Daily Current Affairs in Telugu 08&09 July -2022
ఐ.ఎం.ఎఫ్ లో ‘వాల్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ ఎకనమిస్ట్ లో చోటు దక్కించుకున్న తొలి మహిళగా గీతా గోపి నాథ్ :

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్)కి చెందిన ‘వాల్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ ఎకనమిస్ట్ జాబితాలో చోటు దక్కించుకున్న తొలి మహిళగా, మరియు భారత్ కు చెందిన రెండో వ్యక్తిగా గీతా గోపీనాథ్ గారు ఘనత సాధించారు. 2003-06లో ఐఎమ్ఎఫ్ కు ముఖ్య ఆర్థికవేత్తగా బాధ్యతలు నిర్వర్తించిన రఘురామ్ రాజన్ గారు ఈ గుర్తింపు పొందిన తొలి భారతీయుడిగా నిలిచారు ఇపుడు ఆయన తర్వాత చోటుదక్కి౦చుకుని రెండవ వ్యక్తిగా మరియు మొదటి మహిళగా ఘనత సాధించారు..
- IMF యొక్క ప్రధాన కార్యాలయం : వాషింగ్టన్ యు.ఎస్.ఎ
- IMF యొక్క స్థాపన : జులై 1994
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐ.ఎం.ఎఫ్ లో ‘వాల్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ ఎకనమిస్ట్ లో చోటు దక్కించుకున్న తొలి మహిళగా గీతా గోపి నాథ్
ఎవరు: గీతా గోపి నాథ్
ఎప్పుడు: జులై 08
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో రష్యా పై నిషేధం విధింపు :

యుక్రయిన్ తో యుద్ధం కారణంగా రష్యా దేశం మరో పెద్ద క్రీడా ఈవెంట్ దూరమైంది. జులై నెల 24న ఆరంభమయ్యే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో రష్యా దేశానికి చెందిన అథ్లెట్లు పాల్గొనకుండా నిషేధం పడింది. ప్రపంచ అథ్లెటిక్ సమాఖ్య అధ్యక్షుడు సెబాస్టియన్ కో జులై 10న ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. రష్యా దేశస్థులు తటస్థ అథ్లెట్లుగా కూడా ఈ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం లేదు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో రష్యా పై నిషేధం విధింపు
ఎవరు: రష్యా పై
ఎప్పుడు: జులై 09
వరల్డ్ గేమ్స్ కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో కాంస్యం గెలుచుకున్న జ్యోతి సురేఖ-అభిషేక్ వర్మ :

ఆర్చరీలో భారత స్టార్ జోడీ జ్యోతి సురేఖ-అభిషేక్ వర్మ చరిత్ర సృష్టించారు. వరల్డ్ గేమ్స్ కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో కాంస్యం సొంతం చేసుకున్నారు. ఈ క్రీడల ఆర్చరీలో భారత్ తరఫున పతకం గెలిచిన తొలి జోడీగా రికార్డు సాధించారు. జులై 09 న కాంస్యం కోసం జరిగిన పోరులో జ్యోతి -అభిషేక్ ద్వయం 157 ,156లో మెక్సికో బృందంపై విజయం సాధించింది, అంతకుముందు భారత జంట 157-159తో కొలంబియా ఆర్చర్ల చేతిలో ఓడిపోయింది. మరోవైపు అభిషేక్ వ్యక్తిగత విభాగంలోనూ పతక రేసులో ఉన్నాడు. క్వార్టర్ . ఫైనల్లో అతడు ప్రపంచ చాంపియన్ మైక్ స్కోసర్ (నెదర్లాండ్స్)కు షాకిచ్చాడు. అయిదు సెట్ల పోరులో 149-149తో స్కోరు సమం కావడంతో అభిషేక్ టైబ్రేకర్ తో నెగ్గాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: వరల్డ్ గేమ్స్ కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో కాంస్యం గెలుచుకున్న జ్యోతి సురేఖ-అభిషేక్ వర్మ
ఎవరు: జ్యోతి సురేఖ-అభిషేక్ వర్మ
ఎప్పుడు: జులై 09
వింబుల్డన్ మహిళల సింగిల్స్ లో టైటిల్ ను గెలుచుకున్న కజకిస్థాన్ క్రీడాకారిణి రిబకినా :

వింబుల్డన్ మహిళల సింగిల్స్ లో 23 ఏళ్ల కజకిస్థాన్ అందం రిబకినా ట్రోఫీని ముద్దాడింది. జులై 09న జరిగిన ఫైనల్లో 17వ సీడ్ రిబకినా 3-6, 6-2, 6-2 తేడాతో మూడో సీడ్ జాబెర్ (ట్యునీసియా)పై విజయం సాధించింది. శక్తిమంతమైన సర్వీస్ తో చెలరేగిన ఆమె తిరుగులేని విన్నర్ల తో పాయింట్లు రాబట్టింది. తొలి సెట్ మినహా మ్యాచ్లో తనదే ఆధిపత్యం. ఆమె కొట్టిన బ్యాక్ హ్యాండ్ షాట్లు సర్వీస్లకు బదులిచ్చిన ఫోర్హ్యాండ్: షాట్లు.. కోర్టులో ఒక మూల నుంచి మరో మూలకు ప్రత్య ర్టీకి అందకుండా కొట్టిన క్రాస్ కోర్టు షాట్లు. ఇలా తన కళాత్మక టెన్నిస్ విన్యాసాలు అబ్బురపరిచాయి. గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి కజకిస్థాన్ ప్లేయర్ గా రిబకినా చరిత్ర సృష్టించింది. 2011 లో21 ఏళ్ల వయసులో క్విటోవా) తర్వాత వింబుల్డన్ గెలిచిన అతి పిన్న వయస్సు క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. 1975లో ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టిన తర్వాత వింబుల్డన్ గెలిచిన రెండో ఎక్కువ ర్యాంకు (23) క్రీడాకారిణి రిబకినా. 2007లో అప్పటి 31వ ర్యాంకర్ వీనస్ టైటిల్ నెగ్గింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: వింబుల్డన్ మహిళల సింగిల్స్ లో టైటిల్ ను గెలుచుకున్న కజకిస్థాన్ క్రీడాకారిణి రిబకినా
ఎవరు: కజకిస్థాన్ క్రీడాకారిణి రిబకినా
ఎప్పుడు: జులై 10
టెస్టుల్లో ఒకే ఓవర్లో అత్యధికంగా 29 పరుగులు రాబట్టిన బ్యాట్స్ మెన్ గా నిలిచిన జస్ప్రీత్ బుమ్రా :

టెస్టుల్లో ఒకే ఓవర్లో అత్యధికంగా 29 పరుగులు రాబట్టిన బ్యాట్స్మెన్ భారత్ కు చెందిన జస్ ప్రీత్ బుమ్రా గారు ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ లో జరిగిన అయిదో టెస్టులో ఈ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు బ్రియాన్ లారా (28 పరుగులు) పేరిట ఉంది. భారత్ – ఇంగ్లండ్ మధ్య జరిగిన అయిదు టెస్టు మ్యాచ్ సిరీస్ 2-2 తో డ్రాగా ముగిసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: టెస్టుల్లో ఒకే ఓవర్లో అత్యధికంగా 29 పరుగులు రాబట్టిన బ్యాట్స్ మెన్ గా నిలిచిన జస్ప్రీత్ బుమ్రా
ఎవరు: జస్ప్రీత్ బుమ్రా
ఎప్పుడు: జులై 08
తొలిసారి గా భారత్ సిమెంట్ ను ఎగుమతి చేయనున్న నేపాల్ దేశం :

భారత్ కు తొలిసారి గా నేపాల్ సిమెంటు ఎగుమతి చేయనుంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ నుంచి ఈ సిమెంట్ భారత్ కు రానుంది. నవాల్వరాసి అనే జిల్లాలోని పాల్పా సిమెంట్ ఇండస్ట్రీస్ సునౌలీ సరిహద్దు ద్వారా మొదట ప్రారంభించింది.
- నేపాల్ దేశ రాజధాని : ఖాట్మండు
- నేపాల్ దేశ ప్రధాన మంత్రి : షేర్ బహదూర్ దేబా
- నేపాల్ దేశ అద్యక్షుడు :విద్యాదేవి బండారి
క్విక్ రివ్యు :
ఏమిటి: తొలిసారి గా భారత్ సిమెంట్ ను ఎగుమతి చేయనున్న నేపాల్ దేశం
ఎవరు: నేపాల్ దేశం
ఎప్పుడు: జులై 08
జపాన్ దేశ మాజీ ప్రధానమంత్రి, దిగ్గజ నేత షింజో అబె దారుణ హత్య :

మాజీ ప్రధానమంత్రి, దిగ్గజ నేత షింజో అబె (67) దారుణ హత్యకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ జపాన్ లో ని నరా నగరంలో ప్రసంగిస్తున్న ఆయనపై ఓ దుండగుడు అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఇతను దాదాపు రెండు దశ జపాన్ నౌకాదళంలో మూడేళ్ల పాటు పనిచేసినప్పుడు తెత్సు యమగామి (41)గా అతడిని గుర్తించారు. షీంజో అబే తో 24 1954 సెప్టె౦బర్ 21న లోల్లో లో అన్నిం చారు. 2006-2007 2012-22 మధ్య కాలంలో రెండు పాటు ప్రధానిగా వ్యవహరించారు.దేశంలో అత్యంత శక్తివంత నాయకులలో ఒకరిగా ఆయన కు పేరుంది .
- జపాన్ దేశ రాజధాని : టోక్యో
- జపాన్ దేశ కరెన్సీ : జపనీస్ యెన్
- జపాన్ దేశ ప్రస్తుత ప్రధాన మంత్రి : ఫుమియో కిశిడ
క్విక్ రివ్యు :
ఏమిటి: జపాన్ దేశ మాజీ ప్రధానమంత్రి, దిగ్గజ నేత షింజో అబె దారుణ హత్య
ఎవరు: షింజో అబె
ఎక్కడ: జపాన్
ఎప్పుడు: జులై 09
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |