Daily Current Affairs in Telugu 10&11 December- 2022

daily current affairs in telugu pdf 2022

Daily Current Affairs in Telugu 10&11 December- 2022

ప్రపంచంలోని బలమైన పాస్ పోర్ట్ జాబితాలో 87వ స్థానం లో నిలిచిన భారతదేశం :

ప్రపంచంలోని బలమైన పాస్ పోర్ట్ జాబితాలో భారతదేశం 87వ స్థానంలో ఉండగా, 2022 పాస్పోర్ట్ రేటింగ్ లో UAE మొదటి స్థానంలో నిలిచింది. యూఏఈ తర్వాతి స్థానాల్లో జర్మనీ, స్వీడన్, ఫిన్లాండ్, లక్సెంబర్గ్, స్పెయిన్, ఫ్రాన్స్ ఉన్నాయి. ఆఫ్ఘనిస్థాన్ దేశం చివరి స్థానంలో కొనసాగుతుండగా, పాకిస్థాన్ 94వ స్థానంలో ఉంది. 171 దేశాలకు సులభంగా యాక్సెస్ ఉన్నందున జపాన్  దేశం 24వ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, హెన్రీ & పార్ట్నర్స్ విడుదల చేసిన జాబితాలో జపాన్ పాస్పోర్ట్ ప్రపంచంలోనే అత్యుత్తమ పాస్పోర్ట్ ర్యాంక్ చేయబడింది.  కాగా ఆర్దన్ క్యాపిటా ఎల్ ప్రచురించిన పాస్పోర్ట్ ఇండెక్స్ 2022 ప్రపంచంలోని అత్యంత -బలమైన మరియు బలహీనమైన పాస్పోర్ట్ ల ను ర్యాంక్ చేసింది. SAB పాస్పోర్ట్ లు కలిగిన ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది     ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా 180 దేశాలలో ప్రవేశించవచ్చు.

క్విక్ రివ్యు :

ఏమిటి ; ప్రపంచంలోని బలమైన పాస్ పోర్ట్ జాబితాలో 87వ స్థానం లో నిలిచిన భారతదేశం

ఎవరు : భారతదేశం

ఎప్పుడు : డిసెంబర్ 10

అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ తాత్కాలిక సియివో గా నిహార్ మాలవీయ  నియామకం :

అమెరికాలోని న్యూయార్క్ లో అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ తాత్కాలిక ప్రధాన కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా భారత సంతతికి చెందిన నిహార్ మాలవీయ  (48)ను నియమిస్తున్నట్లు మాతృసంస్థ బెర్టెల్స్ మాన్ శుక్రవారం ప్రకటించింది. మాలవీయ 2023 జనవరి 1న బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటివరకు సీఈవోగా వ్యవహరించిన మార్కస్ డోల్ రాజీనామా చేయడంతో మాలవీయను తాత్కాలిక సీఈవోగా నియమించారు. ఇప్పుడు బెర్జెల్స్ మాన్ గ్రూప్ మేనేజ్మెంట్ కమిటీలో ఎనిమిది దేశాలకు చెందిన 20 మంది ఉన్నతాధికారులు ఉన్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి ; అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ తాత్కాలిక సియివో గా నిహార్ మాలవీయ  నియామకం

ఎవరు : నిహార్ మాల

ఎక్కడ : అమెరికా

ఎప్పుడు : డిసెంబర్ 10

ప్రతిష్టాత్మక ఎస్ఐఈఎస్ అవార్డ్ గెలుచుకున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు :

ప్రజా నాయకుడిగా అందించిన సేవలకు గాను మాజీ  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు డిసెంబర్ 11 న ప్రతిష్టాత్మక ఎస్ఐఈఎస్ (సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్ ‘సొసైటీ) చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే వివిధ రంగాల్లో జాతికి అందించిన సేవలకు గాను కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్బన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా, ప్రఖ్యాత కార్డియాలజిస్టు మార్తాండ వర్మ శంక వాలియనాథన్, భారత ప్రభుత్వ శాస్త్ర సలహాదారు అజయ్ సూర్, పేరుగాంచిన హరికథా విద్యాలసుడు. విశాఖ హరీలు పుర స్కారాలు అందుకున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి ; ప్రతిష్టాత్మక ఎస్ఐఈఎస్ అవార్డ్ గెలుచుకున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఎవరు : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఎక్కడ : డిల్లి

ఎప్పుడు : డిసెంబర్ 10

అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించి ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా నిలిచిన  ఇషా కిషన్ :

టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ 210, 131 బంతుల్లో రెచ్చిపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడడంతో అనుకోకుండ. మూడో వన్డేకు జట్టులోకి వచ్చిన అతను బంగ్లాదేశ్  బాలింగ్ ను ఉతికారేస్తూ మెరుపు డబుల్ సెంచరీ సాదించాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ అతడిదే. ఈ ఘనత అందుకున్న అత్యంత పిన్న వయస్కుడు కూడా అతనే ఇంకా మరెన్నో రికార్డులు అతడి సొంతమయ్యాయి. ఇషాన్ కిషన్ ద్విశతకానికి కోహ్లి (113 91 బంతుల్లో 11-1- 246) సెంచరీ కూడా తోడవడంతో 8 వికెట్లకు 400) పరుగుల భారీ స్కోరు. సాధించిన భారత్ బంగ్లాదేశ్ 229 పరుగుల తేడాతో ఓడించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి ; అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించి ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా నిలిచిన  ఇషా కిషన్

ఎవరు : ఇషా కిషన్

ఎప్పుడు : డిసెంబర్ 10

గుజరాత్  రాష్ట్ర ముఖ్యమంత్రిగా  భూపేంద్రపటేల్ ప్రమాణ స్వీకారం :

గుజరాత్  రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూపేంద్రపటేల్ వరుసగా రెండోసారి గాంధీనగర్ లో డిసెంబర్ 10న  ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిల్షా సహా పలుపురు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమం . త్రులు హాజరవుతున్నారు. రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్రపటేల్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ మద్యాహ్నం రెండు గంట లకు కొత్త సచివాలయం సమీపంలోని హెలి ప్యాడ్ మైదానంలో ప్రమాణం చేయిస్తారు. ఘట్టోడియా స్థానాన్ని భూపేంద్ర 1.92 లక్షల ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుచుకు న్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి ; గుజరాత్  రాష్ట్ర ముఖ్యమంత్రిగా  భూపేంద్రపటేల్ ప్రమాణ స్వీకారం

ఎవరు : భూపేంద్రపటేల్

ఎక్కడ : గుజరాత్ రాష్ట్ర౦

ఎప్పుడు : డిసెంబర్ 10

హిమాచల్ ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ ప్రమాణ స్వీకారం :

పర్వత ప్రాంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్, ఉపము ఖ్యమంత్రిగా ముకేశ్ అగ్నిహోత్రి ఆదివారం ప్రమాణం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్టేకర్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తది తరులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందు దిగ్గజ కాంగ్రెస్ నేత, ఆరు సార్లు రాష్ట్ర సీఎంగా పనిచేసిన దివంగత వీరభద్రసింగ్ చిత్ర రా పటానికి పార్టీ నేతలు ప్రష్పాంజలి ఘటించారు. హిమాచల్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య మూడుకు చేరింది రాజస్థాన్, చత్తీస్గడ్ లో హస్తం పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలి సిందే సుబ్వీందర్ ప్రమాణ స్వీకారానికి ఆ రెండు రాష్ట్రాల సీఎంలు అశోక్ హోల్, భూపేశ్ బఘేల్ కూడా విచ్చేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి ; హిమాచల్ ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ ప్రమాణ స్వీకారం

ఎవరు : సుఖ్వీందర్ సింగ్

ఎక్కడ : హిమాచల్ ప్రదేశ్

ఎప్పుడు : డిసెంబర్ 11

గోవా లో ప్రారంభం కానున్న 9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్  ఆరోగ్య ఎక్స్‌పో 2022 :

9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ (WAC) మరియు ఆరోగ్య ఎక్స్‌పో 2022 ఈరోజు గోవాలోని పనాజీలో ప్రారంభమైంది. గ్లోబల్ స్థాయిలో ఆయుష్ వైద్య వ్యవస్థల సామర్థ్యాన్ని ప్రదర్శించడం దీని యొక్క  లక్ష్యం.ఈ సందర్భంగా ‘ఆయుష్మాన్’ కామిక్ బుక్ సిరీస్ మూడో ఎడిషన్ కూడా విడుదలైంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA) మరియు రోసెన్‌బర్గ్ యొక్క యూరోపియన్ అకాడమీ ఆఫ్ ఆయుర్వేద, జర్మనీల మధ్య సాంప్రదాయ భారతీయ వైద్య విధానాలలో అధునాతన అధ్యయనాల కోసం ఒక అవగాహన ఒప్పందం కుదిరింది.

క్విక్ రివ్యు :

ఏమిటి ; గోవా లో ప్రారంభం కానున్న 9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్  ఆరోగ్య ఎక్స్‌పో 2022

ఎక్కడ : గోవా లో

ఎప్పుడు : డిసెంబర్ 11

పేరూ దేశ  నూతన అధ్యక్షులుగా దిన బోలువార్టే  ఎన్నిక :

 పేరూ దేశ  నూతన అధ్యక్షురాలిగా దిన బోలువార్టే   ఎన్నికయ్యారు. కాగా పేరూ దేశ  మాజీ అద్యక్షుఫు పెడ్రో కాస్టిల్లో అభిశంసన విచారణలో తొలగించబడినప్పుడు రాజకీయ సంక్షోభం మధ్య పెరూ యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలిగా దిన బోలువార్టే నియమితులయ్యారు. పెరూ యొక్క లెఫ్టిస్ట్ ప్రెసిడెంట్ పెడ్రో కాస్టిల్లో చట్టవిరుద్ధంగా కాంగ్రెస్‌ను మూసివేయడానికి ప్రయత్నించిన తరువాత చట్టసభ సభ్యులచే తొలగించబడ్డారు మరియు పోలీసులచే నిర్బంధించబడ్డారు.

క్విక్ రివ్యు :

ఏమిటి ; పేరూ దేశ  నూతన అధ్యక్షులుగా దిన బోలువార్టే  ఎన్నిక

ఎక్కడ : పేరూ దేశంలో

ఎప్పుడు : డిసెంబర్ 11

పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ గాయని సులోచన చవాన్ కన్నుమూత :

మహారాష్ట్రకు చెందిన ప్రముఖ లావాణీ గాయని, పద్మశ్రీ అవార్డు గ్రహీత సులోచనా చవాన్ (92) కన్నుమూసారు. రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో సులోచనను పద్మశ్రీ అవార్డ్ తో సత్కరించారు. ఆమె అధ్బుతమైన గాత్రంతో లావణి సమ్రాదిని(క్వీన్ ఆఫ్ లావణి) బిరుదును సైతం స్వీకరించారు. ప్రముఖ లావని పాటలను పాడటంలో సులోచన ప్రసిద్ధి చెందారు. 1965 నాటి చిత్రం మల్లరి మార్తాండ్, 1964లో వచ్చిన చిత్రం సవాల్ మజా ఐకా నుంచి      ఆమె ఆలపించిన  పాటలు ఆమెకు మంచి పేరు సంపాదించి పెట్టాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి  :పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ గాయని సులోచన చవాన్ కన్నుమూత

ఎవరు : సులోచన చవాన్

ఎప్పుడు : డిసెంబర్ 11

మానవ హక్కుల దినోత్సవంగా డిసెంబర్ 10 :

ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సం గా జరుపుకుంటారు. ఇది 1948 సంవత్సరం  లో ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ UNGA  మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన UDHR ను ఆమోదించిన రోజును సూచిస్తుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి  : మానవ హక్కుల దినోత్సవంగా డిసెంబర్ 10

ఎప్పుడు : డిసెంబర్ 10

Download Manavidya app

Daily current affairs in Telugu Pdf November - 202
Daily current affairs in Telugu 01-11-2022
>Daily current affairs in Telugu 02-11-2022
Daily current affairs in Telugu 03-11-2022
Daily current affairs in Telugu 04-11-2022</strong>
Daily current affairs in Telugu 05-11-2022
Daily current affairs in Telugu 05-11-2022
Daily current affairs in Telugu 06-11-2022</strong>
Daily current affairs in Telugu 07-11-2022
Daily current affairs in Telugu 08-11-2022
>Daily current affairs in Telugu 09-11-2022
Daily current affairs in Telugu 10-11-2022
Daily current affairs in Telugu 11-11-2022
Daily current affairs in Telugu Pdf October 2022
Daily current affairs in Telugu Pdf Octobe r01 - 2022
Daily current affairs in Telugu Pdf October 02 - 2022
Daily current affairs in Telugu Pdf October03 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October04 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October05 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October 6 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October07 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October08 - 2022 PDF</strong>
Daily current affairs in Telugu Pdf October09 - 2022
Daily current affairs in Telugu Pdf October 10 - 2022
Daily current affairs in Telugu Pdf October 11 - 2022
Daily current affairs in Telugu Pdf October 12 - 2022
Daily current affairs in Telugu Pdf October 13 - 2022
Daily current affairs in Telugu Pdf October 14 - 2022
Daily current affairs in Telugu Pdf October 15 - 2022
Daily current affairs in Telugu Pdf October 16 - 2022
Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *