
Daily Current Affairs in Telugu 11-05-2020
ఎంఎన్ఆర్ఇ కార్యదర్శిగా బాద్యతలు స్వీకరించిన ఇందు శేఖర్ చతుర్వేది :

ఇందుశేఖర్ చతుర్వేది కొత్త గా నియమితులయిన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శులుగా బాద్యతలు స్వీకరించారు.సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమితులయిన తరువాత అయన ఆనంద్ కుమార్ తరువాత అయన వచ్చారు.మే 11,2020 నుండి ఇందు శేఖర్ చతుర్వేది (ఐఏఎన్)కొత్త కార్యదర్శి ,కొత్త మరియు పునరుత్పాదక శాఖ గా బాద్యతలు స్వీకరించినట్లు కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఇ) ప్రకటించింది. చతుర్వేది 1987 బ్యాచ్ ఐఏఎస్అధికారి మరియు జార్ఖండ్ కు చెందినది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఎంఎన్ఆర్ఇ కార్యదర్శిగా బాద్యతలు స్వీకరించిన ఇందు శేఖర్ చతుర్వేది
ఎవరు : ఇందు శేఖర్ చతుర్వేది
ఎప్పుడు : మే 11
ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను శుబ్రపరచడానికి UV వ్యవస్థలను అబివృద్ధి చేసిన DRDO సంస్థ :

హైదరాబాద్ లోని DRDO యొక్క పరిశోదన కేంద్రం ఇమరత్ (RCI)ప్రయోగ శాల డిఫెన్స్ రీసర్చ్ అతి నీల లోహిత శానిటైజేర్ (DRUVS)పేరుతో ఆటోమేటెడ్ కాంటాక్ట్ లెస్ (UVC) శానిటైజేషన్ క్యాబినెట్ ను అబివృద్ధి చేసింది. మొబైల్ పోన్లు ఐపాడ్ లు ల్యాప్టాప్ లు కరెన్సీ నోట్లు,చెక్ లీఫ్ లు చలాన్లు,పాస్ బుక్ లు పేపర్ ఎన్వరలప్ మొదలైన్ వాటిని శుబ్రపరచడానికి ఇది రూపొందించబడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను శుబ్రపరచడానికి UV వ్యవస్థలను అబివృద్ధి చేసిన DRDO సంస్థ
ఎవరు : DRDO సంస్థ
ఎప్పుడు : మే 11
జపాన్ బ్యాంక్ డైరెక్టెర్ గా తొలిసారి మహిళా ఎగ్సిక్యుటివ్ గా టోకికో నియామకం :

సుమారు 138 సంవత్సరాల తరువాత జపాన్ సెంట్రల్ బ్యాంక్ కు తొలి సారి ఒక మహిళా ఎగ్సిక్యుటిక్ డైరెక్టర్ గా టోకికో శిమిజు నియమితులయ్యారు.టోకికో 1987 నుంచి బ్యాంక్ ఆఫ్ జపాన్ లో బ్యాంక్ ఉద్యోగినిగా విధులు నిర్వర్తిచటమే కాక ఫైనాన్షియల్ మార్కెట్ విదేశీ మారక కార్యకలాపాలను కూడా ఆమె చూసుకునేవారు.తరువాత 2016 నుంచి 2018 వరకు లండన్ ప్రదాన ప్రతినిధిగా ఐరోపాకు జనరల్ మేనేజర్ గా వ్యవహరించారు. జపాన్ సెంట్రల్ బ్యాంక్ లో మహిళా ఉద్యోగులు 47 శాతం ఉండగా సీనియర్ మేనేజేరియల్ పోస్టులలో కేవలం 13 శాతం,న్యాయ వ్యవహారాలు,చెల్లింపు వ్యవస్థలు బ్యాంకు నోట్లతో వ్యవహరించే నిపుణులు స్థానాల్లో కేవలం 20శాతం మాత్రమే మహిళా ఉద్యోగులున్నారు.జపాన్ జనాభా లో మహిళలు 51శాతం ఉండగా 2018 ప్రపంచ బ్యాంక్ గణాంకాల ప్రకారం ప్రపంచ ఆర్హ్తిక ఫోరం తాజా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ లో 153 దేశాల్లో జపాన్ 121 వ స్థానం లో ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : జపాన్ బ్యాంక్ డైరెక్టెర్ గా తొలిసారి మహిళా ఎగ్సిక్యుటివ్ గా టోకికో నియామకం
ఎవరు టోకికో
ఎక్కడ: జపాన్
ఎప్పుడు : మే 11
ఎంఎల్సీ అబ్యర్థిగా మహారాష్ట్ర సిఎం ఉద్దావ్ థాక్రే ఎన్నిక :

మహారాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉద్దావ్ తాకరె మే 11 న మహారాష్ట్ర విధాన మండలి (ఎమేల్సి)కి నామినేషన్ దాఖలు చేశారు. తొమ్మిది స్థానాల కోసం శివసేన,కాంగ్రెస్,ఎన్సిపి ల నుంచి అయిదుగురు బిజెపి కి చెందిన నలుగురు ఇలా మొత్తం గా తొమ్మిదిమంది బరిలో నిలిచారు. దీంతో విధాన మండలి ఎన్నికలు దాదాపు ఏకగ్రీవం అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలల్లో పోటీ చేయకుండానే ముఖ్యమంత్రి పదవి బాద్యతలు చేపట్టిన ఉద్దవ్ థాక్రే మే 27వ తేది లోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ గా ఎన్నికవడం అనివార్యంగా ఉన్న సంగతి తెలిసిందే .తొలిసారిగా ఉద్దావ్ తన నామినేషన్ దాఖలు చేయడంతో అయన తన ఆస్తుల వివరాలు వెల్లడించాల్సి వచ్చింది. తనకు 143 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. .
క్విక్ రివ్యు :
ఏమిటి : ఎంఎల్సీ అబ్యర్థిగా మహారాష్ట్ర సిఎం ఉద్దావ్ థాక్రే ఎన్నిక
ఎవరు : ఉద్దావ్ థాక్రే
ఎక్కడ:మహారాష్ట్ర
ఎప్పుడు : మే 11
కేఎఫ్ హెచ్ టోర్నమెంట్ వ్యవస్థాపకుడు పాండండ కుట్టప్ప కన్నుమూత :

కొదవ ఫ్యామిలీ హాకి టోర్నమెంట్ వ్యవస్థాపకుడు పాండండ కుట్టప్ప 1997 లో కొడవ ఫ్యామిలీ హాకి ఫెస్టివల్ కార్యక్రమం ను రూపొందించారు. అతను మాజీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి మరియు మాజీ ఫస్ట్ డివిజన్ హాకి రిఫరీ. పాండండ కుట్టప్ప 2015 లో కర్ణాటక రాజ్యోత్సవం మొదటి అవార్డును అందజేశారు. కుట్టప్ప చివరిసారిగా టోర్నమెంట్ ను పర్యవేక్షించాడు.22 సంవత్సరాల నుండి కొడవ ఫ్యామిలీ హాకి టోర్నమెంట్ ప్రతి సంవత్సరం కర్ణాటక లో జరుగుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : కేఎఫ్హిచ్ టోర్నమెంట్ వ్యవస్థాపకుడు పాండండ కుట్టప్ప కన్నుమూత
ఎవరు : పాండండ కుట్టప్ప
ఎప్పుడు : మే 11
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |