Daily Current Affairs in Telugu 13 November – 2022
2023నాటికీ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచిన భారత్ :

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత దేశం ఆవిర్భవించబోతంది. అది 2023లోనే ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాదిలో చైనాను అధిగమించి ప్రపంచంలోనే మోస్ట్ పాపులేటెడ్ కంట్రీగా భారత్ నిలవబోతోందని ఐరాస తెలిపింది. అంతేకాదు. నవంబర్ 15వ తేదీ నాటికి ప్రపంచ జనాభా ఎనిమిది వందల బిలియన్ కు చేరుకోనుందని ప్రకటించింది. జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన UN వరల్డ్ పాపులేషన్ ప్రొసీడ్స్) 2012లోనే ఈ వివరాలను పొందుపరిచారు. అయితే. అంచనా వేసిన గడువు దగ్గర పడుతుండడంతో ఇప్పుడు ఆ వివరాలను బయటికి విడుదల చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : 2023లోనే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచిన భారత్
ఎవరు : భారత్
ఎప్పుడు : నవంబర్ 13
దేశంలోనే మొదటి జాతీయ జీవ సమాచార భాండాగారం ప్రారంభం :

ప్రభుత్వ సాయం తో జరిగిన పరిశోధనల ద్వారా సేకరించిన జీవ సంబంధ సమాచారాన్ని భద్రపరచడానికి “దేశంలోనే మొదటి జాతీయ భాండాగారాన్ని ఫరీదాబాద్ హర్యానాలో ప్రారంబించారు. ప్రాంతీయ బయోటెక్నాలజీ కేంద్రంలో దీనిలో 4 పెటా బైట్ల సమాచార నిధి ఏర్పాటుకు ఇక్కడ వసతులు ఉన్నాయి. బ్రహ్మ సూపర్ కంప్యూటర్ కూడా ఉంది. ఇక్కడ కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఈ భాండాగారాన్ని భారతీయ జీవసంబంధ సమాచార నిక్షిప్త (ఐవీడీసీ) గా వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : దేశంలోనే మొదటి జాతీయ జీవ సమాచార భాండాగారం ప్రారంభం :
ఎప్పుడు : నవంబర్ 13
2022 ఏడాది టి-20 క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్న ఇంగ్లాండ్ జట్టు :

అత్యుత్తమ జట్టునే విజయం వరించింది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ను ఇంగ్లాండ్ సొంతం వేసుకుంది. నవంబర్ 13న జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ 5. వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను ఓడించింది. మొదట పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది. అనంతరం ఇంగ్లాండ్ 19. ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్ వైఫల్యంతో పాక్ కు ముందే విజయావకాశాలు సన్నగిల్లాయి.తర్వాత చక్కటి బౌలింగ్ తో ప్రత్యర్థికి కళ్లెం వేసినా లక్ష్యం చిన్నది కావడంతో కాపాడుకోలేకపోయింది. బౌలింగ్లో సామ్: కరన్ (3/12), బ్యాటింగ్ లో బెన్ స్టోక్స్ (52 నాటౌట్: 19 బంతుల్లో 5×4, 1×6) సత్తా చాటి ఇంగ్లాండ్ ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లిష్ జట్టుకిది రెండో టీ20 ప్రపంచకప్. ఆ జట్టు 2010లో తొలిసారి విజేతగా నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : 2022 ఏడాది టి-20 క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్న ఇంగ్లాండ్ జట్టు
ఎవరు : ఇంగ్లాండ్ జట్టు
ఎప్పుడు : నవంబర్ 13
గోవాలో జగరనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా

గోవాలో 20 నుండి 28 నవంబర్ 2022 వరకు జరుగుతుంది. IFFI యొక్క 53వ ఎడిషన్ ఆస్ట్రియన్ చిత్రం ‘అల్మా & ఆస్కార్ ‘తో 20 నవంబర్ 2022న ప్రారంభమవుతుంది. మరి పనాజీలోని ఐనాక్స్ లో ఈ చిత్రం ప్రదర్శించబడుతుందని చిత్రోత్సవ నిర్వాహకులు భావిస్తున్నారు. IFFIని డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ మరియు గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తాయి. దీనిని భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 53వ ఎడిషన్లో గోల్డెన్ పీకాక్ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. కోసం మొత్తం 15 సినిమాలు పోటీ పడనున్నాయి. IFFI యొక్క 3వ ఎడిషన్ లో అందించబడిన మొదటి గోల్డెన్ పీకాక్ నుండి, ఈ అవార్డు ఆసియాలో అత్యధికంగా కోరబడిన చలనచిత్ర అవార్డులలో ఒకటి.
క్విక్ రివ్యు :
ఏమిటి : గోవాలో జగరనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా
ఎవరు : గోవా
ఎప్పుడు : నవంబర్ 13
నవంబర్ 10 ని ‘మిల్లెట్ డే’గా ప్రకటించిన ఓడిశా రాష్ట్రం :

ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశిర మాసం మొదటి గురువారం నవంబర్ 10 న రాష్ట్రంలో ‘మాండియా’ డే’ లేదా ‘మిల్లెట్ డే’గా పాటించాలని ప్రకటించారు. ప్రజలలో సూపరఫ్ఫుడ్-మిల్లెట్ వాడకం మరియు సాగును ప్రాచుర్యం పొందడం మరియు ప్రోత్సహించడం దీని లక్ష్యం. నవంబరు 10వ తేదీని మినుములకు అంకితమైన రోజుగా ప్రకటించిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం 2017-18 సంవత్సరంలో ఒడిశా మిల్లెట్ మిషన్ ను పాడించించింది. ఇది వ్యవసాయ శాఖ మరియు రైతుల సాధికాంత యొకు ప్రారంభించింది. ఇది వ్యవసాయ శాఖ మరియు రైతుల సాధికారత యొక్క ప్రధాన కార్యక్రమం.
క్విక్ రివ్యు :
ఏమిటి : నవంబర్ 10 ని ‘మిల్లెట్ డే’గా ప్రకటించిన ఓడిశా రాష్ట్రం
ఎవరు : ఓడిశా రాష్ట్రం
ఎప్పుడు : నవంబర్ 13
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |