
Daily Current Affairs in Telugu 11-04-2021
సంస్కృత అభ్యాస అనువర్తనం ‘లిటిల్ గురు’ అనే యాప్ ను ఆవిష్కరించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం :

సంస్కృత అభ్యాస యాప్ ‘లిటిల్ గురు’ బంగ్లాదేశ్‌లో భారత హైకమిషన్ ఇందిరా గాంధీ కల్చరల్ సెంటర్ (ఐజీసీసీ) ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు, మత పండితులు, ఇండోలాజిస్టులు మరియు చరిత్రకారులలో సంస్కృత భాషను ప్రోత్సహించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్) నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా సంస్కృత అభ్యాస యాప్ అనేది ఉంది. సంస్కృత అభ్యాస అనువర్తనం యాప్ ‘లిటిల్ గురు’ ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడింది, ఇది సంస్కృత అభ్యాసాన్ని సులభతరం, వినోదాత్మకంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.ఈ యాప్ ను ఇప్పటికే సంస్కృతం నేర్చుకుంటున్న వ్యక్తులకు లేదా సంస్కృతం నేర్చుకోవాలనుకునే వారికి ఆటలు, పోటీ, బహుమతుల, తోటివారి పరస్పర చర్యల ఆధారంగా సులభమైన పద్ధతిలో నేర్చుకోవడానికి సహాయపడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: సంస్కృత అభ్యాస అనువర్తనం ‘లిటిల్ గురు’ అనే యాప్ ను ఆవిష్కరించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం
ఎవరు: బంగ్లాదేశ్ ప్రభుత్వం
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సలహాదారుగా బీపీ ఆచార్య నియమకం :

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య నియమితులయ్యారు హైదరాబాద్ సమీపం షామీర్‌పేట్లో ఉన్న జీనోమ్ వ్యాలీలో 100 ఎకరాల్లో బయో మెడికల్ రీసెర్చ్ కోసం ఏర్పాటు చేయబోతున్న ప్రతిష్టాత్మకమైన “నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ”కి ఆయన సలహాదారుగా వ్యవహరించనున్నారు. రూ.300 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్ట్.. ఔషధాలు, వ్యాడ్మిన్ల తయారీ కోసం జంతువులపై ప్రి క్లినికల్ ట్రయల్స్ చేయడానికి దోహదపడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సలహాదారుగా బీపీ ఆచార్య నియమకం
ఎవరు: బీపీ ఆచార్య
ఎప్పుడు : ఏప్రిల్ 12
అత్యుత్తమ ఫ్లైయాష్ వినియోగ సంస్థగా “సింగరేణి సంస్థ కు జాతీయ పురస్కారం :

థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే బూడిద (ఫ్లైయాష్)ను 100 శాతం వినియోగంలోకి తెచ్చినందుకు గాను అత్యుత్తమ ఫ్లైయాష్ వినియోగ సంస్థగా “సింగరేణి సంస్థ కు జాతీయ పురస్కారం లభించింది 500 మెగావాట్ల పైబడి విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్న థర్మల్ ప్లాంట్ల విభాగంలో సింగరేణికి ఈ పురస్కారంఇటీవల దక్కింది. ఏప్రిల్ 10న గోవాలో మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సింగరేణి డెరైక్టర్ డి.సత్యనారాయణరావు ఈ అవార్డు అందుకున్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే బూడిదను ప్రధానంగా సిమెంటు కంపెనీలకు రవాణా చేస్తున్నారు. పసుతం పింగరేణి సంప ప్రీఎండీరాఎన్.తీదర్ ఉవ్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అత్యుత్తమ ఫ్లైయాష్ వినియోగ సంస్థగా “సింగరేణి సంస్థ కు జాతీయ పురస్కారం
ఎవరు: సింగరేణి సంస్థ
ఎక్కడ:తెలంగాణా
ఎప్పుడు : ఏప్రిల్ 12
లెజెండరీ షూటింగ్ కోచ్ సంజయ్ చక్రవర్తి కన్నుమూత :

లెజెండరీ షూటింగ్ కోచ్ సంజయ్ చక్రవర్తి కన్నుమూశారు కోవిడ్ -19 కారణంగా లెజెండరీ షూటింగ్ కోచ్ సంజయ్ చక్రవర్తి కన్నుమూశారు. అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, అంజలి భగవత్ మరియు సుమా శిరూర్, దీపాలి దేశ్‌పాండే, అనుజా జంగ్ మరియు అయోనికా పాల్ సహా అత్యుత్తమ భారతీయ షూటర్లకు ఈ ద్రోణాచార్య అవార్డు గ్రహీత శిక్షణ ఇచ్చాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: లెజెండరీ షూటింగ్ కోచ్ సంజయ్ చక్రవర్తి కన్నుమూత :
ఎవరు: సంజయ్ చక్రవర్తి
ఎప్పుడు : ఏప్రిల్ 12
మార్చ్ నెల ఐసీసీ ఉత్తమ క్రికెటర్ అవార్డును దక్కించుకున్న భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ :

మార్చ్ నెల ఐసీసీ ఉత్తమ క్రికెటర్ అవార్డును దక్కించుకున్న భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ సొంతం చేసు కున్నాడు. మార్చిలో ఇంగ్లాండ్లో పరిమిత ఓవర్ల సిరీస్ లో సత్తా చాటిన భువి ఈ అవార్డును గెలుచుకున్నాడు. మూడు వన్డేల సిరీస్లో 465 ఎకాన మీతో 8 వికెట్లు తీసిన ఈ పేసర్ ఆయిదు టీ20ల్లో కేవలం 6. 88 సగటుతో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది జనవరిలో ఈ అవార్డులను ప్రవేశ పెట్టాక ఈ పుర స్కారాన్ని అందుకున్న మూడో భారత ఆటగాడతను. భువి కన్నా ముందు పంత్, అశ్విన్ ఈ అవార్డులు దక్కించుకు న్నారు. భువితో పాటు అప్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, జించాబ్వే బ్యాట్స్ మన్ సీన్ విలియమ్స్ పురుషుల విభాగంలో ఈ పురస్కారానికి పోటీపడ్డారు. “ఇంగ్లాండ్తో వన్డే, టీ20 సిరీస్లలో సవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలో అతడు అద్భుతంగా బంతులేశాడు. దూకుడైన ఇంగ్లాండ్ బ్యాట్సమెన్ కు కళ్లెం వేయడమే కాక ఎంతో పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ సిరీస్లు గెలవడంలో అతడిది కీలకపాత్రపోషించాడు. భారత్ తో సిరీస్ లో సత్తా చాటిన దక్షిణాఫ్రికా బ్యాటర్ లిజెలీ లీకి ఈ నెల ఉత్తమ మహిళా క్రికెటర్ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: మార్చ్ నెల ఐసీసీ ఉత్తమ క్రికెటర్ అవార్డును దక్కించుకున్న భారత పేసర్ భువనేశ్వర్ కుమార్
ఎవరు:పేసర్ భువనేశ్వర్ కుమార్
ఎక్కడ: ఇండియా
ఎప్పుడు : ఏప్రిల్ 12
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |