Daily Current Affairs in Telugu 12 November – 2022
ప్రతిష్టాత్మక ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారానికి ఎంపికైన వెంకీ రామకృష్ణన్ :

తమిళనాడులోని చిదంబరంలో పుట్టి లండన్లో స్థిరపడిన ప్రముఖ శాస్త్రవేత్త. నోబెల్ బహుమతి గ్రహీత వెంకీ రామకృష్ణన్ ఇంగ్లండ్ యొక్క ప్రతిష్టాత్మక ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ ఏడాది ఈ పురస్కారం పొందిన ఆరుగురిలో 70 ఏళ్ల వెంకీ రామకృష్ణన్ ఒకరు. సైన్యం, సైన్స్ కళలు, సాహిత్యం, సంస్కృతి తదితర అంశాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు బ్రిటన్ రాజకుటుంబం ఈ పురస్కారాలను ప్రదానం చేస్తుంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణానికి ముందు సెప్టెంబరులో రామకృష్ణన్ సహా ఆరుగురిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ప్రస్తుత రాజు చార్లెస్3 ఈ పుర స్కారాలను ప్రకటించినట్లు బరింగ్హామ్ ప్యాలెస్ వెల్లడించింది. అమెరికాలో బయాలజీ చదివిన రామకృష్ణన్.. తర్వాత బ్రిటన్ వెళ్లి స్థిరప వారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ప్రముఖ పరిశోధన కేంద్రం ఎంటర్స మాలిక్యులర్ బయాలజీ ల్యాబొరేటరీలో బృంద నాయకుడిగా సేవలందిస్తు న్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రతిష్టాత్మక ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారానికి ఎంపికైన వెంకీ రామకృష్ణన్
ఎవరు : వెంకీ రామకృష్ణన్
ఎప్పుడు : నవంబర్ 12
గాంధీ పీస్ పిలిగ్రిమ్ పురస్కారం అందుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ :

ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అట్లాంటాలో గాంధీ పీస్ పిలిగ్రిమ్ పురస్కారం అందు కున్నారు. మహాత్మాగాంధీ, డా.మార్టిన్ లూథర్ కింగ్ లు ప్రబోధించిన శాంతి, అహింసా సిద్ధాంతాల వ్యాప్తికి అలుపెరుగని కృషి చేస్తున్నందుకు గుర్తింపుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక ఆవార్డుకు ఎంపికయ్యారు మార్టిన్ లూథర్ కింగ్ అల్లుడు. ఇసాక్ ఫెర్రీస్, అట్లాంటాలో భారత్ కాన్సుల్ జనరల్ డా.స్వాతి కులకర్ణి సమక్షంలో అమెరికాలోని గాంధీ పౌండేషన్ ఈ పురస్కారాన్ని శ్రీశ్రీ రవి శంకర్ కు అందజేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : గాంధీ పీస్ పిలిగ్రిమ్ పురస్కారం అందుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్
ఎవరు : శ్రీశ్రీ రవిశంకర్
ఎప్పుడు : నవంబర్ 12
ఐసీసీ ఎఫ్.సి ఎ అద్యక్షుడిగా జై షా ఎన్నిక :

బీసీసీఐ కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి. (ఐసీసీ)లో కీలక పదవి చేపట్టనున్నాడు. ఐసీసీలో శక్తిమంతమైనఆర్ధిక, వాణిజ్య వ్యవహారాల (ఎఫ్ అండ్.సీఏ) కమిటీ అధ్యక్షుడిగా బోర్డు సమావేశంలో అతను ఎన్నికయ్యాడు. ఐసీసీలో అత్యంత ముఖ్యమైన కమిటీ బాధ్యతలు చూసుకోనున్నాడు. అన్ని ప్రధాన ఆర్ధిక విధానాల నిర్ణయాలను ఈ కమిటీ తీసుకుంటుంది. వీటిని ఐసీసీ బోర్డు: ఆమోదించాల్సి ఉంటుంది. “బోర్డులోని ప్రతి ఒక్క సభ్యుడు ఎఫ్అండ్.సీఏ కమిటీ అధ్యక్షుడిగా జై షాను అంగీకరించారు. ఈ కమిటీ కూడా -చైర్మన్ పదవి అంత శక్తిమంతమైంది. ప్రపంచ క్రికెట్కు భారత్ వాణిజ్య కేంద్రం అక్కడి నుంచే 70 శాతం కంటే ఎక్కువ స్పాన్సర్షిప్ వస్తోంది. అందుకే ఎఫ్ అండ్ సీఏకు బీసీసీఐ నేతృత్వం వహించడం అత్యవసరం” అని బిసిసిఐ వర్గాలు తెలిపాయి. ఈ ఎన్నికతో బీసీసీఐ తరపున ఐసీసీ ప్రతినిధి జై షా స్పష్టమైంది. ఐసీసీ క్రికెట్ కమిటీ అధ్యక్షుడిగా గంగూలీ కొనసాగనున్నాడు. ఐనీసీ చైర్మన్ గా వరుసగా రెండో సారి గ్రెగ్ బార్క్ లే (న్యూజిలాండ్) బాధ్యతలు వహిసస్తారు
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐసీసీ ఎఫ్.సి ఎ అద్యక్షుడిగా జై షా ఎన్నిక
ఎవరు : జై షా
ఎప్పుడు : నవంబర్ 12
ఆసియా ఎయిర్గన్ చాంపియన్షిప్ లో స్వర్ణ పతకాలు గెలుచుకున్న మెహులి ఘోష్, తిలోత్తమ సేన్ :

ఆసియా ఎయిర్గన్ చాంపియన్షిప్ లో మెహులి ఘోష్, తిలోత్తమ సేన్ స్వర్ణాలతో మెరిశారు. కొరియాలో డేగూలో జరుగుతున్న టోర్నీలో రెండో రోజు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో మెహులి 16-12తో చో యూన్యాంగ్ (దక్షిణ కొరియా)పై నెగ్గింది. జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ తుది పోరులో తిలోత్తమ 17-12తో మరో భారత షూటర్ నాన్సీపై గెలిచింది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా భారత్ మూడు స్వర్ణాలు సహా అయిదు పతకాలు సొంతం చేసుకుంది. తొలి రోజు జూని యర్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో దివ్యాంగ్ సింగ్ పన్వర్ పసిడి, శ్రీకార్తీక్ కాంస్యం నెగ్గగా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ సీనియర్ విభాగంలో కిరణ్ జాదవ్ రజతం సాధించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆసియా ఎయిర్గన్ చాంపియన్షిప్ లో స్వర్ణ పతకాలు గెలుచుకున్న మెహులి ఘోష్, తిలోత్తమ సేన్
ఎవరు : మెహులి ఘోష్, తిలోత్తమ సేన్
ఎప్పుడు : నవంబర్ 12
దేశంలోనే మొట్టమొదటి జాతీయ రిపోజిటరీ ‘ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్’ మంత్రి జితేంద్ర సింగ్ :

కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ హర్యానాలోని ఫరీదాబాద్‌లో లైఫ్ సైన్స్ డేటా కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి జాతీయ రిపోజిటరీ ‘ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్’ (IBDC)ని ప్రారంభించారు. భువనేశ్వర్‌లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC)లో డేటా ‘డిజాస్టర్ రికవరీ’ సైట్‌తో IBDC రీజనల్ సెంటర్ ఆఫ్ బయోటెక్నాలజీ (RCB), ఫరీదాబాద్‌లో స్థాపించబడింది. ఇది దాదాపు 4 పెటాబైట్ల డేటా నిల్వ సామర్థ్యం మరియు ‘బ్రహ్మ’ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (HPC) సదుపాయాన్ని కలిగి ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : దేశంలోనే మొట్టమొదటి జాతీయ రిపోజిటరీ ‘ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్’ మంత్రి జితేంద్ర సింగ్
ఎవరు : మంత్రి జితేంద్ర సింగ్
ఎప్పుడు : నవంబర్ 12
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |