Daily Current Affairs in Telugu 12 September -2022
భారతదేశంలోనే అతి పొడవైన రబ్బర్ డ్యామ్ ‘గయాజ్ డ్యామ్’ను ప్రారంబించిన బిహార్ సిఎం నితీష్ కుమార్ :

గయాలోని ఫల్గు నదిపై భారతదేశంలోనే అతి పొడవైన రబ్బర్ డ్యామ్ ‘గయాజ్ డ్యామ్’ను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ప్రారంభించారు. 394 కోట్ల అంచనా వ్యయంతో ఈ డ్యామ్ ను నిర్మించారు. ఐఐటీ రూర్కీ కి చెందిన నిపుణులు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్నారు.యాత్రికుల సౌకర్యార్థం డ్యామ్ లో ఏడాది పొడవునా తగినంత నీరు ఉంటుంది. దీని నిర్మాణంతో ఇప్పుడు విష్ణుపాద్ ఘాట్ సమీపంలోని ఫల్గు నదిలో పిండ దాస్ చేయడానికి వచ్చే భక్తులకు ఏడాది పొడవునా కనీసం రెండు అడుగుల నీరు అందుబాటులో ఉంటుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారతదేశంలోనే అతి పొడవైన రబ్బర్ డ్యామ్ ‘గయాజ్ డ్యామ్’ను ప్రారంబించిన బిహార్ సిఎం నితీష్ కుమార్
ఎవరు : బిహార్ సిఎం నితీష్ కుమార్
ఎక్కడ : : బిహార్
ఎప్పుడు : సెప్టెంబర్ 12
విశాఖ పట్నం లో జరగనున్న జిమెక్స్-2022 విన్యాసాలు :

బంగాళాఖాతంలో త్వరలో విశాఖపట్నం తీరాన జపాన్-భారత్ దేశాల నౌకాదళ విన్యాసాలు ప్రారంభం కానున్నట్టు నేవీ వర్గాలు సెప్టెంబర్ 12న తెలిపాయి. ఈ మారిటైం ద్వైపాక్షిక విన్యాసాలకు భారత నౌకాదళం సారధ్యం వహిస్తున్నట్లు పేర్కొన్నాయి. జపాన్ స్వీయ రక్ష ఐదళం (జేఎంఎల్డీఎఫ్) నౌకలు ఇజుమో, తకనమీలు విశాఖ తీరానికి చేరుకుంటున్నాయని వెల్లడించాయి. జిమెక్స్- 2022 విన్యాసాలను విశాఖలోని హార్బర్, సముద్ర పేర్లలో నిర్వహించనున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం మరింత బలోపేతం కావడానికి దోహదపడేలా విన్యాసాలు జరగనున్నట్టు నేవీ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : త్వరలో విశాఖలో జరగనున్న జిమెక్స్-2022 విన్యాసాలు
ఎక్కడ : విశాఖ పట్టణం (ఆంధ్రప్రదేశ్ )
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఐబీఎం క్వాంటం నెట్వర్క్ లోకి చేరిన తొలి భారతీయ విద్యాసంస్థగా నిలిచిన ఐఐటీ మద్రాసు :

ప్రతిష్టాత్మక ఐబీఎం క్వాంటం నెట్వర్క్ చేరిన తొలి భారతీయ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాసు గుర్తింపు పొందింది. భార ల్లో క్వాంటం కంప్యూటింగ్ నైపుణ్యం, పరిశోధనాభివృద్ధి లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఐబీఎం అత్యాధునిక క్వాంటం కంప్యూటింగ్ సిస్టం. ఎక్సరీస్ కు చెందిన క్లౌడ్ ఆధారిత అనుమతిని ఐఐటీ మద్రాస్ పొందనుంది. భారతకు అనువుగా ఉన్న రంగాల్లో ఐఐటీఎం పరిశోధన చేపట్టేలా ‘ఐబీఎం రీసెర్చ్ ఇండియా సహకారాన్ని అందించనుందని ఎఐటీఎం సంచాలకులు కామకోటి ఓ ప్రకటనలో తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐబీఎం క్వాంటం నెట్వర్క్ లోకి చేరిన తొలి భారతీయ విద్యాసంస్థగా నిలిచిన ఐఐటీ మద్రాసు
ఎవరు : ఐఐటీ మద్రాసు
ఎప్పుడు : సెప్టెంబర్ 12
భారత బిజినెస్ స్కూల్ లో దేశంలో తొలి స్థానం లో నిలిచిన ఐఐఎం బెంగళూర్ ఐ.ఐ.ఎం.బి

భారత బిజినెస్ స్కూల్ లో ఐఐఎం బెంగళూర్ ఐ.ఐ.ఎం.బి దేశంలో తొలి స్థానం లో నిలిచింది. బ్రిటీష్ డైలీ ఫైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్.టి) సంస్థ మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ (ఎంఐఎం) వార్షిక జాబితాను సెప్టెంబర్ 12న వెల్లడించింది. ప్రపంచస్థాయి బిజినెస్ స్కూల్స్ జాబితాలో ఫ్రాన్స్ యూఎస్, యూకే, డెన్మార్క్ బిజినెస్ స్కూల్స్ కంటే ముందంజలో ఉన్న ఐఐఎంబీ 31వ ర్యాంకు సాధించింది. గత ఏడాది ఎప్.టి ర్యాంకు (47)తో పోలిస్తే ఐఐఎంబీ 16 ర్యాంకులను మెరుగుపరచుకుంది. ముంబయిలోని ఎస్పీ జైన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్, ఐఐఎం లక్నోలు వరుసగా 44, 64 ర్యాంకుల్లో నిలిచాయి. ఐఐఎంచీ విద్యార్థి సగటున 144,178 డాలర్ల వార్షిక వేతనాన్ని పొందుతున్నట్లు ఎస్టీ ప్రకటించింది. తగిన బోధన, యాజమాన్య మండలిలో మహిళలకు ప్రాధాన్యం, డాక్టరేట్ అర్హతలున్న సిబ్బంది. అంతర్జాతీయ కోర్సులపై అవగాహన ‘వంటి ప్రమాణాలు పాటించిన ఐఐఎంబీ మెరుగైన ర్యాంకును సాధించినట్లు ఐఐఎంబీ డైరెక్టర్ ఆచార్య రిషికేశ కృష్ణన్ చెప్పారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత బిజినెస్ స్కూల్ లో దేశంలో తొలి స్థానం లో నిలిచిన ఐఐఎం బెంగళూర్ ఐ.ఐ.ఎం.బి
ఎవరు : ఐఐఎం బెంగళూర్ ఐ.ఐ.ఎం.బి
ఎప్పుడు : సెప్టెంబర్ 12
యు.ఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన స్పెయిన్ దేశ యువ సంచలనం కార్లోస్ అల్కరాస్ :

ప్రపంచ టెన్నిస్ పై తనదైన ముద్ర వేసేందుకు తహతహలాడుతున్న స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాస్, భవిష్యత్తు స్టార్ గా తనపై ఉన్న అంచనాలను తప్పుకాదని చాటి చెప్పాడు. యుఎస్ ఓపెన్ టైటిల్ ను చేజిక్కించుకుని తన గ్రాండ్ స్లామ్ టైటిళ్ల వేటను ఘనంగా ఆరంబించాడు ఆటతో అభిమానులను ఉర్రూతలూగించిన అల్కరస్ 6-4 2-6, 7-6 (7-1). 6-3తో కాస్పర్ రూడ్ (నార్వే) పై విజయం సాధిం వాడు కెరీర్ లో కేవలం రెండో పూర్తి స్థాయి. సీజన్ “మాత్రమే ఆడుతున్న అతడు లీటన్ హెవిట్ 20 ఏళ్ల 9 నెలలు, (2001)ను అధిగమించి అత్యంత పిన్నవయసు పురుషులు సింగిల్స్ నంబర్‌వన్ గా నిలిచాడు. 1978లో ఏజీపీ క్యాంటింగ్ మొదలయ్యాక అగస్తాన౦ సాధించిన తొలి టీనేజర్అల్కరాసే.
క్విక్ రివ్యు :
ఏమిటి :యు.ఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన స్పెయిన్ దేశ యువ సంచలనం కార్లోస్ అల్కరాస్
ఎవరు : కార్లోస్ అల్కరాస్
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డును గెల్చుకున్న సికిందర్ రజా :

ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డును జింబా౦బ్వే క్రికెటర్ సికిందర్ రజా దక్కించుకున్నాడు. తద్వారా ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్న తొలి జింబాబ్వే క్రికెటర్ గా రజా నిలిచాడు. పురుషుల విభాగంలో రజాకు దక్కగా మహిళల విభాగంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు లోని ఆల్ రౌండర్ మెక్తకు ఈ అవార్డు లభించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డును గెల్చుకున్న సికిందర్ రజా
ఎవరు : సికిందర్ రజా
ఎప్పుడు : సెప్టెంబర్ 12
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |