Daily Current Affairs in Telugu 13 December- 2022

daily current affairs in telugu pdf 2022

Daily Current Affairs in Telugu 13 December- 2022

ధూమపానాన్ని దశలవారీగా నిర్మూ లించే ప్రత్యేక ప్రణాళికను ఆమోదించిన న్యూజిలాండ్ :

ధూమపానాన్ని దశలవారీగా నిర్మూ లించే ప్రత్యేక ప్రణాళికను న్యూజిలాండ్ డిసెంబర్ 13న   ఆమోదించింది. యువత సిగరెట్లు కొనడంపై జీవిత కాల నిషేధం విధించేలా దీన్ని రూపొందించింది. 2009 జనవరి 1వ తేదీ తర్వాత పుట్టిన వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదని నిర్ణయించింది. దీని ప్రకారం సిగరెట్లు కొనుగోలుకు అవసరమైన కనీస వయసు భవిష్యత్తులో పెరుగుతూ ఉంటుంది. 50 ఏళ్ల తర్వాత ఎవరైనా ఓ వ్యక్తి సిగరెట్లు కొనాల౦టే అతడి వయసు కనీసం 63 ఏళ్లు ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది. ఈలోపు ధూమపానం నెమ్మదిగా తగ్గిపోతుందని ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. 2025 నాటికి దూమపాన రహిత దేశంగా న్యూజిలాండ్ను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు వారు పేర్కొన్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ధూమపానాన్ని దశలవారీగా నిర్మూ లించే ప్రత్యేక ప్రణాళికను ఆమోదించిన న్యూజిలాండ్

ఎక్కడ : న్యూజిలాండ్

ఎప్పుడు : డిసెంబర్ 13

గవర్నర్ ఛాన్సలర్గా వ్యవహరించే విధానానికి స్వస్తి పలికే బిల్లుకు ఆమోదం తెలిపిన కేరళ రాష్ట్ర ప్రభుత్వం :

కేరళలోని విజయన్ ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. రాష్ట్రంలోని  విశ్వవిద్యాలయాలన్నింటికీ గవర్నరే ఛాన్సలర్గా వ్యవహరించే విధానానికి స్వస్తి పలికి విద్యారంగ నిపుణులను ఆ పదవిలో నియమించడానికి అనుమతించే బిల్లును రాష్ట్ర శాసనసభ డిసెంబర్ 13న ఆమోదించింది. బిల్లుకు సమ్మతి తెలుపుతూనే ప్రతిపక్ష యూడీఎఫ్ అందులో కొన్ని మార్పులు సూచించింది. ఎల్డీఎఫ్ ప్రభుత్వం వాటిని ఆమో దించకపోవడంతో సభ నుంచి ప్రతిపక్షం వాకౌట్ చేసింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : గవర్నర్ ఛాన్సలర్గా వ్యవహరించే విధానానికి స్వస్తి పలికే బిల్లుకు ఆమోదం తెలిపిన కేరళ రాష్ట్ర ప్రభుత్వం

ఎక్కడ :  కేరళ రాష్ట్ర౦

ఎవరు : కేరళ రాష్ట్ర ప్రభుత్వం

ఎప్పుడు : డిసెంబర్ 13

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎంపిక అయిన  జోస్ బట్లర్ :

 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నవంబర్ 2022 కొరకు ICC ప్లేయర్ ఆఫ్ ది మంచ్ అవార్డుల విజేతలను ప్రకటించింది. లో తన  ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ విజేత కెప్టెన్ జోస్ బట్లర్ నవంబర్ అద్భుతమైన ప్రదర్శన తర్వాత మొదటిసారిగా ICC ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్ కు  ఎంపికయ్యాడు. బ్రిస్బేన్ లో  న్యూజిలాండ్ త+తో జరిగిన  100వ టీ20 మ్యాచ్ ఆడుతున్న ఓపెనర్ బట్లర్ 47 బంతులలో 73 పరుగులు సాధించారు.ఆవిదంగా ఆ జట్టు విజయం లో కీలక పాత్ర పోషించారు .

క్విక్ రివ్యు :

ఏమిటి : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎంపిక అయిన  జోస్ బట్లర్

ఎవరు : జోస్ బట్లర్

ఎప్పుడు : డిసెంబర్ 13

‘ఆర్ఆర్ఆర్ చిత్రానికి దక్కిన మరో అంతర్జాతీయ పురస్కారం  :

అంతర్జాతీయ వేదికలపై ‘ఆర్ఆర్ఆర్’ మెరుపులు కొనసాగుతున్నాయి. ఇటీవలే ఈ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ పురస్కారం దక్కించుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడీ సినిమాకు సంగీత విభాగంలో మరో అంతర్జాతీయ పరస్కారం దక్కింది. లాస్ ఏంజెలెస్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి బెస్ట్ మ్యూజిక్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్ చిత్రానికి గానూ కీరవాణి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. ఈ విష యాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల ద్వారా పంచు. కుంటూ సంతోషం వ్యక్తం చేసింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : ‘ఆర్ఆర్ఆర్ చిత్రానికి దక్కిన మరో అంతర్జాతీయ పురస్కారం 

ఎవరు : ఎం.ఎం కీరవాణి

ఎప్పుడు : డిసెంబర్ 13

ఖాట్మండులో ప్రారంభమైన  ఇంటర్నేషనల్ మౌంటైన్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క 20వ ఎడిషన్ :

ఖాట్మండు ఇంటర్నేషనల్ మౌంటైన్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క 20వ ఎడిషన్ 8 డిసెంబర్ 2022న నేపాల్లో లోని ఖాట్మండులో ప్రారంభమైంది. ఈ ఉత్సవం డిసెంబర్ 8 నుండి 12, 2022 వరకు నిర్వహించబడింది.  సిద్ధాంత్ సిరిస్ దర్శకత్వం వహించి నిర్మించిన హిందీ చిత్రం అయేనా, ఖాట్మండు ఇంటర్నేషనల్ మౌంటైన్ ఫిల్మ్ ఫెస్టివల్ 20వ ఎడిషన్లో ప్రదర్శించబడింది. నేపాలీ, కొరియన్, హిందీ, స్పానిష్, రష్యన్, ఫ్రెంచ్, డయోలా, ఇటాలియన్ మరియు ఎల్బనీస్ భాషలలో 55 సినిమాలు ప్రదర్శించబడ్డాయి. ఈ సంవత్సరం ఫిల్మ్ ఫెస్ట్ యొక్క థీమ్ ‘ సస్టైనబుల్ సమ్మిట్స్  గా  ఉంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఖాట్మండులో ప్రారంభమైన  ఇంటర్నేషనల్ మౌంటైన్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క 20వ ఎడిషన్

ఎక్కడ : ఖాట్మండులో

ఎప్పుడు : డిసెంబర్ 13

Download Manavidya app

Daily current affairs in Telugu Pdf November - 202
Daily current affairs in Telugu 01-11-2022
>Daily current affairs in Telugu 02-11-2022
Daily current affairs in Telugu 03-11-2022
Daily current affairs in Telugu 04-11-2022</strong>
Daily current affairs in Telugu 05-11-2022
Daily current affairs in Telugu 05-11-2022
Daily current affairs in Telugu 06-11-2022</strong>
Daily current affairs in Telugu 07-11-2022
Daily current affairs in Telugu 08-11-2022
>Daily current affairs in Telugu 09-11-2022
Daily current affairs in Telugu 10-11-2022
Daily current affairs in Telugu 11-11-2022
Daily current affairs in Telugu Pdf October 2022
Daily current affairs in Telugu Pdf Octobe r01 - 2022
Daily current affairs in Telugu Pdf October 02 - 2022
Daily current affairs in Telugu Pdf October03 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October04 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October05 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October 6 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October07 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October08 - 2022 PDF</strong>
Daily current affairs in Telugu Pdf October09 - 2022
Daily current affairs in Telugu Pdf October 10 - 2022
Daily current affairs in Telugu Pdf October 11 - 2022
Daily current affairs in Telugu Pdf October 12 - 2022
Daily current affairs in Telugu Pdf October 13 - 2022
Daily current affairs in Telugu Pdf October 14 - 2022
Daily current affairs in Telugu Pdf October 15 - 2022
Daily current affairs in Telugu Pdf October 16 - 2022
Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *