Daily Current Affairs in Telugu 06-04-2020

Manavidya daily current affairs in Telugu

Daily Current Affairs in Telugu 06-04-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

2020 షూటింగ్ ప్రపంచ కప్ రద్దు :

ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ షెడ్యుల్ ప్రకారం డిల్లీలో మార్చి 15 నుంచి 26 వరకు జరగవలసి ఉంది. గత నెలలో కరోనా వైరస్ వ్యాప్తి నెమ్మదిగా పెరుగుతున్న దశలో టోర్నీని వాయిదా వేయాలని నిర్ణయించారు. తర్వాత టోర్నీని రెండు భాగాలుగా చేసి మే,జూన్ నెలలో నిర్వహించాలని భావించారు. మే 05నుంచి 13 వరకు రైఫిల్ ఫిస్తల్ పోటీలు ,జూన్2 నుంచి 9 వరకు షాట్ గన్ పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. కాని ప్రస్తుతం పెరుగుతున్న కరోన వైరస్ తీవ్రత నేపద్యంలో ప్రపంచ కప్ ను రద్దు చేయాలని అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్),భారత షూటింగ్ సంఘం నిర్ణయించాయి. కరోనా మహమ్మారి వల్ల డిల్లి నిర్వాహక కమిటీ కి రైఫిల్/ఫిస్తల్ అండ్ షాట్ గన్ ప్రపంచ కప్ ను రద్దు చేయక తప్పలేదు అని ఐఎస్ఎస్ఎఫ్ ప్రకటించింది. బాకు (అజర్ బైజాన్) లో జూన్ 22 మొదలు కావాల్సిన కంబైండ్ ప్రపంచ కప్ ను కూడా రద్దు చేయాలనీ ఐఎస్ఎస్ఎఫ్ నిర్ణయించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: 2020 షూటింగ్ ప్రపంచ కప్ రద్దు

ఎవరు: ఐఎస్ఎస్ఎఫ్

ఎప్పుడు: ఏప్రిల్ 06

ప్రపంచంలోనే  మొదటి సారిగా  పులికి సోకినా కరోనా వైరస్ :

అమెరికా లో ని బ్రాంక్స్ జూ లో నాలుగేళ్ళ ఆడ పులికి కరోనా సోకింది .దాని పేరు  “నదియా”. అక్కడే ఉంటున్న మరో ఐదు పులుల్లోను కరోనా  వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. ఈ పరిణామంతో భారత్ వెంటనే అప్రమత్తమైంది. దేశంలోనే అన్నిజంతువుల ప్రదర్శన శాలలు,పులుల సంరక్షణ కేంద్రాలు,జింకల పార్కులను ఏప్రిల్ 05న అప్రమత్తం చేసింది. మనుషుల నుంచి వన్య ప్రాణులకు,లేదా వాటి నుంచి మనుషులకు వైరస్ సోకే ముప్పు ఉన్నందున కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్దేన్లకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ సూచనలు జారీ చేసింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రపంచంలోనే మొదటి సారిగా  పులికి సోకినా కరోనా వైరస్

ఎక్కడ: అమెరికా

ఎప్పుడు: ఏప్రిల్ 06

నాస్కాం  చైర్మన్ గా ప్రవీన్ రావు ఎంపిక :

ఐటి పరిశ్రమ సమాఖ్య నాస్కాం చైర్మన్ గా  2020-21 సంవత్సరానికి గాను ఇన్ఫోసిస్ ముఖ్య నిర్వాహక అధికారి (సిఓఓ) యుబి ప్రవీణ్ రావు గారు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్న డబ్ల్యుఎన్ఎస్ గ్లోబల్ సర్వీస్ గ్రూప్ సిఈవో కేశవ్ మురుగేశ్ స్థానాన్ని అయన బర్తీ చేయనున్నారు. అలాగే యాక్సెంచర్ ఇండియా చైర్మన్, సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ రేఖా ఎం. మీనన్  వైస్ చైర్ పర్సన్ గా ఎంపికయ్యారు. నాస్కాం ఎగ్సిక్యుటివ్ కౌన్సిల్  సమావేశంలో ఈ నియామకాలను ప్రకటించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: నాస్కాం చైర్మన్ గా ప్రవీన్ రావు ఎంపిక

ఎవరు: ప్రవీన్ రావు

ఎక్కడ: డిల్లి

ఎప్పుడు: ఏప్రిల్ 06

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

ప్రజలను పరిశుబ్రపరచడానికి తెలంగాణాలో “వి సేఫ్ టన్నెల్” ను ఏర్పాటు:

ప్రజలను శుబ్రపరిచే లక్ష్యాన్ని సాధించడానికి తెలంగాణలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిస్ కార్యాలయంలో “వి సేఫ్ టన్నెల్” ను ఏర్పాటు చేయబడింది. వి సేఫ్  టన్నెల్  అనే ప్రత్యెక మైన క్రిమిసంహరిని రాష్ట్రంలో ని కరోనా వైరస్ ను స్థానికంగా ఈ వైరస్ యొక్క వ్యాప్తిని తగ్గించడానికి 20సెకన్ల లోపు ఏదైనా బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మ జీవుల నుండి ప్రజలను రక్షిస్తుంది. క్రిమిసంహారక మందును నీటి లో కరిగే పాలిమర్ మరియు అయోడిన్ కలయికను  స్ప్రే రూపంలో చల్లడం ద్వారా  సార్స్  మరియు ఎబోలా వంటి వైరస్ ల ప్రబావాన్ని కూడా చాల వరకు తగ్గిస్తుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రజలను పరిశుబ్పరచడానికి తెలంగాణాలో “వి సేఫ్ టన్నెల్” ను ఏర్పాటు:

ఎవరు: తెలంగాణ ప్రబుత్వం

ఎక్కడ:తెలంగాణ

ఎప్పుడు: ఏప్రిల్ 06

మూడు సార్లు గ్రామి అవార్డును గెలుచుకున్న బిల్ వితర్స్ కన్నుమూత :

అమెరికన్ పాటల రచయిత  మరియు మూడు సార్లు గ్రామి అవార్డును గెలుచుకున్న వ్యక్తిగా పరిచయమున్న బిల్ వితర్స్ కన్నుమూసారు. అతను ఇప్పటివరకు 9 ఆల్బంలను అయన నిర్మించాడు. మరియు అతని తొలి ఆల్బం అయిన జస్టిస్ యాస్ ఐయాం (1971) మరియు చివరి ఆల్బం వాచింగ్ యు వాచింగ్ మీ (1985), అతనికి 2006 లో అమెరికన్ సొసైటీ ఆఫ్ కంపోసర్స్ రచయితలు మరియు ప్రచురణ కర్తలు (ASCA)P రిథం మరియు సోల్ హెరిటేజ్ అవార్డు కూడా ఆయనకు లబించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: మూడు సార్లు గ్రామి అవార్డును గెలుచుకున్న బిల్ వితర్స్ కన్నుమూత

ఎవరు: బిల్ వితర్స్

ఎప్పుడు: ఏప్రిల్ 06

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *