిస్ అఫ్కయిర్కి
క్విక్ రివ్యు :
ఏమిటి : ఎరిట్రియా దేశ తదుపరి భారత రాయబారిగా ప్రకాష్ చంద్ నియామకం
ఎవరు : ప్రకాష్ చంద్
ఎక్కడ: ఎరిట్రియా దేశ౦లో
ఎప్పుడు : సెప్టెంబర్ 13
అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ప్రేం వర్క్ ఒప్పందాన్ని ఆమోదించిన భూటాన్ దేశం :

భూటాన్ దేశం సెప్టెంబర్ 14 న అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ఫ్రేం వర్క్ ఒప్పందాన్ని ఆమోదించింది.ఇంటర్నెషనల్ సోలార్ అలయన్స్ అనేది సోలార్ ఎనర్జీ టెక్నాలజీ ల విస్తరణ కోసం ఒక యాక్షన్ ఓరియంటెడ్ సభ్యుల ఆధారిత సహకార వేదిక దాని ప్రాథమిక ఉద్దేశ్యం శక్తి యాక్సెస్ సులభతరం చేయడం ఇంధన భద్రత ను నిర్దారించడం మరియు దాని సభ్య దేశాలలో శక్తి పరివర్తనను నడపడం.సౌర శక్తి పరిష్కారాల విస్తరణ ద్వారా వాతావరణ మార్పులకు వ్యతిరేఖంగా ప్రయత్నాలను సమీకరించడానికి భారత దేశం మరియు ఫ్రాన్స్ సంయుక్త ప్రయత్నంగా ISA రూపొందించబడింది.మొత్తం 106 దేశాలు ISA ఫ్రేం వర్క్ ఒప్పంద౦ చేసాయి.106 దేశాలలో ,86 ISA ఫ్రేం వర్క్ ఒప్పందం పైన సంతక౦ చేసి ఆమోదించాయి. ఐక్య రాజ్య సమితిలోని అన్ని సభ్య దేశాలు ISA లో చేరడానికి అర్హులు.
- భూటాన్ దేశ రాజధాని : థింపు
- భూటాన్ దేశ కరెన్సీ : భుటనిస్ ఎన్గుల్ ట్రం
క్విక్ రివ్యు :
ఏమిటి : అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ప్రేం వర్క్ ఒప్పందాన్ని ఆమోదించిన భూటాన్ దేశం
ఎవరు : భూటాన్ దేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 13
6 సెంట్రల్ జైళ్లలో ART డిస్పెన్సేషన్ కేంద్రాలను ప్రారంబించిన అస్సాం రాష్ట్ర ప్రభుత్వం :

అస్సాం ప్రభుత్వం 6 సెంట్రల్ జైళ్లలో ART డిస్పెన్సేషన్ కేంద్రాలను ప్రారంభించింది. అస్సాం ప్రభుత్వం 12 సెప్టెంబర్ 2022న రాష్ట్రవ్యాప్తంగా 6 కేంద్ర జైళ్లలో యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) డిస్పెన్సేషన్ సెంటర్‌లను ప్రారంభించింది.ఈ కేంద్రాలను గౌహతి, సిల్చార్, దిబ్రూఘర్, జోర్హాట్, తేజ్‌పూర్ & నాగావ్ సెంట్రల్ జైళ్లలో ప్రారంభించారు. జైళ్లలో ఏఆర్‌టీ డిస్‌పెన్సేషన్ సెంటర్లను కలిగి ఉన్న రాష్ట్రాలలో దేశంలో అస్సాం 5వ రాష్ట్రం గా నిలిచింది..
క్విక్ రివ్యు :
ఏమిటి : 6 సెంట్రల్ జైళ్లలో ART డిస్పెన్సేషన్ కేంద్రాలను ప్రారంబించిన అస్సాం రాష్ట్ర ప్రభుత్వం
ఎవరు : అస్సాం రాష్ట్ర ప్రభుత్వం
ఎప్పుడు : సెప్టెంబర్ 14
దేశంలోనే తొలి ఫారేస్ట్రీ విశ్వవిద్యాలయం స్థాపించిన రాష్ట్రంగా నిలిచిన తెలంగాణా :

భారతదేశంలో మొట్టమొదటి ఫారెస్ట్రీ విశ్వవిద్యాలయం తెలంగాణలో స్థాపించబడింది హైదరాబాద్‌లోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ)ని పూర్తి స్థాయి యూనివర్సిటీగా విస్తరించాలని తెలంగాణ నిర్ణయించింది. యూనివర్శిటీ ఆఫ్ ఫారెస్ట్రీ (యూఓఎఫ్) చట్టం 2022కి తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. యూనివర్శిటీ ఆఫ్ ఫారెస్ట్రీ (UOF) దేశంలోనే మొదటిది. ప్రపంచవ్యాప్తంగా, రష్యా మరియు చైనాలలో మాత్రమే అటవీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : దేశంలోనే తొలి ఫారేస్ట్రీ విశ్వవిద్యాలయం స్థాపించిన రాష్ట్రంగా నిలిచిన తెలంగాణా
ఎవరు : తెలంగాణ
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ప్రతిష్టాత్మక ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్స్ రెండు పతకాలు గెల్చి రికార్డు సృష్టించిన వినేష్ ఫోగాట్ :

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ చరిత్ సృస్టించింది. ప్రతిష్టాత్మక ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్స్ రెండు పతకాలు గెలిచిన తొలి భారత మహిళా రెజ్లర్ గా రికార్డ్ కెక్కింది. సెప్టెంబర్ 14న ఆమె రికార్డుల బెల్ గ్రేడ్ చాంపియన్షిప్స్ లో 53 రేజీల విభాగంలో కాంస్యం సాధించింది’ కాంస్య పతక ప్లేఆఫ్లో వినేష్ 8-0 స్వీడన్ కు చెందిన ‘ఎమ్మా జోనా మాల్ గ్రెన్ పై గెలిచింది. క్వాలిఫికేషన్ లో బత్యుయాగ్ (మంగోలియా) చేతిలో ఓడిన మిశ్ ‘పుంజుకున్న తీరు అద్భుతం బత్యు యాగ్ ఫైనల్ చేరడంతో రెపినేట్ కౌంట్ అర్హత సాధించి విదనేశ్ మొదట కజకిస్థాన్ కు చెందిన ఎశిమోవా ను ఓడించింది.
. క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రతిష్టాత్మక ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్స్ రెండు పతకాలు గెల్చి రికార్డు సృష్టించిన వినేష్ ఫోగాట్
ఎవరు : వినేష్ ఫోగాట్
ఎప్పుడు : సెప్టెంబర్ 14
అంతర్జా తీయ, దేశవాళీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సీనియర్ ఆటగాడు రాబిన్ ఉతప్ప :

టీమ్ ఇండియా సీనియర్ ఆటగాడు రాబిన్ ఉతప్ప అంతర్జా తీయ, దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. క్రికెట్లో దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించేశాడు. 38 ఏళ్ల ఈ కర్ణాటక బ్యాటర్ అన్ని రకాల భారత క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. “ప్రొఫెషనల్ క్రికెట్ ఆడడం మొదలెట్టి 20 ఏళ్లవుతోంది. నా దేశానికి, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన అత్యున్నత గౌరవం పూర్తి ఒడుదొడుకు లతో ఈ అద్భుత ప్రయాణం సాగింది. అని తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : అంతర్జా తీయ, దేశవాళీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సీనియర్ ఆటగాడు రాబిన్ ఉతప్ప
ఎవరు : రాబిన్ ఉతప్ప
ఎప్పుడు :సెప్టెంబర్ 14
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |