
Daily Current Affairs in Telugu 05&06 December- 2022
జాతీయ అవార్డు గెలుచుకున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంస్థ :

దివ్యాంగులకు విశిష్టమైన సేవలు అందిస్తున్నందుకు గాను డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ కు చెందిన స్వచ్చంద సంస్థ- డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ కు జాతీయ అవార్డు లభించింది. అంతర్జా తీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని డిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ సతీష్ రెడ్డి జాతీయ అవార్డును అందుకున్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ 1999లో లైవ్లీహుడ్ అడ్వాన్స్ మెంట్ బిజినెస్ (స్కూల్ (ల్యాబ్స్) ద్వారా నైపుణ్యాల శిక్షణ, ఇతర కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా దివ్యాంగుల ప్రయోజనాలకు చర్యలు చేపట్టింది. 2030 నాటికి డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లోని సిబ్బందిలో 3% మంది దివ్యాంగులకు అవకాశం కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : జాతీయ అవార్డు గెలుచుకున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంస్థ
ఎప్పుడు డిసెంబర్ 05
ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ నిఘంటు వును ప్రచురించే జాబితాలో ఏడాది మేటి పదం గా గాబ్లిన్ మోడ్ :

మోడ్ ఈ goblin mode అనేది ఏడాది మేటి ఎన్నికైనట్లు ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ నిఘంటు వును ప్రచురించే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (ఓయూపీ) ఇటీవల ప్రకటించింది. గాబ్లిన్ ‘మోడ్ అనే పదం అనేది వ్యక్తి ప్రవర్తనను సూచిస్తుంది. ఎంతసేపటికే తన సుఖాలు, తన కోరికనే తప్ప ఇతరులు గురించి పట్టించుకోని తత్వమిది బద్ధకం, అపరిశుభ్రత, దురాశ జీర్ణించిన ధోరణిని గాబ్లిన్ మోడ్ అంటారు. ప్రపంచమంతటా ఆన్లైన్లో నిర్వహించిన సర్వేలో ఏకంగా 92 శాతం (3,18,956) ఓట్లు ఈ పదానికే వచ్చాయి. ప్రస్తుతం జనం నోళ్లలో ఎక్కువగా నానుతున్న కొత్త యాస పదాల్లో మూడింటిని ఎంచుకుని ఈ ఏటి మేటి పదమేదో నిర్ణ యించడానికి ఆన్లైన్ సర్వే నిర్వహించారు. గాబిన్ మోడ్ తో మెటావర్స్, ‘చిఐస్టాండ్ విత్ పదాలు పోటీపడినా చివరకు గావ్లిన్ మోడ్ అత్యధిక ఓట్లు లభించాయి. సామాజిక మాధ్య మా ఇంటర్నెట్లో ఈ మూడు పదాలను ఈ ఏడాది జనం విస్తృతంగా ఉపయోగించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ నిఘంటు వును ప్రచురించే జాబితాలో ఏడాది మేటి పదం గా గాబ్లిన్ మోడ్
ఎవరు : గాబ్లిన్ మోడ్
ఎప్పుడు డిసెంబర్ 05
నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) పార్టీ అధ్యక్షుడిగా మళ్ళి ఎన్నికైన పరూక్ అబ్దుల్లా :

నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) పార్టీ అధ్యక్షుడిగా 85 ఏళ్ల ఫరూక్ అబ్దుల్లా మరో సారి ఎన్నికయ్యారు. ‘జమ్మూ-కశ్మీర్ లోని శ్రీనగ ర్ లో ఇటీవల నిర్వ హించిన పార్టీ ప్రతినిధుల సదస్సులో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలకు గడు. వులోపు పరూక్ ఒక్కరే నామినేషన్ వేశారు. ఎన్సీకి దాదాపు మూడు దశాబ్దాల పాటు అధ్యక్షుడిగా ఉన్న ఫరూక్ అబ్దుల్లా 1981లో తొలిసారి పార్టీ పగ్గాలు చేపట్టారు. 2002 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన తనయుడు ఒమర్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక య్యారు. 2011లో ఆయన ఆ బాధ్యతల నుంచి వైదొలగడంతో తిరిగి ఫరూక్’ అధ్యక్షు డిగా ఎన్నికయ్యారు
క్విక్ రివ్యు :
ఏమిటి : నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) పార్టీ అధ్యక్షుడిగా మళ్ళి ఎన్నికైన పరూక్ అబ్దుల్లా
ఎవరు : పరూక్ అబ్దుల్లా
ఎప్పుడు డిసెంబర్ 05
ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం ఆస్ట్రేలియాలో ప్రారంభం :

ది స్క్వేర్ కిలోమీటర్ అరే (ఎస్ కేఏ) పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం ఆస్ట్రేలియాలో మొదలైంది. 21వ శతాబ్దపు అతిపెద్ద సైన్స్ ప్రాజెక్టుల్లో ఒకటిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. 2028 నాటికి ఈ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. దీని నిర్మాణం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో చేపట్టారు. ప్రధాన కార్యాలయం మాత్రం బ్రిటన్ లో ఉంటుంది. ఖగో శంలో అంతుచిక్కని అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి దీనిని వినియోగించనున్నారు. ఐన్ స్టీవ్ సిద్ధాంతాలను ఇది పరీక్షించనుంది భూమిని న్నార పోలిన గ్రహాల కోసం అన్వేషించనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆస్ట్రేలియాలోని మార్చిషన్ పనిచే ప్రాంతంలో 74 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు లక్షకు పైగా యాంటెన్నాలను నిర్మించనున్నారు ఇది క్రిస్మస్ ట్రీలను పోలి ఉంటాయి దక్షి గురించి జాఫ్రికాలో 107 భారీ డెష్ ను ఏర్పాటు చేయనున్నారు. వీటి మొత్తాన్ని కలిపితే ఇది ప్రపంచం లోనే అతిపెద్ద రేడియో టెలిస్కోపు ప్రాజెక్టుగా నిలవనుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం ఆస్ట్రేలియాలో ప్రారంభం
ఎవరు : ఆస్ట్రేలియాలో
ఎక్కడ : ఆస్ట్రేలియా
ఎప్పుడు డిసెంబర్ 05
బీడబ్ల్యూఎఫ్ అవార్డు దక్కించుకున్న భారత యువ షట్లర్ మనీషా రామదాస్ :

భారత యువ షట్లర్ మనీషా రామదాస్ బీడబ్ల్యూఎఫ్ అవార్డు దక్కించుకుంది. ఈ సీజన్ లో అద్భుత ప్రదర్శనకు గాను బీడబ్ల్యూఎస్ మహిళా పారా బ్యాడ్మింటన్ ప్లేయర్- 2022 ఆవార్డును గెలుచుకుంది. ప్రపంచ చాంపియన్షిప్ ఎస్ూర్ విభాగంలో 17 ఏళ్ల మనిషా స్వర్ణంతో మెరిసింది. ఈ ఏడాది. మనీషా 11 స్వర్ణాలు, 5 కాంస్య పతకాలతో సత్తాచాటింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : బీడబ్ల్యూఎఫ్ అవార్డు దక్కించుకున్న భారత యువ షట్లర్ మనీషా రామదాస్
ఎవరు : మనీషా రామదాస్
ఎప్పుడు డిసెంబర్ 05
77వ గ్రాండ్ మాస్టర్ గా అవతరిం౦చిన ఆదిత్య మిట్టల్ :

యువ చెస్ ఆటగాడు ఆదిత్య మిట్టల్ (ముంబయి) గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు. జీఎం టైటిల్ సాధించిన 77వ భారత క్రీడాకారుడిగా ఆదిత్య ఘనత అందుకున్నాడు. స్పెయిన్లో జరుగుతున్న టోర్నీలో 10 ఏళ్ల ఆదిత్య 2500 ఎలో రేటింగ్ అధిగమించాడు 2500 ఎలో రేటింగ్. మూడు జీఎం నార్కోలు సాదిస్తే గ్రాండ్మాస్టర్’ టైటిల్ లభిస్తుంది. .2021 సెర్బియా మాస్టర్స్లో తొలి బీఎం నార్మ్ అందుకున్న ఆదిత్య అదే ఏడాది ఎలా బైగాట్ ఓపెన్లో రెండో వార్డ్ దక్కించుకున్నాడు. 2022 సెర్సియా మాస్టర్స్ లో మూడో, నార్మ్ సొంతం చేసుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : 77వ గ్రాండ్ మాస్టర్ గా అవతరిం౦చిన ఆదిత్య మిట్టల్
ఎవరు : ఆదిత్య మిట్టల్
ఎప్పుడు డిసెంబర్ 05
ప్రపంచం లోనే అత్యంత పొడవైన నిర్మాణంగా గుర్తింపు పొందిన మహారాష్ట్రలోని నాగుర్ మెట్రో :

మహారాష్ట్రలోని నాగుర్ మెట్రో గిన్నిస్ రికార్డు సాధించింది. ఇక్కడి 3.14 కిలోమీటర్ల డబుల్ డెకర్ వయాడక్ట్ మెట్రో ప్రపంచంలోనే అత్యంత పొడవైన నిర్మాణంగా గుర్తింపు పొందింది. ఇది వార్తా ప్రాంతంలో ఉంది. ఈ డబుల్ డెకర్ వయాడక్ట్ ఇప్పటికే ఆసియాలోనే అతిపెద్ద నిర్మాణంగా గుర్తింపు పొందింది. దీని పైభాగంలో మెట్రోరైలు, మధ్యలో హైవే ఫ్లైఓవర్ ఉన్నాయని మహామెట్రో ఎండీ బ్రిజేష్ దీక్షిత్ తెలిపారు. దిగువన ప్రస్తుతమున్న రోడ్డు కొనసాగుతుందని వివరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచం లోనే అత్యంత పొడవైన నిర్మాణంగా గుర్తింపు పొందిన మహారాష్ట్రలోని నాగుర్ మెట్రో
ఎవరు : నాగుర్ మెట్రో
ఎప్పుడు డిసెంబర్ 06
‘డాక్టర్ ఆఫ్ సైన్స్’ పురస్కారాన్ని గెలుచుకున్న డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డి :

‘ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్’ ఆధ్వర్యంలో డిసెంబర్ 06న ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) చైర్మన్, ప్రఖ్యాత జీర్ణకోశ వైద్యనిపుణుడు డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డికి ‘డాక్టర్ ఆఫ్ సైన్స్’ పురస్కారాన్ని అందజేశారు. సంస్థ 8వ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన వేడుకలో లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా డాక్టర్ నాగేశ్వరరెడ్డికి పురస్కారాన్ని అందజేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ‘డాక్టర్ ఆఫ్ సైన్స్’ పురస్కారాన్ని గెలుచుకున్న డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డి
ఎవరు : డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డి
ఎప్పుడు డిసెంబర్ 06
అత్యధిక ప్రభావం చూపిన 100 మంది ప్రభావశీల మహిళల లో ప్రియాంకా చోప్రా, శిరీష్ బండ్ల, గీతి స్నేహ జవాలేలకు దక్కిన చోటు :

ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అత్యధిక ప్రభావం చూపిన 100 మంది ప్రభావశీల మహిళలతో ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ రూపొందించిన జాబితాలో నలుగురు భారతీయులు చోటుదక్కించుకున్నారు. ప్రముఖ నటి నిర్మాత ప్రియాంకా చోప్రా జోనాస్, ఏరోనాటికల్ ఇంజినీర్ శిరీష బండ్ల, బుకర్ ప్రైజ్ విజేత గీతాంజలి శ్రీ, సామాజిక ఉద్యమకారిణి స్నేహ జనాలేలు ఇందులో స్థానం సంపాదించారు. వీరంతా తమ తమ రంగాల్లో స్పూర్తిదాయక విజయాలు సాదించినట్లు బీబీసీ తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : అత్యధిక ప్రభావం చూపిన 100 మంది ప్రభావశీల మహిళల లో ప్రియాంకా చోప్రా, శిరీష్ బండ్ల, గీతి స్నేహ జవాలేలకు దక్కిన చోటు
ఎవరు : ప్రియాంకా చోప్రా, శిరీష్ బండ్ల, గీతి స్నేహ జవాలేలకు
ఎప్పుడు డిసెంబర్ 06
ఈ-సంజీవని వినియోగంల్లో మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం :

ఈ-సంజీవనిని (ఉచిత టెలి మెడిసిన్ సర్వీస్) దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 8 కోట్ల మంది వినియోగించుకోగా 2.82 కోట్ల ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రక టనలో వెల్లడించింది. ఏపీ తర్వాత స్థానాల్లో వరుసగా పశ్చిమ బెంగాల్ (1 కోటి), కర్ణాటక (94.46 లక్షలు), తమిళనాడు (87.23 లక్షలు), మహారాష్ట్ర (40.70 లక్షలు), ఉత్తరప్రదేశ్ (37.63 లక్షలు), మధ్యప్రదేశ్ (32.83 లక్షలు), బిహార్ 26.24 లక్షలు). తెలంగాణ (24.52 లక్షలు). గుజరాత్ (16 73 లక్షలు) ఉన్నాయని పేర్కొంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఈ-సంజీవని వినియోగంల్లో మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఎప్పుడు డిసెంబర్ 06
ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర మాజీ సహాయ మంత్రి. యోగీందర్ కె. అలగ్ కన్నుమూత :

ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర మాజీ సహాయ మంత్రి. యోగీందర్ కె. అలగ్ (183) డిసెంబర్ 06న తుది శ్వాస విడిశారు. దీర్ఘకా లంగా ఆయన అనారో గంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుత పాకిస్థాన్లోని చక్వాల్లో 1939లో జన్మించిన వై.కె. అలగ్. రాజస్థాన్ విశ్వ విద్యాలయ పూర్వ విద్యార్థి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్.డి పొందారు. 1996లో గుజ రాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996 · నుంచి 1998 వరకు కేంద్ర ప్రణాళిక, కార్యక్ర ‘మాల అమలు శాఖ, శాస్త్రసాంకేతిక, విద్యుత్తు శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర మాజీ సహాయ మంత్రి. యోగీందర్ కె. అలగ్ కన్నుమూత
ఎవరు : యోగీందర్ కె. అలగ్
ఎప్పుడు డిసెంబర్ 06
Daily current affairs in Telugu Pdf September 2022 PDF |
---|
Daily current affairs in Telugu Pdf 01-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 02-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 03-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 04-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 05-09- 2022 PDF |
>Daily current affairs in Telugu Pdf 06-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 07-09- 2022 PDF |
>Daily current affairs in Telugu Pdf 08-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 09-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 10-09- 2022 PDF</strong> |
Daily current affairs in Telugu Pdf 11-09- 2022 PDF |
>Daily current affairs in Telugu Pdf 12-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 13-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 14-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 15-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 16-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 17-09- 2022 PDF</strong> |
Daily current affairs in Telugu Pdf 18-09- 2022 PDF |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |