
Daily Current Affairs in Telugu 06-04-2021
సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయ మూర్తిగా ఎన్.వి రమణ ప్రమాణ స్వీకారం :

జస్టిస్ నూతలపాటి వెంకట రమణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏప్రిల్ 6న ఉత్తర్వులు జారీచేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 120 కింద దఖలుపడిన అధికారాలను అనుసరించి జస్టిస్ వెంకట రమణను ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో రాష్ట్రతి పేర్కొన్నారు. లాంఛనం ప్రకారం నియామక ఉత్తర్వులను ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పి.కి. మిశ్ల, న్యాయశాఖ కార్యదర్శి బరున్ మిత్రలు జస్టిస్ రమణను అందజేశారు. ప్రస్తుత సి.జే.ఐ జస్టిస్ బొబ్డే గారు ఈ నెల 28న పదవీ విరమణ చేస్తారు. 24న రాష్ట్రపతి భవన్ లో జరిగే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో జస్టిస్ రమణ బాధ్యతలు వేపట్టసున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27న సాధారణ వ్యవసాయ కుటుం బంలో జన్మించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయ మూర్తిగా ఎన్.వి రమణ ప్రమాణ స్వీకారం
ఎవరు: ఎన్.వి రమణ
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: ఏప్రిల్ 06
విమలాశాంతి జీవిత సాహిత్య సాఫల్య పురస్కారం గెలుచుకున్న ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి :

ప్రసిద్ధ అభ్యుదయ కథారచయిత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డిని విమలాశాంతి జీవిత సాహిత్య సాఫల్య పురస్కారం వరించింది. ఈ విషయాన్ని అవార్డు వ్యవస్థాపకుడు డా.శాంతినారాయణా ఏప్రిల్ 3న తెలిపారు. ఒక ప్రత్యేక కార్యక్రమంలో రూ.50 వేల నగదు ప్రదానంతోపాటు సన్మాన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన తన సతీమణి విమల జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ప్రతి ఏడాది ఒక సీనియర్ కథా, నవలా రచయితకు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇందులో భాగంగా తొలి పురస్కారాన్ని విశ్వనాథరెడ్డికి ఇస్తున్నట్లు వివరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: విమలా శాంతి జీవిత సాహిత్య సాఫల్య పురస్కారం గెలుచుకున్న ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి
ఎవరు: ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి
ఎప్పుడు: ఏప్రిల్ 06
ఫోర్బ్స్ 2021 బిలియనీర్ల జాబితా నాలుగోసారి మొదటి స్థానం లో జెఫ్ బెజోస్ :

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వరుసగా నాలుగో ఏడాది ప్రపంచ కబెరుల్లో అగ్రస్థానంలో నిలిధారు రని సంస్థ మంగళవారం తెలిపింది. ఏడాది కాలంగా ప్రపంచాన్ని కరోనా పట్టి పీడిస్తువృప్పటికీ కుబేరుల సంపద మరింతగా పెరగడం విశేషనుని ఫోర్బ్స్ తన 2021 బిలియనీర్ల జాబితా లో వెల్లడించింది. రికార్డు స్థాయిలో ఈ ఏడాది 2755 మంది బిలియనీర్లు (దాదాపు రూ 7350 కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్నవారు)జాబితాలో చోటు దక్కించుకున్నారని సంస్థ ఏప్రిల్ 06 న తెలిపింది. వీరి సంపద మొత్తం 13.1లక్షల కోట్ల డాలర్లకు చేరుకుందని ఇది గత ఏడాది నాటి 8 లక్షల కోట్ల డాలర్ల కంటే చాలా ఎక్కువ అని తెలిపింది. ఇక గత ఏడాది 31స్థానం లో ఉన్న టెస్టా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలాన్ మాస్క్ రెండవ స్థానంలో నిలిచారు. విలాస వంత వస్తువుల కంపెని ఎల్.వి.ఎం హెచ్ అధిపతి బెర్నార్డ్ ఆర్నాల్డ్ మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్ గేట్స్ ఫేస్ బుక్ చీఫ్ ఎగ్సిక్యుటివ్ మార్క్ జుకర్ బర్డ్ లు టాప్ -5లో చోటు సంపాదించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫోర్బ్స్ 2021 బిలియనీర్ల జాబితా నాలుగోసారి మొదటి స్థానం లో జెఫ్ బెజోస్
ఎవరు: జెఫ్ బెజోస్
ఎప్పుడు: ఏప్రిల్ 06
భారత క్రికెట్ నియంత్రణ మండలి-(బీసీసీఐ) షబ్బీర్ హుస్సేన్ నియామకం :

భారత క్రికెట్ నియంత్రణ మండలి-(బీసీసీఐ) అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్గా గుజరాత్ మాజీ డీజీపీ షబ్బీర్ హుస్సేన్ షెకాదమ్ను నియమించారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న అజిత్ సింగ్ స్థానంలో షబ్బీర్ బాధ్యతలు చేపడతారని ఏప్రిల్ 5న బీసీసీఐ తెలిపింది. మూడేళ్ల నాటినుంచి ఏసీయూ చీఫ్ గా పని చేస్తున్న అజిత్ సింగ్ పదవీ కాలం మార్చి 31న ముగిసింది. 2010లో రిటైర్ అయిన 70 ఏళ్ల షబ్బీర్ హుస్సేన్ పదేళ్ల పాటు ఎసార్ గ్రూప్లో సలహాదారుడిగా పని చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ లోక్ పాల్ సెర్చ్ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత క్రికెట్ నియంత్రణ మండలి-(బీసీసీఐ) షబ్బీర్ హుస్సేన్ నియామకం
ఎవరు: షబ్బీర్ హుస్సేన్
ఎప్పుడు: ఏప్రిల్ 06
మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ చాంపియన్‌గా నిలిచిన హుబర్ట్ హుర్కాజ్ :

మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ పురుషుల విభాగంలో పోలాండ్ ప్లేయర్ హుబర్ట్ హుర్కాజ్ చాంపియన్‌గా అవతరించాడు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం డెల్ రే బీచ్ లో ఏప్రిల్ 5న జరిగిన ఫైనల్లో హుర్కాజ్ 7-6 (7/4), 6–4తో ఇటలీకి చెందిన 19 ఏళ్ల జానిక్ సినెర్పై గెలుపొందాడు. హుర్కాజ్ కెరీర్ లో ఇదే తొలి మాస్టర్స్ సిరీస్ టైటిల్. విజేతగా నిలిచిన హుర్కాజ్ కు 3,00,110 డాలర్ల ప్రైజ్ మనీ (రూ.2 కోట్ల 22 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ చాంపియన్‌గా నిలిచిన హుబర్ట్ హుర్కాజ్
ఎవరు: హుబర్ట్ హుర్కాజ్
ఎప్పుడు: ఏప్రిల్ 06
ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణ౦ పూర్తి చేస్తున్న భారతీయ రైల్వే :

ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణాన్ని భారతీయ రైల్వే తుది అంకానికి చేర్చింది. జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ నిర్మిస్తున్న ప్రాజెక్టులో భాగంగా చీనాట్ నదిపై అత్యంత ఎత్తున నిర్మిస్తున్న వంతెన స్టీల్ ఆర్చిని రైల్వే శాఖ పూర్తి చేసింది. అత్యంత సంక్లిష్టమైన ఈ ముగింపు ఘట్టాన్ని ఏప్రిల్ 06న ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రారంభించిన రైల్వే మంత్రి పీయూష్ గోయెల్, రైల్వే బోర్డు,చైర్మన్, సీఈవో అశుతోష్ అగర్వాల్ తిలకించారు. కాట్రా-బనిహాల్ మధ్య కిలోమీటర్ల రైల్వేలైను నిర్మాణాన్ని వేగంగా శ్రీనగర్- పూర్తి చేయడానికి ముందడుగు పడినట్లయిందని రైల్వేశాఖ పేర్కొంది. అర్ధచంద్రాకారంలో ఉండే ఈ ఉక్కు వంతెన నిర్మాణం భారతీయ రైల్వే ఎదుర్కొన్న అతిపెద్ద మీటర్లు సివిల్ ఇంజినీరింగ్ కు సవాల్. ఇందులో ఆర్చీ నిర్మాన వంతెనను ణాన్ని పూర్తిచేసే పని ఫిబ్రవరి 20న మొదలైంది అందులో భాగంగా మొత్తం 8 ఉక్కు దిమ్మెలు ఏర్పాటుచేయాల్సి ఉండగా. ఇప్పటికే ఏడింటిని అమర్చారు. ఏప్రిల్ 06న 18.95 మెట్రిక్ టన్నుల ఇనుప దిమ్మెను చేర్చి వంతెనకు పూర్ణత్వాన్ని తీసుకొచ్చారు చీనాట్ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న ఈ వంతెన ఇప్పుడు భారతదేశానికి సరి కొత్త గుర్తింపు చిహ్నంగా మారనుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణ౦ పూర్తి చేస్తున్న భారతీయ రైల్వే
ఎవరు: భారతీయ రైల్వే
ఎక్కడ: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్-శ్రీనగర్
ఎప్పుడు: ఏప్రిల్ 06
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |