
Daily Current Affairs in Telugu 10 August-2022
కామన్వెల్త్ పెన్సింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణ పథకం గెలుచుకున్న భవాని దేవి :

ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో భారత అథ్లెట్లు అదరగొట్టారు. ఇప్పుడు అక్కడే కామన్వెల్త్ పెన్సింగ్ చాంపియన్ షిప్ జరుగుతుండగా ఇందులోనూ భారత పెన్సర్ సత్తా చాటింది చెన్నైకి చెందిన భవానీ దేవి అద్భుత ప్రదర్శనతో స్వర్ణం నిలబెట్టుకుంది. టైటిల్ నిలబెట్టుకునే క్రమంలో 42వ ర్యాంకర్ భవాని 15-10తో రెండో సీడ్ వెరొనికా వాసిలెవా (ఆస్ట్రేలియా)ను కంగుతినిపించింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్ గా ఘనత వహించిన ఆమె పసిడి పోరులో చక్కని ప్రతిభ కనబరిచింది. ఈ ఏడాది ఆరంభంలో తడబాటుకు గురైన కాని ఆమె ఈ చాంపియన్‌షిప్ మాత్రం నిలకడైన ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. తొలుత ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ కప్ లో 23వ స్థానంలో నిలిచి నిరాశ పడింది. అనంతరం జూలైలో కైరోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ రెండో రౌండ్లోనే ఇంటి దారి పట్టింది
క్విక్ రివ్యు :
ఏమిటి ; కామన్వెల్త్ పెన్సింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణ పథకం గెలుచుకున్న భవాని దేవి
ఎవరు : భవాని దేవి
ఎక్కడ: బర్మింగ్ హం
ఎప్పుడు : ఆగస్ట్ 10
హిమ్ ద్రోన్-ఎ థాన్ కార్యక్రమాన్ని ప్రారంబించిన భారత సైన్యం :

భారత సైన్యం డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో హిమ్ ద్రోన్-ఎథాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రక్షణ తయారీలో స్వయం ప్రతిపత్తికి అనుగుణంగా ఈ చొరవ ఉంది. ఫ్రంట్ లైన్ దళాల అవసరాలను తీర్చడానికి పాత్ బ్రేకింగ్ డ్రోన్ సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి భారత డ్రోన్ పర్యావరణ వ్యవస్థకు అవకాశాలను అందించడం దీని లక్ష్యం. వివిధ దశలో, హిమాలయాల్లో ఆర్మీ ఆపరేషన్లలో ఉపయోగించేందుకు డ్రోన్లను అభివృద్ధి చేస్తారు..
క్విక్ రివ్యు :
ఏమిటి ; హిమ్ ద్రోన్-ఎ థాన్ కార్యక్రమాన్ని ప్రారంబించిన భారత సైన్యం
ఎవరు : భారత సైన్యం
ఎప్పుడు : ఆగస్ట్ 10
భారత సుప్రీంకోర్టు 19వ ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ యు.యు. లలిత్ నియమకం :

సుప్రీంకోర్టు 19వ ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ యు.యు. లలిత్ గారు నియమితులయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(2) కింద ఉన్న అధికారాలను అనుసరించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్కు ఈ నెల 27వ తేదీ నుంచి జస్టిస్ లలిత ను భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ: ఆగస్ట్ 10న ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్ వి.రమణ పదవీకాలం ఈ నెల 26వ తేదీతో ముగుస్తుండడంతో 27 నుంచి ఆ స్థానంలో, జస్టిస్ లలిత్ బాధ్యతలు చేపడతారు. నవంబరు 8వ తేదీ వరకు ఆయన పదవిలో ఉంటారు. 1957 నవం బరు 9న జన్మించిన యు.యు. లలిత్ బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టులలో న్యాయవాదిగా సేవలందించారు. నేరుగా బార్ నుంచే 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. మరోవైపు, జస్టిస్ యు. యు లలిత కు సీజేఐ జస్టిస్ ‘ఎన్. వి. రమణ అభినందనలు తెలిపారు. బార్, బెంచ్‌లో ఉన్న సుదీర్ఘ అనుభవం, సమర్ధవంతమైన నాయకత్వంతో జస్టిస్ లలిత్ న్యాయవ్యవస్థను కొత్త శిఖరాలకు తీసుకెళతారని. ఆకాంక్షిస్తున్నట్లు జస్టిస్ ఎన్.వి. రమణ పేర్కొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి ; భారత సుప్రీంకోర్టు 19వ ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ యు.యు. లలిత్ నియమకం
ఎవరు : జస్టిస్ యు.యు. లలిత్
ఎక్కడ: న్యు డిల్లి
ఎప్పుడు : ఆగస్ట్ 10
గౌహతిలో మొట్టమొదటి రిమోట్ పైలట్ శిక్షణా పాఠశాలను ప్రారంబిస్తున్న అస్సాం ప్రభుత్వం :

డ్రోన్ టెక్నాలజీకి భారతదేశాన్ని కేంద్రంగా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ అన్వేషణలో భాగంగా ఈశాన్య ప్రాంతం గౌహతిలో మొట్టమొదటి రిమోట్ పైలట్ శిక్షణా పాఠశాలను ప్రారంభించిందని అధికారులు తెలిపారు. అస్సాం ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (AMTRON) ప్రాజెక్ కోసం IIT-గువాహటి మరియు IIM-కలకతా ఇన్నోవేషన్ పార్టీ అన్వేషణలో భాగంగా ప్రాంతం గౌహతిలో మొట్టమొదటి రిమోట్ పైలట్ శిక్షణా పాఠశాల ప్రారంభించిందని అధికారులు తెలిపారు. అస్సాం ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (AMTRON) IIT-గువాహటి మరియు IIM-కలకత్తా ఇన్నోవేషన్ పార్క్ ఇంక్యుబేట్ చేయబడిన ఎడ్యూరేడ్ అనే స్టార్టప్‌తో తో చేతులు కలిపింది. డ్రోన్ పాఠశాలను అస్సాం రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కేశబ్ మహంత గారు ప్రారంభించారు.
- అస్సాం రాష్ట్రం రాజధాని :
- అస్సాం రాష్ట్ర గవర్నర్ :
- అస్సాం రాష్ట్ర సిఎం :
- అస్సాం రాష్ట్ర హైకోర్టు గల ప్రదేశం :
క్విక్ రివ్యు :
ఏమిటి ; గౌహతిలో మొట్టమొదటి రిమోట్ పైలట్ శిక్షణా పాఠశాలను ప్రారంబిస్తున్న అస్సాం ప్రభుత్వం
ఎవరు : అస్సాం ప్రభుత్వం
ఎక్కడ: అస్సాం రాష్ట్రం
ఎప్పుడు : ఆగస్ట్ 10
బిహార్ రాష్ట్ర సీఎంగా ఎనిమిదో సారి నితీశ్ కుమార్ ప్రమాణం :

బిహార్ రాష్ట్ర సిఎంగా రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి జనతాదళ్ (యునైటెడ్) పార్టీ నేత నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆగస్ట్ 10 న రాజభవన్ లో బీహార్ గవర్నర్ అయిన ఫగు చౌహాన్ గారు ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. మహాఘట్ బంధన్ కు సారథ్యం వహిస్తున్న కీలక భాగస్వామ్య పార్టీ అయిన ఆర్జేడీ నేత తేజస్వీ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి ; బిహార్ రాష్ట్ర సీఎంగా ఎనిమిదో సారి నితీశ్ కుమార్ ప్రమాణం
ఎవరు: బిహార్ ప్రభుత్వం
ఎక్కడ: బిహార్ రాష్ట్రం
ఎప్పుడు : ఆగస్ట్ 10
ప్రపంచ జీవ ఇంధన దినోత్సవ౦గా ఆగస్ట్ 10 :

సాంప్రదారు శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని జరుపుకుంటారు.గ్రహం యొక్క స్థిరమైన అభివృద్ధి కోసం సంప్రదాయేతర ఇంధన వనరులను ఉపయోగించడాన్ని ఈ రోజు ప్రోత్సహిస్తుంది. ప్రపంచ జీవ ఇంధన దినోత్సవ౦ కూడా డీజిల్ ఇంజిన్ సృష్టికర్త సర్ రుడాల్ఫ్ డీజిల్ ను గౌరవిస్తుంది. ప్రస్తుతం రవాణాలో జీవ ఇంధనం యొక్క ప్రధాన అనువర్తనం మరియు ప్రపంచంలోని మొత్తం రవాణాలో 3% దానిపై ఆధారపడి ఉంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) పెట్రోలియంపై ఆధారపడటాన్ని తగ్గించడానికి 2050 నాటికి ప్రపంచ రవాణా ఇంధన డిమాండ్లలో 25 జీవ ఇంధనం ద్వారా తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. IEA అనేది పారిస్ లో ఉన్న ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ, ఇది మొత్తం ప్రపంచ ఇంధన రంగాలను నిర్వహిస్తుంది. థీమ్ 2022 ‘సుస్థిరత మరియు గ్రామీణ ఆదాయం కోసం జీవ ఇంధనాలు. గా ఉంది
క్విక్ రివ్యు :
ఏమిటి ; ప్రపంచ జీవ ఇంధన దినోత్సవ౦గా ఆగస్ట్ 10
ఎక్కడ: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు : ఆగస్ట్ 10
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |