Daily Current Affairs in Telugu 08&09-02-2022
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నూతన డైరెక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్ నియామకం :

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) కొత్త డైరెక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్ ఎస్ నియమితులయ్యారు. ఆయన గతంలో ఇస్రోలోని హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ డైరెక్టర్గా పనిచేశారు. ఇస్రో చైర్మన్ గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఎస్ సోమనాథ్ తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టారు. కేరళకు చెందిన నాయర్, బెంగళూరులోని IISc నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ME పట్టా పొందారు మరియు IIT చెన్నై నుండి PhD హోల్డర్, 1985లో వీఎస్ఎస్సీ ఇస్రోలో చేరి పలు కీలక పదవులు చేపట్టారు. అనను అనేక అవార్డులు మరియు ప్రశంసలు కూడా పొందాడు
క్విక్ రివ్యు :
ఏమిటి: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నూతన డైరెక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్ నియామకం :
ఎవరు: ఉన్నికృష్ణన్ నాయర్
ఎప్పుడు: ఫిబ్రవరి 09
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పరిశోదన కేంద్రం ఏర్పాటు చేయనున్న తెలంగాణా ప్రభుత్వం :

ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలు, వ్యవసాయ ప్రగతి, రైతులకు మరింత చేరువ కావడం, విధానాలను వారికి చేరవేయడం వంటి అంశాలపై అధికారులతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 8న హైదరాబాద్ లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పంటల వైవిధ్యీకరణతోపాటు వ్యవసాయ పరిశోధనా కేంద్రాలలో పరిశోధనలు జరగాలన్నారు. అంతర్జాతీయంగా తెలంగాణ పత్తికి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆదిలాబాద్ పత్తి పరిశోధనా కేంద్రం తక్షణ ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరులో కంది విత్తన పరిశోధనా కేంద్రం ప్రత్యేకంగా అభివృద్ధి పరచాలని నిర్ణయించామని చెప్పారు.
- తెలంగాణా రాష్ట్ర రాజధాని :హైదరాబాద్
- తెలంగాణా రాష్ట్ర సిఎం :కే చంద్రశేఖర్ రావు
- తెలంగాణా రాష్ట్ర గవర్నర్ : తమిలసై సౌందర రాజన్
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పరిశోదన కేంద్రం ఏర్పాటు చేయనున్న తెలంగాణా ప్రభుత్వం
ఎవరు: తెలంగాణా ప్రభుత్వం
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు:
పవర్ థాన్-2022 పేరుతో హ్యాకథాన్ ను ప్రారంబించిన విద్యుత్ శాఖా మంత్రి ఆర్కే సింగ్ :

నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం సాంకేతికతతో నడిచే పరిష్కారాలను కనుగొనడానికి పవర్ థాన్-2022 పేరుతో హ్యాకథాన్ ను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కె సింగ్ గారు ఇటీవల ప్రారంభించారు.ఇప్పటికే ఉన్న సమస్యలకు పరిష్కారాలు మాత్రమే కాకుండా ఇతర సమస్యల ప్రకటనలు మరియు నమ్మకమైన నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం అందించాలనే ఆలోచనలతో ముందుకు రావాలని ఆయన సాంకేతిక నిపుణులను ప్రోత్సహించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: పవర్ థాన్-2022 పేరుతో హ్యాకథాన్ ను ప్రారంబించిన విద్యుత్ శాఖా మంత్రి ఆర్కే సింగ్
ఎవరు: విద్యుత్ శాఖా మంత్రి ఆర్కే సింగ్
ఎప్పుడు: ఫిబ్రవరి 09
ప్రపంచ రికార్డు నెలకొలకొల్పిన భారత క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ :

విండీస్ లో జరిగిన రెండో వన్డేలో 83 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసిన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్ చరిత్రలో తొలి ఆరు మ్యాచ్ లో 30కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్ వరల్డ్ రికార్డును క్రియేట్ చేశాడు. గతంలో నెదర్లాండ్స్ ఆటగాళ్లు ర్యాన్ టెన్ డస్కటే టామ్ కూపర్, పాకిస్థాన్ ఆటగాడు ఫఖర్ జమాన్ లు తొలి ఐదు వన్డే ఇన్నింగ్స్ లో 30కి అదనంగా పరుగులు చేశారు. తాజాగా సూర్యకుమార్ వీరిని అధిగమించి ప్రపంచ క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా సూర్యకుమార్ వీరిని అధిగమించి ప్రపంచ క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే కెరీర్లో ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన సూర్యకుమార్.. 65.25 సగటున 261 పరుగులు చేశాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ రికార్డు నెలకొలకొల్పిన భారత క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్
ఎవరు: సూర్య కుమార్ యాదవ్
ఎప్పుడు: ఫిబ్రవరి 09
బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్తాన౦లో గౌతం అధాని :

బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో ఏషియాలోనే అత్యంత ధనవంతుడిగా మారిన గౌతమ్ అదానీ కేవలం ఒక్క రోజు మాత్రమే ఆ స్థానంలో ఉండగలిగారు. 24 గంటలు గడిచేసరికి ముకేశ్ అంబారీ మరోసారి దూసుకువచ్చి తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఇద్దరి సంపదలో తేడా రావడంతో ముకేశ్ పైకి ఎగబాకగా ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ ఏషియా, నంబర్ 2, ప్రపంచంలో 11 స్థానానికి పరిమితమయ్యారు. 2022 ఫిబ్రవరి 9 న ఉదయం బ్లూంబర్గ్ ఇండెక్స్ జాబితాలో ముకేశ్ అంబానీ సంపద 89.2 బిలియన్ డాలర్లకుగా నమోదు అయ్యింది. బ్లూంబర్గ్ జాబితాలో అంబాధీఅదానీలు వరుసగా 10వ 11వ స్థానాల్లో ఉండగా టాప్ 100 జాబితాలో 38వ స్థానంలో అజీమ్ ప్రేమ్జీ (33.8 బిలియన్ డాలర్లు), 18వ స్థానంలో శిన్నాచార్ (29 బిలియన్ డాలర్లు), 79వ స్థానంలో రాధాకిషన్ దమానీ (21.2 బిలియన్ డాలర్లు), 82వ స్థానంలో లక్ష్మీ మిట్టల్ (21 బిలియన్ డాలర్లు)లు ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: బ్లూంబర్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్తాన౦లో గౌతం అధాని
ఎవరు: గౌతం అధాని
ఎప్పుడు: ఫిబ్రవరి 09
అమెరికాతో రక్షణ సైనిక ఒప్పందాన్ని ఆమోదించిన స్లోవేకియా :

అమెరికాతో రక్షణ సైనిక ఒప్పందాన్ని స్లోవేకియా పార్లమెంటు ఇటీవల ఆమోదించింది. నాలుగు పార్టీల పాలక సంకీర్ణం మరియు ప్రతిపక్షాల మధ్య జరిగిన ఓట్ల చీలికలో 150 సీట్ల శాసనసభలో రక్షణ సహకార ఒప్పందం 79-60తో ఆమోదం పొందింది. స్లోవేకియా భూభాగంలో అమెరికా దేశ దళాల శాశ్వత ఉనికిని సాధ్యం చేస్తుందని మరియ సాంకేతిక అణ్వాయుధాలను మోహరించడానికి కూడా వీలు కల్నిస్తుంది.
- స్లోవేకియా దేశ రాజధాని :బ్రటిస్లావ
- స్లోవేకియా దేశ కరెన్సీ : యూరో
- స్లోవేకియా దేశ అద్యక్షుడు : జుజానా కపుటోవా
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికాతో రక్షణ సైనిక ఒప్పందాన్ని ఆమోదించిన స్లోవేకియా
ఎవరు: స్లోవేకియా
ఎక్కడ:అమెరికా
ఎప్పుడు: ఫిబ్రవరి 09
ఐపిఎల్ లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీ పేరు ‘గుజరాత్ టైటాన్స్ మార్పు :

అహ్మదాబాద్ ఫ్రాంచైజీ పేరును ‘గుజరాత్ టైటాన్స్’ మార్చనుంది. ఐపీఎల్ లో అహ్మదాబాద్ ప్రాంచైజీని చేజిక్కించుకున్న ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్ తమ జట్టుకు ‘గుజరాత్ టైటాన్స్’ అని పేరు పెట్టింది. ఈ జట్టుకు ఈ భారత ప్లేయర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ‘మా ఫ్రాంచైజీ గుజరాత్ లో ఘనమైన క్రికెట్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతుంది. మేటి క్రికెటర్లను తయారు చేసిన చరిత్ర ఈ రాష్ట్రానికి ఉంది. ఇక మీదటా అది కొనసాగుతుంది’ అని ప్రాంచైజ్ ప్రతినిధి సిద్ధార్థ్ పటేల్ తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐపిఎల్ లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీ పేరు ‘గుజరాత్ టైటాన్స్ మార్పు
ఎవరు: అహ్మదాబాద్ ఫ్రాంచైజీ
ఎప్పుడు: ఫిబ్రవరి 09
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |