
Daily Current Affairs in Telugu 10&11 September -2022
వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ :

ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ 11 సెప్టెంబర్ 2022న వన్డే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు.కాగా ఇకపై ఆరోన్.ఫించ్ ఆస్ట్రేలియాక్రికెట్ జట్టు యొక్క ట్వంటీ 20 జట్టుకు కెప్టెన్‌గా మాత్రమే కొనసాగుతాడు మరియు 2022 అక్టోబర్ మరియు నవంబర్‌లలో ఆస్ట్రేలియాలో జరిగే T20 ప్రపంచ కప్‌లో దానికి నాయకత్వం వహిస్తాడు. అతను ఇప్పటి వరకు 145 ODI మ్యాచ్‌లు ఆడాడు, అందులో 54 మ్యాచ్ లకు కెప్టెన్‌గా ఉన్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్
ఎవరు : ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్
ఎక్కడ: ఆస్ట్రేలియా
ఎప్పుడు : సెప్టెంబర్ 11
SCO సమ్మిట్ కోసం ఉజ్బెకిస్థాన్‌కు 2 రోజుల పర్యటించనున్న ప్రదాని నరేంద్ర మోడి :

సెప్టెంబరు 15న SCO సమ్మిట్ కోసం ఉజ్బెకిస్థాన్‌కు 2 రోజుల పర్యటనను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ యొక్క 22వ సమావేశానికి హాజరయ్యేందుకు 2022 సెప్టెంబర్ 15 నుండి ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో 2 రోజుల పర్యటనలో ప్రధాని మోదీ ఉన్నారు. ప్రాంతీయ & ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన సమయోచిత అంశాలు సమావేశంలో చర్చించబడతాయని భావిస్తున్నారు. రాజ్‌నాథ్ సింగ్ 24 ఆగస్టు 2022న ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌లో జరిగిన SCO రక్షణ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : SCO సమ్మిట్ కోసం ఉజ్బెకిస్థాన్‌కు 2 రోజుల పర్యటించనున్న ప్రదాని నరేంద్ర మోడి
ఎవరు : ప్రదాని నరేంద్ర మోడి
ఎక్కడ: ఉజ్బెకిస్థాన్
ఎప్పుడు : సెప్టెంబర్ 11
చైనా సరిహద్దులోని ఒక సైనిక స్థావరంతో పాటు కీలక రహదారికి దేశ తొలి త్రిదళాదిపతి బిపిన్ రావత్ నామకరణ :

చైనా సరిహద్దులోని ఒక సైనిక స్థావరంతో పాటు కీలక రహదారికి దేశ తొలి త్రిదళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) దివంగత జనరల్ బిపిన్ రావత్ పేరు పెట్టారు. భారత్, చైనాల మధ్య వాస్తవాధీన రేఖ (ఎల్పీసీ) వెంట లోహిత్ లోయలోని కిబత్ సైనిక స్థావరానికి ‘రావత్ మిలిటరీ గారిసన్ గా.వాలోంగ్ నుంచి కిబత్ కు వచ్చే 22 కిలోమీటర్ల రహదారికి రావత్ మార్గ౦ గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా రావత్ నిలువెత్తు చిత్రం ను అవిష్కరించారు. సెప్టెంబర్ 11న జరిగిన ఈ కార్యక్రమంలో’ అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బి.డి. మిశ్రా. ముఖ్యమంత్రి పెమా ఖండుతో పాటు రావత్ కుమార్తెలు కృతిక, తరిణి కూడా పాల్గొన్నారు. గతేడాది డిసెంబరులో తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆయన సతీమణి సహా పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యు :
ఏమిటి : చైనా సరిహద్దులోని ఒక సైనిక స్థావరంతో పాటు కీలక రహదారికి దేశ తొలి త్రిదళాదిపతి బిపిన్ రావత్ నామకరణ
ఎవరు : బిపిన్ రావత్
ఎక్కడ: చైనా సరిహద్దులో
ఎప్పుడు : సెప్టెంబర్ 11
సీనియర్ పురావస్తు శాస్త్రవేత్త. పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత బ్రజ్ బాసీ లాల్ కన్నుమూత :

సీనియర్ పురావస్తు శాస్త్రవేత్త. పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత బ్రజ్ బాసీ లాల్ 101 ఏళ్ల వయసులో సెప్టెంబర్ 11న ఉదయం కన్నుమూశారు. ఢిల్లీ లోదీ శ్మశానవాటికలో జరిగిన అంత్యక్రియలకు పలువురు ప్రముఖులు, సినియర్ అధికారులు హాజరయ్యారు. ప్రొఫెసర్ బి బి. లాల్ గా ప్రసిద్ధుడైన ఈయన 1968-72 మధ్యకాలంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. (ఏఎస్ఐ) డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు వృత్తిపరంగా తాను గడించిన అపారమైన అనుభవంతో పుస్తకాలు రాశాడు. దేశంలో రామాయణ, మహాబాగవత ఇతిహాసాలతో ముడిపడి ఉన్న స్థలాలుగా జీవిస్తున్న ప్రాంతాల్లో బ్రిటి లాల్ జరింపి౦చిన తవ్వకాలు అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా, కొన్నిసార్లు వివాదాలకు కూడా దారి తీశాయి. అయోధ్యలో ప్రస్తుతం రామాలయం నిర్మిస్తున్న చోట దాదాపు 50 ఏళ్ల కిందట బి.వి.లాల్ సారధ్యంలో జరిపిన తవ్వకాల్లోనే ఆలయ స్తంబాల వంటివి తొలుత గుర్తించారు. చారిత్రక స్థలాలైన హస్తినాషర్, దిల్లీలోని ప్రధాణా బిలాల్లోనూ 1951 55 ప్రాంతంలో లాల్ అధ్యర్యంలోనే తవ్వకాలు జరిపారు .
క్విక్ రివ్యు :
ఏమిటి : సీనియర్ పురావస్తు శాస్త్రవేత్త. పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత బ్రజ్ బాసీ లాల్ కన్నుమూత
ఎవరు : బ్రజ్ బాసీ లాల్
ఎప్పుడు : సెప్టెంబర్ 11
యుఎస్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్న ఇగా స్వైటేక్ :

స్వైటెక్ ఆదరహో! ఫామ్ కొనసాగించిన ఈ నంబర్వన్ యుఎస్ ఓపెన్ టైటిల్ ఎగరేసుకుపోయింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో ఈ టాప్ సీడ్ 6-2, 7-6 (7-5)తో అయిదో సీడ్ జాబెర్ను ఓడించింది. ఒక్క రెండో సెట్లో తప్ప ప్రత్యర్థి నుంచి స్వైటెకు పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. తొలి గేమ్లో నే ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసిన ఆమె ఆదే కారుతో 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి 14 పాయింట్లతో 12 స్వైటెక్ సొంతమయ్యాయంటే ఈ పోలెండ్ తార ఎంత దూకుడుగా ఆడిందో అర్ధం చేసుకోవచ్చు. బేస్ లైన్ ఆటతో అదరగొట్టిన ఆమె. జాస్పర్ షాట్లతో పాటు, బ్యార్ప్యాండ్ విస్తర్లు, నెట్ డ్రాప్ లతో పాయింట్లు సాధించింది. కోర్టులో అటు ఇటూ వేగంగా తిరుగుతూ మెరుపు రిటర్న్స్తో అదరగొటిన ఉ6-2తో సులభంగా సెల్ గెలిచింది. యుఎస్ ‘ఓపెన్ గెలవడం స్వైటెక్కు ఇదే తొలిసారి. గతంలో ఈ ప్రిక్వార్టర్స్కు చేరడమే ఆమె అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. యుఎస్ ఓపెన్ గెలిచిన తొలి పోలెండ్ అమ్మాయి ఇగానే
క్విక్ రివ్యు :
ఏమిటి : యుఎస్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్న ఇగా స్వైటేక్
ఎవరు : ఇగా స్వైటేక్
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఆసియా కప్ 2022 ను గెలుచుకున్న శ్రీలంక క్రికెట్ జట్టు :

శ్రీలంక ఆదరహో. టోర్నీ ఆరంభ మ్యాచ్ లో “అఫ్గానిస్థాన్ చేతిలో ఓడి ఏమాత్రం పోటీలో లేనట్లు కనిపించిన ఆ జట్టు ఆ తర్వాత ఒక్కటీ ఓడలేదు. అదిరే ప్రదర్శనతో ఇప్పుడు సగర్వంగా కప్పును ముద్దాడింది. ఆదివారం జరి గిన ఫైనల్లో 22 పరుగుల తేడాతో పాకిస్థాన్ను మట్టికరిపించింది. బానుక రాజపక్స (71 నాటౌట్, 45 బంతుల్లో 6-4, 3.6) పోరాటంతో మొదట శ్రీలంక 6 వికెట్లకు 170 పరుగులు సాధించింది. రవూప్ (3/29) విజృంభించాడు. లంక ఓ దశలో 58కే అయిదు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడగా.. రాకపల్లి గొప్పగా బ్యాటింగ్ చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హసరంగ డిసిల్వా (38 2 బంతుల్లో 5-4, 1-6తో కలిసి అల్లుకు మెరుగైన స్కోరును అందించాడు. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ తడబడింది. ప్రమోద్ మదుషాన్ (1731), వాసరం గ డిసిల్వా (3/27) వ్వించించి చంతో 20 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆసియా కప్ 2022 ను గెలుచుకున్న శ్రీలంక క్రికెట్ జట్టు
ఎవరు : శ్రీలంక క్రికెట్ జట్టు
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి. కృష్ణంరాజు కన్నుమూత :

ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి. కృష్ణంరాజు (82) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3,16 గంటల సమయంలో తుదిశ్వాస విడిగారు. కొంతకాలంగా మధుమేహం, దీర్ఘకాలిక’ ఊపిరితిత్తుల వ్యాధి (సీవో పీడీ)తోపాటు వివిధ రకాల ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఏడాది కిందట మదుమేహం కారణంగా ఆయన పాదం కూడా తొలగించారు. ఇటీవల కావిడ్ సోకడంతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు కోలుకొని ఇంటికి చేరుకున్నా.పోస్టు కొనిడ్ సమస్యలు తలెత్తాయి. ఆగస్టు 5న తీవ్ర ఆయాసంతో మళ్లీ ఏం చేరారు. గత 27 రోజులుగా వెంటిలేటర్ చికిత్స చేస్తు అబిన్స్ న్నట్లు వైద్యులు తెలిపారు. కరోనరీ హార్డ్ డిసీజ్, క్రానిక్ హార్ట్ విడమ్ డిజార్డర్, పంపింగ్ ఒకదాని వెనుక ఒకటి ఆయనపై కంకోలేని విధంగా దాడి చేశాయి. బ్యాక్టీరియా వేంగల్ ఇన్ఫోకర్లతో తీవ్ర న్యుమోనియన్ కూడా రావడంతో సెప్టెంబర్ 10న కన్నుమూసారు. తెలుగు నాట ‘భక్తకన్నప్ప’ అనగానే గుర్తు కొచ్చే పేరు కృష్ణంరాజు, రౌద్ర ప్రధాన పాత్ర లకు ఆయన చిరునామాగా మారారు. అభినయంతో సంభాషణలు పలకడంలో తనదైన శైలిలో 1835 పైగా సినిమాల్లో నటించారు. 1968లో చిలకా గోరింకాతో కదానాయకుడిగా తెరంగేట్రం చేశారు. కొన్ని సినిమాల్లో ప్రతినాయ కుడిగా, తర్వాత కథానాయకుడిగా ప్రేక్షకులను మెప్పించారు. రెబల్ స్టార్ తనదైన ముద్ర ‘వేశారు. మరదీపం, బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాలకు కృష్ణం రాజు ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు పొందారు. ‘నంది’ అందుకున్న తొలి ఉత్తమ నటుడు ఆయనే కావడం విశేషం. ఉత్తమ సహ నటుడిగా జైలర్ గారబ్బాయ్ చిత్రానికి నంది అందు కున్నారు. 2014లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ప్రాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారం పొందారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి. కృష్ణంరాజు కన్నుమూత
ఎవరు : . కృష్ణంరాజు
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు : సెప్టెంబర్ 11
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |