Daily Current Affairs in Telugu 09 August-2022
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ తో ఒప్పందం కురుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం :

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ (ఎన్ఎస్ఐఎస్టి) తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, సరిహద్దులను నిర్ణయించడంలో అధునాతన సాంకేతికతతో సమీకృత నిర్వహణ వ్యవస్థ తయారీ మరియు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కు NISG సహాయం చేస్తుంది. కాగా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత రక్ష పథకం అమలులో భాగంగా ఈ ఒప్పందంపై ఇరువురు సంతకాలు చేశారు.
- ఆంధ్రప్రదేశ్ రాజధాని : అమరావతి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎం : వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి
- ఆంధ్రప్రదేశ్ గవర్నర్ : బిశ్వ భూషణ్ హరిచంద్
క్విక్ రివ్యు
ఏమిటి : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ తో ఒప్పందం కురుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎవరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎప్పుడు : ఆగస్ట్ 09
ఈవోడీబీ ఎకనామిక్ టైమ్స్ పురస్కారానికి ఎంపికైన తెలంగాణా రాష్ట్రము :

సరళతర వ్యాపార నిర్వహణ (ఈవోడీబీ)లో తెలంగాణ రాష్ట్రం ఎకనామిక్ టైమ్స్ పురస్కారానికి ఎంపికైంది. ఈ నెల -25న దిల్లీలో నీతి ఆయోగ్, కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలతో పాటు ఇజ్రా స్వీడన్ రాయబార కార్యాలయాలు సంయుక్తంగా నిర్వహించే ‘ది డిజీ టెక్ కాన్వ్- 2022 లో ఈ పురస్కారం అందజేయనున్నారు. ఎకనా మిక్ టైమ్స్ ఎడిటర్ టి. రాధాకృష్ణ ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు విడుదల చేసే నివేదిక -లతో పాటు, క్షేత్రస్థాయిలో పరిశోధన, ఆధ్యయనం తరువాతే తాము తెలు గాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు. సరళతర వ్యాపార నిర్వహణ, సంస్కరణల కోసం అమలుచేస్తున్న కార్యాచరణతో పాటు మీసేవ పోర్ట ల్ తో ప్రజలకు అందిస్తున్న మెరుగైన డిజిటల్ సేవలకు గుర్తింపుగా ఈ పరస్కారం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ అవార్డుకు రాష్ట్రం ఎంపిక కావ చంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఈవోడీబీ ర్యాంకుల్లో తెలంగాణ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉందన్నారు
- తెలంగాణా రాష్ట్ర రాజధాని : హైదరాబాద్
- తెలంగాణా రాష్ట్ర గవర్నర్ : తమిళ సై సౌందర రాజన్
- తెలంగాణా రాష్ట్ర సిఎం : కే.చంద్ర శేఖర్ రావు
క్విక్ రివ్యు :
ఏమిటి : ఈవోడీబీ ఎకనామిక్ టైమ్స్ పురస్కారానికి ఎంపికైన తెలంగాణా రాష్ట్రము
ఎవరు: తెలంగాణా రాష్ట్రము
ఎప్పుడు : ఆగస్ట్ 09
నేతాజీ డిల్లి చలో మైదానం ను జాతీయ స్మారకంగా ప్రకటించిన సింగపూర్ దేశం :

రెండు శతాబ్దాలుగా పలు చారిత్రక ఘటనలకు వేదికగా నిలిచి సింగపూర్ నగర నడిబొడ్డున 11 ఎకరాల్లో వెలసిన పచ్చిక మైదానాన్ని 75వ జాతీయ స్మారకంగా ఆ దేశం ప్రకటించింది. 1943 జులై 5న ఆజాద్ హింద్ ఫౌజ్ కవాతు అనంతరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇదే మైదానం. నుంచి ‘ఢిల్లీ చలో నినాదమిచ్చారు.. 57 వ జాతీయ దినోత్సవం సందర్భంగా సింగపూర్ ఈ స్మారక ప్రకటన చేసింది. స్మారక చిహ్నాల పరిరక్షణ చట్టం కింద ఇకపై, ఈ మైదానానికి అత్యున్నత స్థాయి. రక్షణ కల్పిస్తామని సింగపూర్ జాతీయ వారసత్వ మండలి (ఎన్ హెచోబీ) తెలిపింది. సింగపూర్ జాతీయ విశ్వవిద్యాల యంలోని దక్షిణాసియా అధ్యయనాల వేదిక హెడ్ ఆచార్య రాజేష్ రాయ్ మాట్లాడుతూ. నేతాజీ సారథ్యంలోని ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’ (ఐఎస్ఏ)కి ఈ మైదా.నంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ‘ఈ మైదానం. భారతీయులకు ప్రత్యేకమైనది. బ్రిటీషర్లు ఈ ద్వీపంలో అవుట్పస్ట్ పెట్టినప్పుడు భారతీయ సిపాయిలు తమ శిబిరాలను ఇక్కడే స్థాపించారు. వందలాది. వేలాది ఐఎన్ఏ సైనికులు, స్థానిక భారతీయులను ఉద్దేశించి నేతాజీ ప్రసంగాలు చేశారు. రాణీ ఆఫ్ ఝాన్సీ రెజిమెంటు ఇక్కడే రూపుదిద్దుకొంది. ఈ మైదానానికి దక్షిణ మూలన నేతాజీ ఐఎన్ఏ స్మారకాన్ని కూడా ఏర్పాటు చేశారు’ అని తెలిపారు. 1945 సెప్టెంబరు 12న జపాన్ సేనలు ‘లొంగిపోయినపుడు, విజయ కవాతు కూడా ఇక్కడే జరిగింది. ఏటా సింగపూర్ లో జరిగే హోలీ. (దాయు పుసం) వేడుకలకూ ఇదే వేదిక.
క్విక్ రివ్యు :
ఏమిటి : నేతాజీ డిల్లి చలో మైదానం ను జాతీయ స్మారకంగా ప్రకటించిన సింగపూర్ దేశం
ఎవరు: సింగపూర్ దేశం
ఎప్పుడు : ఆగస్ట్ 09
విదేశీ ద్రవ్య ప్రవాహాలను పెంచడాని FPI 15 మంది సభ్యుల నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసిన సెబి :

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) భారత దేశంలోకి విదేశీ ద్రవ్య ప్రవాహాలను పెంచడానికి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPIలు) 15 మంది సభ్యుల నిపుణుల బృందాన్ని ఇటీవల ఏర్పాటు చేసింది. కాగా ఈ FPI సలహా కమిటీ కి (FAC) మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అయిన కెవి సుబ్రమణియన్ గారి అధ్యక్షతన నియమించబడింది.
- సెబి పూర్తి రూపం : సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
- సెబి యోక్క్ స్థాపన : 1992 ఏప్రిల్ 12
- సెబి యొక్క ప్రధాన కార్యాలయం : ముంబాయ్
క్విక్ రివ్యు
ఏమిటి : విదేశీ ద్రవ్య ప్రవాహాలను పెంచడాని FPI 15 మంది సభ్యుల నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసిన సెబి
ఎవరు: సెబి
ఎప్పుడు : ఆగస్ట్ 09
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో మూడో స్థానంలో నిలిచిన భారత్ :

భారత్ లో తొలిసారి నిర్వహించిన ప్రతి ష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఆతిధ్య భారత జట్టు అదరగొట్టింది.ఆగస్ట్ 09న ముగిసిన ఈ మెగా ఈవెంట్లో ఓపెన్ దొమ్మరాజు గుకేశ్, నిహాల్ సరీన్, ప్రజ్ఞానంద, ఆదిబన్, రానక్ సార్వా నిలతో కూడిన భారత ‘బి’ జట్టు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్లు కోనేరు. హంపి. ద్రోణవల్లి హారిక, వైశాలి. తానియా సవ్ భక్తి కులకర్నిలతో కూడిన భారత ‘ఎ’ జట్టు కాంస్య పతకాలు సాధించాయ నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ఓపెన్ విభాగంలో భారత బి జట్టు 8, విజయాలు. 2 డ్రాలు ఒక ఓటమితో మొత్తం 18 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్తాన్, అర్మేనియా 19 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలువగా మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ఉజ్బెకిస్తాన్ చాంపియన్ అవతరించింది. అర్మేనియా రన్నరప్ గా నిలిచింది.
క్విక్ రివ్యు
ఎవరు: భారత్
ఏమిటి : ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో మూడో స్థానంలో నిలిచిన భారత్
ఎప్పుడు : ఆగస్ట్ 09
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |