
Daily Current Affairs in Telugu 11&12 August-2022
డిజిటల్ కరెన్సీ కలిగిఉన్న దేశాలలో ఏడవ స్థానం లో నిలిచిన భారత్ :

భారత జనాభాలో 7 శాతానికి పైగా ప్రజలు డిజిటల్ కరెన్సీ కలిగి ఉన్నారని ఐక్యరాజ్యసమితి (యూఎన్) వెల్ల ఉంచింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రిప్టో కరెన్సీల వినియోగం గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిందని తెలిపింది. యూఎన్ వాణిజ్యం, అభివృద్ధి సమాఖ్య యూఎన్సేటీఏడీ ప్రకారం, 2021లో అభివృద్ధి చెందిన 20 ఆర్థిక వ్యవస్థల్లో 15 దేశాల జనాలా క్రిప్టో కరెన్సీలు ఉన్నారు. ఉక్రెయిన్ దేశం జాబితాలో కలిగి ఉండి 12.7 శాతంతో తొలి స్థానంలో నిలిచింది రష్యా (119 శాతం), వెనెజువెలా (10.3 శాతం), సింగపూర్ (9.4 శాతం), కెన్యా (8.5 శాతం), యూఎస్ (8.3 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మన దేశంలో 7.3 శాతం మంది ప్రజలు డిజిటల్ కరెన్సీ కలిగి ఉన్నారు. అంతర్జాతీయంగా 20 ఆర్థిక వ్యవస్థలో టల్ కరెన్సీ వాటా కలిగి ఉన్న జనాభాలో భారత దేశానికి కలిగి ఉనట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : డిజిటల్ కరెన్సీ కలిగిఉన్న దేశాలలో ఏడవ స్థానం లో నిలిచిన భారత్
ఎవరు : భారత్
ఎప్పుడు : ఆగస్ట్ 11
భారత దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన జగదీప్ ధన్ ఖడ్ :

భారత దేశ 14వ ఉపరాష్ట్రపతిగాజగదీప్ ధన్ ఖడ్ ఆగస్ట్ 11న పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్ లో నిరాడంబరంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారు ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు. హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు జగదీప్ ధన్ బడ్ రాజ్‌ఘాట్ కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. పశ్చిమబెం గాల్ గవర్నర్ గా సేవలందించిన జగదీప్ ధన్ ఖడ్ ఇది ఈ నెల 8న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని మార్గరెట్ ఆళ్వాపై ఘన విజయం సాధించారు 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం. ముగియడంతో ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టారు. ధన్ ఖడ్ కు రాష్ట్రపతి, ప్రధాని, పలువురు కేంద్ర మంత్రులు ‘అభినందనలు తెలిపారు..
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన జగదీప్ ధన్ ఖడ్
ఎవరు : జగదీప్ ధన్ ఖడ్
ఎక్కడ : డిల్లీ
ఎప్పుడు : ఆగస్ట్ 11
ఫ్రాన్స్ అత్యున్నత పౌరపురస్కారం గెలుచుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత శశి తరూర్ :

కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంత పురం ఎంపీ శశిథరూర్ ఫ్రాన్స్ అత్యున్నత పౌరపురస్కారం ‘షువాలియె డి లా లిజియన్ హాసర్ వరించింది. శశి థరూర్ గారి రచనలు, ప్రసంగాలను గౌరవిస్తూ ఈ అవార్డును ప్రకటించినట్లు భారత్ లో ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనియన్ తెలిపారు. తనకు పురస్కారం దక్కడంపై శశి ధరూర్ గారు హర్షం వ్యక్తం చేశారు. “ఫ్రాన్స్ తో సంబంధాలను సమర్ధించే, భాషను ప్రేమించే, సంస్కృతిని ఆరాధించే వ్యక్తిగా. ఈ అవార్డు పొందడాన్ని గౌరవంగా భావిస్తున్నా. నన్ను దీనికి దీనికి ఎంపిక చేసినందుకు కృతజ్ఞ తలు” ఆయన -పేర్కొన్నారు. ‘అవార్డు వరించిన నేపథ్యంలో ధరూరు లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత ఆధీర్ రంజన్ చౌదరి సహా పలువురు హస్తం పార్టీ నేతలు అభినందనలు తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఫ్రాన్స్ అత్యున్నత పౌరపురస్కారం గెలుచుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత శశి తరూర్
ఎవరు : శశి తరూర్
ఎప్పుడు : ఆగస్ట్ 12
ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రచారం కర్తగా నియమితడయిన భారత క్రికెటర్ రిషబ్ పంత్ :

టీమ్ ఇండియా వికెట్ జేపర్ బ్యాట్స్ మాన్ రిషబ్ పంత్ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రచార కర్తగా నియమితుడయ్యాడు. సాధారణ నేపథ్యం నుంచి వచ్చినా. పట్టు దలతో ప్రపంచ క్రికెట్లో అతడు సాధించిన ఘనతలు ప్రతి ఒక్కరికే ప్రేరణ అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర సిఎం పుష్కర్ సింగ్ దామి మాట్లాడుతూ. పంత్ తన రాష్ట్రం, దేశం గర్వపడేలా చేశాడని చెప్పారు. కాగా హరిద్వార్ జిల్లా (ఉత్తరాఖండ్) రూర్కీలో పంత్ జన్మించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రచారం కర్తగా నియమితడయిన భారత క్రికెటర్ రిషబ్ పంత్
ఎవరు : రిషబ్ పంత్
ఎక్కడ : ఉత్తరాఖండ్ రాష్ట్ర౦
ఎప్పుడు : ఆగస్ట్ 12
స్నేస్ స్టిక్ పార్క్ ను ప్రారంబించిన ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాద్ :

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) స్పార్క్ అనే 3డి వర్చువల్ స్నేస్ స్టిక్ పార్క్ ను ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ గారు ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు. అవుతున్న సందర్భంగా జరుపుతున్న కార్యక్రమం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను పురస్కరించుకుని, ఇస్రో తన వివిధ మిషన్లకు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉన్న వర్చువల్ పార్కును ప్రారంభించబడింది. ఈ ప్లాట్ ఫారమ్ ఇస్రో ప్రయోగ వాహనాలు, ఉపగ్రహాలు మరియు శాస్త్రీయ మిషన్లకు సంబంధించిన అనేక పత్రాలు, చిత్రాలు మరియు వీడియోలని చేస్తుంది” అని తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : స్ స్టిక్ పార్క్ ను ప్రారంబించిన ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాద్
ఎవరు : ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాద్
ఎప్పుడు : ఆగస్ట్ 11
జూలై 2022 పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు విజేతగా నిలిచిన ప్రభాత్ జయసూర్య :

జూలై 2022 కొరకు ఐసిసి అందించే పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకోవడం ద్వారా శ్రీలంక దేశానికి చెందిన స్పిన్నర్ ప్రబాత్ జయసూర్య అంతర్జాతీయ క్రికెట్లో సంచలనాత్మక ఆరంభాన్ని ముగించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అంతర్జాతీయ క్రికెట్‌ను అద్భుతంగా ప్రారంభించిన తర్వాత ఆయన ఇంగ్లండ్ బ్యాటర్ మరియు జూన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ విజేత గా నిలిచిన జానీ బెయిర్‌స్టో మరియు ఫ్రెంచ్ సంచలనం గుస్తావ్ మెక్‌కీన్‌లను ప్రతిష్టాత్మకమైన ఈ నెలవారీ అవార్డు కోసం జయసూర్య వారిని అధిగమించి ఈ అవార్డు కు ఎంపిక అయ్యారు. అలాగే ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆల్-రౌండర్ ఎమ్మా లాంబ్‌లను జూలై 2022 కొరకు తమ మహిళల జాబితాలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల విజేతగా నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి :జూలై 2022 పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు విజేతగా నిలిచిన ప్రభాత్ జయసూర్య
ఎవరు : ప్రభాత్ జయసూర్య
ఎప్పుడు : ఆగస్ట్ 12
టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ రిటైర్మెంట్ ప్రకటింపు :

అమెరికా దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ రిటైర్మెంట్ ప్రకటించింది. విలియమ్స్ ప్రకటనలో ఆమె కుటుంబంపై దృష్టి సారిస్తున్నట్లు ఆమె దాదాపు ఐదు సంవత్సరాల కుమార్తె అక్కగా ఉండాలని కోరుకుంటుంది. విలియమ్స్ రెడ్డిట్ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్‌ను వివాహం చేసుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ రిటైర్మెంట్ ప్రకటింపు
ఎవరు : సెరెనా విలియమ్స్
ఎప్పుడు : ఆగస్ట్ 12
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |