Daily Current Affairs in Telugu 12&13 -06-2021

Daily Current Affairs in Telugu 12&13 -06-2021

RRB Group d Mock test

ఫ్రెంచ్ ఓపెన్ లో డబుల్స్ టైటిల్ ను గెలుచుకున్న క్రెజికోవా-సినియాకోవా జంట :

బార్బరా క్రెజికోవా మరో విజయం ను సొంతం చేసుకుంది.. ఫ్రెంచ్ ఓపెన్ లో ఇప్పటికే మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన ఈ చెక్ రిపబ్లిక్ అమ్మాయి  తాజాగా  డబుల్స్  లోనూ విజేతగా నిలిచి అరుదుగా’డబుల్ టైటిల్ ను’ సాధించింది.  జూన్ 13 న జరిగిన ఫైనల్లో రెండోసీడ్ లో క్రెజికోవా-సినియాకోవా జంట 6-4, 6-1తో పద్నాలుగో సీడ్  ఇగా స్వైటెక్ (పోలెండ్) – బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా) జోడీని ఓడించి టైటిల్ గెలుచుకున్నారు.. ఒకవైపు సినియోకోవా నెట్ గేమ్ తో ఆకట్టుకోగా ఇంకోవైపు క్రెజికోవా బేస్ లైన్ ఆటతో అదరగొట్టింది. ఈ మ్యాచ్ లో అయిదుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసిన క్రెజికోవా ద్వయం  చాలా తేలిగ్గా విజయాన్ని అందుకుంది. దీంతో 2000 లో ఫ్రెంచ్ ఓపెన్లో సింగిల్స్, డబుల్స్ టైటిళ్లు గెలిచిన మేరీ పియర్స్ (ఫ్రాన్స్) సరసన క్రెజికోవా చోటు దక్కించుకుంది. చివరిగా సెరెనా విలియమ్స్ (2016) తర్వాత ఇలా ఒక గ్రాండ్ మ్ టోర్నీలో ‘డబుల్ సాధించి ఈ ఘనత సాధించినది కూడా బార్బరానే. మరోవైపు మహుత్ – హెర్బర్ట్ (ఫ్రాన్స్) పురుషుల డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఫ్రెంచ్ ఓపెన్ లో డబుల్స్ టైటిల్ ను గెలుచుకున్న క్రెజికోవా-సినియాకోవా జంట

ఎవరు: క్రెజికోవా-సినియాకోవా

ఎప్పుడు : జూన్ 13

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోచోటు సంపాదించిన భారత దిగ్గజం వినూ మన్కడ్ :

ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ నేపథ్యంలో అయిదు దేశాలకు చెందిన పది మంది దిగ్గజాలకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు కల్పించింది. తరానికి ఇద్దరికి చొప్పున అయిదు తరాల క్రికెటర్లను ఐసీసీ ఎంపిక చేసింది. ఇందులో భారత దిగ్గజం వినూ మన్కడ్ కూడా ఉన్నాడు. “క్రికెట్ చరిత్రలో ఈ పది మంది పాత్ర ఎంతో ముఖ్యమైంది. వీరి చేరికతో హాల్ ఆఫ్ ఫేమ్ లో  ఆటగాళ్ల సంఖ్య 103కు చేరింది” అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. తాజాగా  హాల్ ఆఫ్ ఫేమ్ లో  చోటు దక్కిన వారిలో వినూ మన్కడ్ తో పాటు ఫాల్కనర్ (దక్షిణాఫ్రికా), మాంటే నోబుల్ (ఆస్ట్రే లియా), కాన్స్టంటైన్ (వెస్టిండీస్), స్టాన్ మెక్కేబ్ (ఆస్ట్రేలియా), టెడ్ డెకర్ (ఇంగ్లాండ్), డెస్మండ్ హేన్స్ (వెస్టిండీస్), బాబ్ విలిస్ (ఇంగ్లాండ్), ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే), కుమార సంగక్కర (శ్రీలంక) ఆటగాళ్ళు ఉన్నారు. భారత క్రికెట్లో గొప్ప ఆల్రౌండర్ గా పేరున్న మన్కడ్. 44 టెస్టుల్లో 2109 పరుగులు చేశాడు. అతడు ఓపెనర్. ‘మన్కడ్ తన ఎడమచేతి వాటం స్పిన్ తో 162 వికెట్లు పడగొట్టాడు. మన్కడ్ పేరిట బీసీసీఐ దేశవాళీ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తుందన్న సంగతి తెలిసిందే.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోచోటు సంపాదించిన  భారత దిగ్గజం వినూ మన్కడ్

ఎవరు: వినూ మన్కడ్

ఎప్పుడు :జూన్ 14

ఇజ్రాయెల్లో  నూతన ప్రధాని గా నప్తాలీ బెన్నెట్ బాద్యతలు స్వీకారం

ఇజ్రాయెల్లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (71) పన్నెండేళ్ల పాలన ముగిసింది. రాజకీయ అస్థిరతకు కాస్త విరామం లభించినట్టయింది. నెతన్యాహు స్థానంలో ఒకప్పటి ఆయన అనుచరుడు నప్తాలీ బెన్నెట్ (49) ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. పార్లమెంటు నెసెట్  జూన్ 13  సమావేశమై బెన్నెట్ ను  ప్రధానిగా ఎన్నుకుంది. వెంటనే ఆయన పదవీ ప్రమాణం అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉండే ఎనిమిది పార్టీలు కూటమిగా ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండడం విశేషం. ఇందులో అరబ్బులకు ప్రాతినిధ్యం వహించే ఓ చిన్న పార్టీ కూడా ఉంది. పార్లమెంటు ‘నెనెట్టా’లో 120 స్థానాలు ఉండగా, అందులో ఈ కూటమి బలం కేవలం 61 సీట్లే కావడంతో ప్రభుత్వ మనుగడపై అప్పుడే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందం ప్రకారం యమినా పార్టీకి చెందిన బెన్నెట్ 2023 సెప్టెంబరు వరకు పదవిలో ఉండనున్నారు. తరువాత యెష్ అటిడ్ పార్టీ నాయకుడు యాయిర్ లపిడ్ కు బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ కూటమి ఏర్పాటులో లపిడ్ కీలక పాత్ర పోషించారు. ఆయన రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. 30 సీట్లతో ఇప్పటికీ అతి పెద్ద పార్టీగా ఉన్న  లీకుడు ఆధ్వర్యం వహిస్తున్న నెతన్యాహు విపక్షనేత పాత్రను పోషిస్తారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఇజ్రాయెల్లో  నూతన ప్రధాని గా నప్తాలీ బెన్నెట్ బాద్యతలు స్వీకారం

ఎవరు: నప్తాలీ బెన్నెట్

ఎప్పుడు : జూన్ 13

అమెరికన్ వ్యక్తి ఫెడరల్ జడ్జిగా మొట్టమొదటిసారి ఒక ముస్లిం ఎంపిక :

అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక ముస్లిం అమెరికన్ వ్యక్తి ఫెడరల్ జడ్జిగా ఎంపికయ్యారు. దీనికి సంబంధించి 81-16 ఓట్లతో సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో అమెరికా మొట్టమొదటి ముస్లిం-అమెరికన్ ఫెడరల్ జడ్జిగా పాకిస్తాన్ సంతతికి చెందిన జహీద్ ఖురేషీ (46) నియమితులయ్యారు. న్యూజెర్సీలోని జిల్లా కోర్టులో ఆయన విధులు నిర్వహించనున్నారు. సెనెట్ ఇందుకు 81-16 ఓట్లతో ఆమోదం తెలిపింది. 2019లో ఖురేషీ న్యూజెర్సీలోని ఓ కోర్టుకు మేజిస్ట్రేట్ గా ఎంపికయ్యారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: అమెరికన్ వ్యక్తి ఫెడరల్ జడ్జిగా ఎంపికైన మొట్టమొదటిసారి ఒక ముస్లిం

ఎవరు: జహీద్ ఖురేషీ

ఎప్పుడు : జూన్ 13

పోలాండ్ ఓపెన్ వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్ లో స్వర్ణం పతకం గెలుచుకున్న వినేశ్ ఫొగాట్ :

పోలాండ్ ఓపెన్ వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నీలో భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ స్వర్ణం పతకం గెలుచుకుంది. 26 ఏళ్ల భారత రెజ్లర్ వినేశ్ 53 కేజీల విభాగంలో చాంపియన్ గా నిలిచింది. పోలాండ్ రాజధాని వార్సాలో జూన్ 11న జరిగిన ఫైనల్లో వినేశ్ ఫోగాట్ 8-0తో క్రిస్టినా బెరెజా (ఉక్రెయిన్) పై విజయం సాధించింది.  2021 ఏడాది వినేశ్ ఫోగాట్ ఆసియా చాంపియన్ షిప్, మాటియో పెలికాన్ టోర్నీలో స్వర్ణ పతకాలను గెలుచుకుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: పోలాండ్ ఓపెన్ వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్ లో స్వర్ణం పతకం గెలుచుకున్న వినేశ్ ఫొగాట్

ఎవరు: వినేశ్ ఫొగాట్

ఎప్పుడు : జూన్ 14

ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారం గెలుచుకున్న భారత సంతతికి చెందిన పాత్రికేయులు :

భారత సంతతికి చెందిన ఇద్దరు సాహసోపేత పాత్రికేయులను ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారం వరించింది. చైనాలోని కల్లోలిత షిన్జియాంగ్ ప్రావిన్స్ లో ప్రభుత్వ దురాగతాలను దైర్యంగా వెలుగులోకి తెచ్చిన ”బజ్ ఫడ్ న్యూస్’ జర్నలిస్టు మేఘా రాజగోపాలన్ ‘అంతర్జా తీయ రిపోర్టింగ్ విభాగంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అక్కడ లక్షల మంది ముస్లింలను నిర్బంధించడానికి భారీగా నిర్మించిన రహస్య కారాగారాలను ఆమె తన వినూత్న పరిశోధనా త్మక కథనాలతో బట్టబయలు చేశారు. భారత సంతతికి చెందిన మరో పాత్రికేయుడు నీల్ బేడికీ కూడా ఈ పురస్కారం లభించింది. భవిష్యత్ లో  నేరానికి పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించడానికి అమెరికాలోని పాస్కో కౌంటీలో స్థానిక భద్రత అధికారులు తెచ్చిన ఒక కంప్యూటర్ మోడలింగ్ లోని లోపాలను ఎత్తిచూపుతూ రాసిన కథనాలకు క్యాథలీన్ మెక్ గ్రోరీతో కలిసి ఆయన అవార్డును పంచుకోనున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రతిష్టాత్మక పులి ట్జర్ పురస్కారం గెలుచుకున్న భారత సంతతికి చెందిన పాత్రికేయులు

ఎవరు: మేఘా రాజగోపాలన్

ఎప్పుడు : జూన్ 13

యు.ఎన్సి,టి.ఏ.డి యొక్క సెక్రటరీ జనరల్‌గా నియమితులైన మొదటి మహిళా ఆర్థికవేత్త రెబెకా గ్రిన్‌స్పాన్‌ :

కోస్టా రికాన్ ఆర్థికవేత్త మరియు సెంట్రల్ అమెరికన్ దేశం యొక్క మాజీ ఉపాధ్యక్షులు యు.ఎన్ యొక్క వాణిజ్య మరియు అభివృద్ధి సంస్థ యొక్క సెక్రటరీ జనరల్‌గానియమితులైన మొదటి మహిళగా నిలిచారు. ఐక్యరాజ్యసమితి వాణిజ్య మరియు అభివృద్ధి సదస్సు (యుఎన్‌సిటిఎడి) సెక్రటరీ జనరల్‌గా కోస్టా రికాన్ ఆర్థికవేత్త రెబెకా గ్రిన్‌స్పాన్‌ను నియమించడానికి యు.ఎన్. జనరల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కాగా ఆమె యొక్క  పదవీకాలం  నాలుగేళ్ల పాటు ఉండనుంది. యు.ఎన్సి,టి.ఏ.డి కి నాయకత్వం వహించిన మొదటి మహిళగా మరియు సెంట్రల్ అమెరికన్ గా ఆమె నిలవనుంది. ఆమెను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సెక్రటరీ జనరల్‌గా నామినేట్ చేశారు. ఈమె గ్రిన్స్పాన్ ఇసాబెల్లె స్థానంలో ఉండనున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: యు.ఎన్సి,టి.ఏ.డి యొక్క సెక్రటరీ జనరల్‌గా నియమితులైన మొదటి  మహిళా ఆర్థికవేత్త రెబెకా గ్రిన్‌స్పాన్‌

ఎవరు: ఆర్థికవేత్త రెబెకా గ్రిన్‌స్పాన్‌

ఎప్పుడు : జూన్ 14

 ప్రపంచ బాల కార్మిక వ్యతిరేఖ దినోత్సవం గా జూన్  12 :

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవంగా ప్రతి సంవత్సరం జూన్ 12 న జరుపుకుంటారు. దీనిని 2002 లో ఐఎల్‌ఓ అధికారికంగా గుర్తించింది. మహమ్మారి కారణంగా, ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికుల పెరుగుదల ఉంది.  చైల్డ్ లేబర్ అనేది ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతున్న ప్రపంచం ఇంకా ఎదుర్కో౦టున్న ప్రమాదంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి  పిల్లలలో పది మందిలో ఒకరు బాల కార్మికుల్లో ఉన్నారు. 2000 నుండి బాల కార్మికులలో పిల్లల సంఖ్య 94 మిలియన్లకు  తగ్గాయి, ఇటీవలి సంవత్సరాలలో తగ్గింపు రేటు మూడింట రెండు వంతుల వరకు తగ్గింది. యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క టార్గెట్ 8.7 2025 నాటికి బాల కార్మికులను అన్ని రకాలుగా అంతంచేయాలని పిలుపునిచ్చింది

.కాగా ఈ సంవత్సరం, బాల కార్మికులకు వ్యతిరేక ప్రపంచ దినోత్సవం యొక్క థీమ్ ‘యాక్ట్ నౌ: ఎండ్ చైల్డ్ లేబర్’ గా ఉంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రపంచ బాల కార్మిక వ్యతిరేఖ దినోత్సవం  గా జూన్  12 :

ఎవరు: ప్రపంచ వ్యాప్తంగా

ఎప్పుడు : జూన్ 12

AP Economy Survey  2019-2020

Daily current affairs in telugu May 2021
Daily current affairs in telugu 01-05-2021
Daily current affairs in telugu 02-05-2021
Daily current affairs in telugu 03-05-2021
Daily current affairs in telugu 04-05-2021
Daily current affairs in telugu 05-05-2021
Daily current affairs in telugu 06-05-2021
Daily current affairs in telugu 07-05-2021
Daily current affairs in telugu 08-05-2021
Daily current affairs in telugu 09-05-2021</strong>
Daily current affairs in telugu 10-05-2021
Daily current affairs in telugu 11-05-2021
Daily current affairs in telugu 12-05-2021
Daily current affairs in telugu 13-05-2021
Daily current affairs in telugu 14-05-2021
Daily current affairs in telugu 15-05-2021
Daily current affairs in telugu 16-05-2021
Daily current affairs in telugu 17-05-2021
Daily current affairs in telugu 18-05-2021
Daily current affairs in telugu 19-05-2021
Daily current affairs in telugu 20-05-2021
Daily current affairs in telugu 21-05-221
Daily current affairs in telugu 22-05-2021
Daily current affairs in telugu 23-05-2021
Daily current affairs in telugu 24-05-2021
>Daily current affairs in telugu 25-05-2021
Daily current affairs in telugu 26-05-2021
Daily current affairs in telugu 27-05-2021
Daily current affairs in telugu 28-05-2021
Daily current affairs in telugu 29-05-2021
Daily current affairs in telugu 30-05-2021
Daily current affairs in telugu 31-05-2021
Daily current affairs in Telugu Pdf April 2021
Daily current affairs in Telugu Pdf 01-04- 2021
Daily current affairs in Telugu Pdf 02-04- 2021
Daily current affairs in Telugu Pdf 03-04- 2021
Daily current affairs in Telugu Pdf 04-04- 2021
Daily current affairs in Telugu Pdf 05-04- 2021
Daily current affairs in Telugu Pdf 06-04- 2021
Daily current affairs in Telugu Pdf 07-04- 2021
Daily current affairs in Telugu Pdf 07-04- 2021
Daily current affairs in Telugu Pdf 08-04- 2021
Daily current affairs in Telugu Pdf 09-04- 2021
Daily current affairs in Telugu Pdf 10-04- 2021
Daily current affairs in Telugu Pdf 11-04- 2021
Daily current affairs in Telugu Pdf 12-04- 2021
Daily current affairs in Telugu Pdf 13-04- 2021
Daily current affairs in Telugu Pdf 14-04- 2021
Daily current affairs in Telugu Pdf 15-04- 2021
Daily current affairs in Telugu Pdf 16-04- 2021
Daily current affairs in Telugu Pdf 17-04- 2021
Daily current affairs in Telugu Pdf 18-04- 2021
Daily current affairs in Telugu Pdf 19-04- 2021
Daily current affairs in Telugu Pdf 20-04- 2021
Daily current affairs in Telugu Pdf 21-04- 2021
Daily current affairs in Telugu February- 2021
Daily current affairs in Telugu 01-03- 2021
Daily current affairs in Telugu 02-03- 2021
Daily current affairs in Telugu 03-03- 2021
Daily current affairs in Telugu 04-03- 2021
Daily current affairs in Telugu 05-03-2021
Daily current affairs in Telugu 06-03- 2021
Daily current affairs in Telugu 07-03- 2021
Daily current affairs in Telugu 08-03- 2021
Daily current affairs in Telugu 09-03- 2021
Daily current affairs in Telugu 10-03- 2021
Daily current affairs in Telugu 11-03- 2021
Daily current affairs in Telugu 12-03- 2021
Daily current affairs in Telugu 13-03- 2021
Daily current affairs in Telugu 14-03- 2021
Daily current affairs in Telugu 15-03- 2021
Daily current affairs in Telugu 16-03- 2021
Daily current affairs in Telugu 17-03- 2021
Daily current affairs in Telugu 18-03- 2021
Daily current affairs in Telugu 19-03- 2021
Daily current affairs in Telugu 20-03- 2021
Daily current affairs in Telugu 21-03- 2021
Daily current affairs in Telugu 22-03- 2021
Daily current affairs in Telugu 23-03- 2021
Daily current affairs in Telugu 24-03- 2021
Daily current affairs in Telugu 25-03- 2021
Daily current affairs in Telugu 26-03- 2021
Daily current affairs in Telugu 27-03- 2021
Daily current affairs in Telugu 28-03- 2021
Daily current affairs in Telugu 29-03- 2021
Daily current affairs in Telugu 30-03- 2021
Daily current affairs in Telugu 31-03- 2021

Download Manavidya app

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *