
Daily Current Affairs in Telugu 12&13-02-2022
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రెసి డెంట్ గా దేవాశీష్ మిత్రా ఎన్నిక :

2022-23 సంవత్సరానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రెసి డెంట్గా దేవాశీష్ మిత్రా గారుఎన్నికయ్యారు. అనికేత్ దం తగ్గి సునీల్ తలాటి వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరించనున్నారు. వీళ్లు శనివారం ఈ బాధ్యతలు చేపట్టారు. వాణిజ్య శాస్త్రంలో (కామర్స్) మాస్టర్ డిగ్రీను పూర్తి చేసిన మిత్రాకు అకౌంటింగ్ విభాగంలో 34 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఛార్టర్డ్ అకౌంటెంట్గానే కాకుండా.కాస్ట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీగానూ ఉన్నారు. తలాటి నప్పుడు ! కామర్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. 2014-15 సంవత్సరానికి సంబంధించి ఐసీఏఐ ఇక అహ్మదాబాద్ శాఖకు చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. 2017-18 సంవత్సరానికి సంబంధించి డబ్ల్యూఐఆర్సీకి సెక్రటరీగా వ్యవహరించారు. అకౌంటింగ్ విభాగానికి సంబంధించి ఉంది ప్రపంచంలోనే రెండో అతిపెద్దదైన ఐసీఏఐలో 3.4 లక్షల మంది సభ్యులు, ఏడు లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రెసి డెంట్ గా దేవాశీష్ మిత్రా ఎన్నిక
ఎవరు: దేవాశీష్ మిత్రా
ఎప్పుడు: ఫిబ్రవరి 12
ఐపిఎల్ లీగ్ చరిత్రలో అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా ఇషాన్ కిషన్ రికార్డు :

గత కొన్ని సీజన్లుగా ముంబయి ఇండియన్స్ తరపున నిలకడగా రాణించిన వికెట్ కీపర్ బ్యాట్స్మన్ ఇషాన్ కిషాన్ పంట పండింది. ఐపీఎల్ 15వ సీజనక్కు ముందు నిర్వహిస్తున్న మెగా వేలంలో అతనికి అనూహ్య ధర దక్కింది. తొలి రోజైన శనివారం అతని కోసం ఫ్రాంచైజీలు పోటీప డ్డాయి. కనీస ధర రూ.2 కోట్లతో వేలంలో అడుగుపెట్టిన అతన్ని దక్కించుకోవడానికి పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ పోటీపడగా చివరకు ముంబయి సొంతం చేసుకుంది. ఎలాగైనా అతణ్ని తిరిగి జట్టులోకి తీసుకోవాలనే పట్టుదల ప్రదర్శించిన ముంబయి అందుకు ఏకంగా రూ.15.25 కోట్లు చెల్లించింది. దీంతో మాజీ ఆల్రౌండర్ యువరాజ్ (2015 లో దిల్లీ క్యాపిటల్స్ రూ.16 కోట్లు) తర్వాత లీగ్ చరిత్రలో అత్యధిక ధర పలి కిన రెండో ఆటగాడిగా ఇషాన్ రికార్డు సృష్టించాడు. మొత్తంగా చూసుకుంటే నాలుగో ఆటగాడిగానిలిచాడు. గతంలో మోరిస్ (రూ.16.25 కోట్లు), యువరాజ్, కమిన్స్ (రూ.15.5 కోట్లు)కు అతనికంటే ఎక్కువ ధర దక్కింది. మరోవైపు ఆరంభ ఓవర్లలో కొత్త బంతితో వికెట్లు సాధించే దీపక్ చాహర్ ను తిరిగి సొంతం చేసుకోవడం కోసం సీఎస్కే ఏకంగా రూ.14 కోట్లు ఖర్చు పెట్టింది. దీంతో కెప్టెన్ ధోని (రూ.12 కోట్లు) కంటే అతను రూ.2 కోట్లు అదనంగా అందుకోనున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐపిఎల్ లీగ్ చరిత్రలో అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా ఇషాన్ కిషన్ రికార్డు
ఎవరు: ఇషాన్ కిషన్
ఎప్పుడు: ఫిబ్రవరి 13
బెంగళూరు ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో టైటిల్ ను సొంతం చేసుకున్న సాకేత్ ,రామనాథన్ జోడి :

సాకేత్ మైనేని రామ్కుమార్ రామనాథన్ జోడీ సత్తా చాటింది. బెంగళూరు ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో టైటిల్ను కైవసం చేసుకుంది. శనివారం పురుషుల డబుల్స్ ఫైనల్లో సాకేత్ జంట 6-3, 6 2తో హ్యూగో గ్రెనియర్-అలెగ్జాండ్రె ముల్లర్ (ఫ్రాన్స్)పై విజయం సాధించింది. తొలి సెట్లో ఆరంభంలోనే ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి 4-1తో ఆది క్యంలోకి వెళ్లిన భారత జోడీ అదే ఊపులో సెట్ గెలుచుకుంది. రెండో సెట్లో మరింత దాటిగా ఆడిన సాకేత్ ద్వయం సర్వీస్ లో అదరగొట్టి 6 2తో సెట్ తో పాటు మ్యాచ్ ను కైవసం చేసుకుంది. తొమ్మిదో ఛాలెంజర్ టైటిల్ కాగ. రామ్కుమార్ కు ఇది మూడోది.
క్విక్ రివ్యు :
ఏమిటి: బెంగళూరు ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో టైటిల్ ను సొంతం చేసుకున్న సాకేత్ ,రామనాథన్ జోడి
ఎవరు: సాకేత్ ,రామనాథన్
ఎప్పుడు: ఫిబ్రవరి 13
జర్మనీ అధ్యక్షుడిగా తిరిగి రెండోసారి ఎన్నికైన ఫ్రాంక్ ఓల్టర్ స్టాన్మార్ :

జర్మనీ అధ్యక్షుడిగా ఫ్రాంక్ ఓల్టర్ స్టాన్మార్ రెండోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో దిగువసభ సభ్యులు, జర్మనీలోని 16 రాష్ట్రాల ప్రతినిధులు భారీ మెజారిటీతో అధ్యక్షుడిగా స్టాన్మర్ ను ఎన్నుకున్నారు. ఎన్నికలకు ముందు స్టాన్మార్ అభ్యర్థిత్వానికి పలు ప్రధాన రాజకీయపార్టీలు మద్దతిచ్చాయి. దేశంలోని అందరి ప్రజలకు నేను బాధ్యత వహిస్తాను. అందులో ఎలాంటి పక్షపాతం ఉండదు. అయితే ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశమైతే మాత్రం తటస్థంగా ఉండను. ప్రజాస్వామ్యం కోసం పోరాడే వారివైపు నేను నిలుచుంటాను. ఎవరైతే ప్రజాస్వామ్యంపై దాడికి పాల్పడతారో వారికి వ్యతిరేఖంగా ఉంటాను అని చెప్పారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: జర్మనీ అధ్యక్షుడిగా తిరిగి రెండోసారి ఎన్నికైన ఫ్రాంక్ ఓల్టర్ స్టాన్మార్
ఎవరు: ఫ్రాంక్ ఓల్టర్ స్టాన్మార్
ఎప్పుడు: ఫిబ్రవరి 13
ఇంటర్నేషనల్ చాలెంజ్ ట్రోఫీ గెలుచుకున్న భారత యువ షట్లర్ తస్నీమ్ మీర్ ఇరాన్ :

భారత యువ షట్లర్ తస్నీమ్ మీర్ ఇరాన్ ఫజర్ ఇంటర్నేషనల్ చాలెంజ్ ట్రోఫీ కైవసం చేసుకుంది. మహిళల జూనియర్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ గా నిలిచిన ఏకైక భారత ప్లేయర్ రికార్డుల్లోకెక్కింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో 16 ఏండ్ల తస్నీమ్ 21-11, 11-21, 21-7తో యూ మహిళల జూనియర్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ గా నిలిచిన ఏకైక భారత ప్లేయర్ గా రికార్డుల్లోకెక్కింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో 16 ఏళ్ల తస్నీమ్ 21-11, 11-21, 21-7తో యూలియా సుసాంటోను చిత్తు చేసింది. సీనియర్ విభాగంలో ప్రస్తుతం ప్రపంచ 404వ ర్యాంక్లో ఉన్న తన్నీమ్ చాంపియన్గా నిలిచే క్రమంలో మార్టీనా రెపికా, పన్వర్, ఫాతిమాపై విజయాలు సాధించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇంటర్నేషనల్ చాలెంజ్ ట్రోఫీ గెలుచుకున్న భారత యువ షట్లర్ తస్నీమ్ మీర్ ఇరాన్
ఎవరు: తస్నీమ్ మీర్ ఇరాన్
ఎప్పుడు: ఫిబ్రవరి 13
ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ డెమోక్రసీ ఇండెక్స్ 2021 ను నివేదికలో అగ్ర స్థానంలో ఉన్న నార్వే :

ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIC) 2021లో 165 స్వతంత్ర దేశాలు మరియు రెండు భూభాగాల్లో ప్రజాస్వామ్య స్థితిపై డెమోక్రసీ ఇండెక్స్ 2021 ను నివేదికను విడుదలచేసింది. ఈ నివేదిక ఐదు ఫలితాలపై ఆధారపడింది. ఎన్నికల ప్రక్రియ మరియు బహువచనం, ప్రభుత్వ పనితీరు, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతిమ నివేదిక పూర్తి ప్రజాస్వామ్యం, లోపభూయిష్ట ప్రజాస్వామ్యం, హైబ్రిడ్ పాలన మరియు నిరంకుశంగా విభజించబడింది. మొత్తం స్కోరు 9. 75తో నార్వే డెమోక్రసీ ఇండెక్స్ 2021లో అగ్రస్థానంలో ఉండగా, మొత్తం స్కోరు 0.32తో ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర కొరియాను అతి తక్కువ ప్రజాస్వామ్య దేశం ఐన గ్లోబల్ ఇండెక్స్ లోపభూయిష్ట ప్రజాస్వామ్య విభాగంలో భారతదేశం మొత్తం స్కోరు 6.91తో 46వ స్థానంలో నిలిచింది. భారతదేశ పొరుగు దేశాల ర్యాంకింగ్ ను పరిశీలిస్తే, చైనా (143) మయన్మార్ (166), మరియు ఆఫ్ఘనిస్తాన్ (167) అధికార విభాగంలో, బంగ్లాదేశ్ (75), భూటాన్ స్థానాల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ డెమోక్రసీ ఇండెక్స్ 2021 ను నివేదికలో అగ్ర స్థానంలో ఉన్న నార్వే
ఎవరు: నార్వే దేశం
ఎప్పుడు: ఫిబ్రవరి 13
పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత రాహుల్ బజాజ్ కన్నుమూత :

బజాజ్ పేరు వినని వారు ఉండరేమో ఎందుకంటే మధ్యతరగతి ప్రజ లకు అత్యంత చేరువైందీ ద్విచక్ర వాహనం. రాజపుత్ర వీరుడు రాజాప్రతాప్ సింగ్ యుద్ధ భూమిలో అధిరోహించిన గుర్రం చేతిక్ పేరుతో మార్కెట్లోకి వచ్చి అది ఎంతగా ప్రాచుర్యం పొందిందో, పరిచయం చేసిన రాహుల్ బజాజ్ కూడా ప్రముఖ పారిశ్రామికవేత్తగా అంతే కీర్తిని పొందారు. కోట్ల మంది హృదయాల్లో ‘హమారా బజాజ్ గా నిలిచిపోయిన ఆ బజాజ్ గ్రూప్స్ అధినేత రాహుల్ బజాజ్(83) వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన మృతికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానసహా పలువురు సంతాపం తెలిపారు. ఈయన పద్మ భూషణ్ అవార్డు ను కూడా గెలుచుకున్నారు. ఎన్నో యునివర్సిటీ ల గౌరవ డాక్టరేట్ లను అందుకున్నారు.కాగా ఈయన ఇండియన్ ఎయిర్ లైన్స్ మాజీ చైర్మన్ గా కూడా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత రాహుల్ బజాజ్ కన్నుమూత
ఎవరు: రాహుల్ బజాజ్
ఎప్పుడు: ఫిబ్రవరి 12
యూఎస్జీబీసీ రూపొందించిన హరిత భవనాల జాబితాల లో మూడో స్థానంలో నిలిచిన భారత్ :

లీడ్ (లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్) ధ్రువీకరించిన హరిత భవనాల్లో గత సంవత్సరానికి గాను (2021) భారత్ కు మూడో స్థానం లభించింది. యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (యూఎస్జీబీసీ) రూపొందించిన జాబితా ప్రకారం తొలి రెండు స్థానాల్లో చైనా, కెనడా దేశాలు ఉన్నాయి. అమెరికాను ఈ జాబితాలో చేర్చనప్ప టికీ లీడ్ ప్రపంచంలోనే అతి పెద్ద విపణిగా ఆ దేశం కొనసాగుతోంది. ప్రపంచంలో, హరిత భవనాల రేటింగ్ కు లీడ్ ధ్రువీకరణను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. 2021 డిసెంబరు 31 నాటికి లీడ్ ధ్రువీకరణ ఆదారంగా ఈ ర్యాంకులను ఇచ్చారు. అమెరికానే కాకుండా ఇతర దేశాలు, ఆ ప్రాంతాల్లో భవనాల నిర్మాణం, డిజైన్ విషయంలో గణనీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయనే విషయాన్ని ఈ ర్యాంకులు ప్రతిబింబిస్తున్నాయని యూఎస్ బీబీసి వెల్లడించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: యూఎస్జీబీసీ రూపొందించిన హరిత భవనాల జాబితాల లో మూడో స్థానంలో నిలిచిన భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు: ఫిబ్రవరి 13
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |