Daily Current Affairs in Telugu 09 December- 2022

Daily Current Affairs in Telugu 09 December- 2022

బయోఏషియా-2023తో  ఎంఎస్ఎంఈ లో భాగ౦గా  తెలంగాణ రాష్ట్రం ఒప్పందం :

ఆసియాలోనే అతిపెద్ద లైఫ్-సైన్సెస్ అండ్ హెల్ప్క్టిక్ ఫోరం, తెలంగాణ రాష్ట్ర ఫ్లాగ్ షిప్ సదస్సు బయోఏషియా-2023తో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) శాఖ భాగస్వామ్యం కుదుర్చుకున్నది. ఎంఎస్ఎంఈ రంగంలోని ఫార్మాకంపెనీలకు దీనివల్ల ప్రోత్సాహం లభించనున్నది. వచ్చే ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు హైదరాబాద్లో వార్షిక బయోఏషియా సదస్సు జరుగనున్నది.

క్విక్ రివ్యు :

ఏమిటి : బయోఏషియా-2023తో  ఎంఎస్ఎంఈతో తెలంగాణ రాష్ట్రం ఒప్పం దం

ఎవరు : తెలంగాణ రాష్ట్రం

ఎప్పుడు : డిసెంబర్ 09

టూరిజం మిత్ర -2022 అవార్డ్ ను గెలుచుకున్న బుద్ధవనం ప్రాజెక్టు :

తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్లో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన బుద్ధవనం ప్రాజెక్టు అంతర్జాతీయ అవార్డు దక్కింది. అసోసియేషన్ ఆఫ్ బుద్దిస్థ టూర్ ఆపరేటర్స్ ఏటా అందిస్తున్న బంగ్లాదేశ్ భూటాన్ ,ఇండియా, నేపాల్ దేశాల టూరిజం మిత్ర అవార్డును అందుకుంది. కోలకతాలోని సిటీ సెంటర్ సాల్ట్ లేక్ సీఐ హాలులో జరుగుతున్న బౌద్ధ సదస్సులో ఈ అవార్డును అందజేశారు. కొరియా ఇండియ అసోసియేషన్ చైర్మన్ భిక్షు దమ్మదీప చేతుల మీదుగా బుద్దవు మల్లేపల్లి లక్ష్మయ్య ఈ అవార్డు అందుకున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : టూరిజం మిత్ర -2022 అవార్డ్ ను గెలుచుకున్న బుద్ధవనం ప్రాజెక్టు

ఎవరు : బుద్ధవనం ప్రాజెక్టు

ఎక్కడ : తెలంగాణా

ఎప్పుడు : డిసెంబర్ 09

తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా సర్దార్ రవీందర్ సింగ్ నియామకం :

తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా టీఆర్ఎస్ సీనియర్ నేత, సర్దార్ రవీందర్ సింగ్ ను ప్రభుత్వం నియమించింది. రెండేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. కరీంనగర్ కు చెందిన రవీందర్ సింగ్ గతంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసారు. 1995లో కరీంనగర్ మున్సిపల్ కౌన్సిలర్ తొలి విజయం సాధించిన ఆయన 27ఏండ్లుగా కౌన్సిలర్గా, కార్పొరేటర్గా కొనసాగుతున్నారు. 1995లో కరీంనగర్ మున్సిపల్ కౌన్సిలర్ తొలి విజయం సాధించిన ఆయన 27 ఏండ్లుగా కౌన్సిలర్, కార్పొరేటర్గా కొనసాగుతున్నారు. 2014లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ బాధ్యతలు చేపట్టి దక్షిణ భారత్లో మొట్టమొదటి సికు సామాజిక వర్గానికి చెందిన మే గా గుర్తింపు పొందారు. రూపాయికే నల్లా కనెక్షన్, రూపాయికే దహన సంస్కారాలు వంటి వినూత్న పథకాలను ప్రారంభించి పేరు పొందారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా సర్దార్ రవీందర్ సింగ్ నియామకం

ఎవరు : రవీందర్ సింగ్

ఎక్కడ : తెలంగాణ రాష్ట్ర౦

ఎప్పుడు : డిసెంబర్ 09

అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఉపా ధ్యక్షురాలిగా సుస్మితా శుక్లా నియమకం :

అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఉపా ధ్యక్షురాలిగా తొలిసారి భారత సంతతికి చెందిన సుస్మితా శుక్లా గారు నియమితులయ్యారు. సహ కార్యనిర్వాహక అధికారిణిగానూ ఆమెను బ్యాంకు బోర్డు నియమించింది. 2023 మార్చిలో శక్లా పదవీబాధ్యతలు స్వీకరించనున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ముంబయి నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ పొందిన శుక్లా, న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఉపా ధ్యక్షురాలిగా సుస్మితా శుక్లా నియమకం

ఎవరు : సుస్మితా శుక్లా

ఎక్కడ : అమెరికా

ఎప్పుడు : డిసెంబర్ 09

దేశంలో మొట్టమొదటగా  అగ్ని కుల్ పేరుతో ఓ ప్రైవేటు సంస్థ ప్రయోగ వేదిక ఏర్పాటు :

దేశంలో మొట్టమొదటగా ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో రాకెట్లను నింగిలోకి పంచేందుకు ప్రయోగ వేదికను సిద్ధం చేశారు. దీనికి అనుబంధంగా మిషన్ కంట్రోల్ సెంటర్ (ఎంసీసీ)ను నెలకొల్పారు. దీంతో త్వరలో రాకెట్ ప్రయోగం చేపట్టేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) లో ఇప్పటికే మూడు ప్రయోగ వేదికలు ఉన్నాయి. మొదటి, రెండు ప్రయోగ వేదికలతోపాటు సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ మరోటి. వీటి నుంచి తరచూ రాకెట్ ప్రయోగాలను ఇస్రో చేపడుతోంది. వీటికి సమీపంలోనే ప్రైవేటు లాంచ్ వెహికల్ కోసం తొలి ప్రత్యేక ప్రయోగ వేదికను అందుబాటులోకి తెచ్చారు. దీన్ని చెన్నైకు చెందిన అగ్నికుల్ స్టార్టప్ ఏర్పాటు చేయగా ఇస్రో, ఇన్ స్పేస్ లు ప్రోత్సాహం అందించాయి. ప్రయోగ వేదిక, మిషన్ కంట్రోల్ కేంద్రం ఒకదానికొకటి 4 కి.మీ. దూరంలో ఏర్పాటు చేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : దేశంలో మొట్టమొదటగా  అగ్ని కుల్ పేరుతో ఓ ప్రైవేటు సంస్థ ప్రయోగ వేదిక ఏర్పాటు

ఎవరు : అగ్ని కుల్

ఎక్కడ : తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) లో

ఎప్పుడు : డిసెంబర్ 09

జీ-20 సదస్సులకు ఆతిధ్యం ఇవ్వనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం :

దేశవ్యాప్తంగా నిర్వహించ నున్న జీ-20 సదస్సులకు ఆంధ్రప్రదేశ్ కూడా ఆతిధ్యం ఇవ్వనుందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వెల్ల డించారు. వచ్చే ‘ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో విశాఖపట్నంలో మూడు సదస్సులు నిర్వహించే అవకాశం ‘ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా 56 నగరాలు, పట్టణాల్లో వివిధ అంశాలపై 200కు పైగా జీ-20 సదస్సులు జరగనున్నాయని వివరించారు. ఈ సదస్సులకు,సన్నాహకాలపై వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమం త్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని మోదీ శుక్రవారం వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు. గవర్నర్ రాజ్భవన్ నుంచి ఈ కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. అనంతరం ఆయన ఈ వివరాలను వెల్లడించినట్లు గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రధానితో సమావేశానికి హాజరయ్యారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : జీ-20 సదస్సులకు ఆతిధ్యం ఇవ్వనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

ఎప్పుడు : డిసెంబర్ 09

Download Manavidya app

Daily current affairs in Telugu Pdf November - 202
Daily current affairs in Telugu 01-11-2022
>Daily current affairs in Telugu 02-11-2022
Daily current affairs in Telugu 03-11-2022
Daily current affairs in Telugu 04-11-2022</strong>
Daily current affairs in Telugu 05-11-2022
Daily current affairs in Telugu 05-11-2022
Daily current affairs in Telugu 06-11-2022</strong>
Daily current affairs in Telugu 07-11-2022
Daily current affairs in Telugu 08-11-2022
>Daily current affairs in Telugu 09-11-2022
Daily current affairs in Telugu 10-11-2022
Daily current affairs in Telugu 11-11-2022
Daily current affairs in Telugu Pdf October 2022
Daily current affairs in Telugu Pdf Octobe r01 - 2022
Daily current affairs in Telugu Pdf October 02 - 2022
Daily current affairs in Telugu Pdf October03 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October04 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October05 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October 6 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October07 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October08 - 2022 PDF</strong>
Daily current affairs in Telugu Pdf October09 - 2022
Daily current affairs in Telugu Pdf October 10 - 2022
Daily current affairs in Telugu Pdf October 11 - 2022
Daily current affairs in Telugu Pdf October 12 - 2022
Daily current affairs in Telugu Pdf October 13 - 2022
Daily current affairs in Telugu Pdf October 14 - 2022
Daily current affairs in Telugu Pdf October 15 - 2022
Daily current affairs in Telugu Pdf October 16 - 2022
Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *