
Daily Current Affairs in Telugu 05&06-02-2022
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
టాటా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్ ను గెలుచుకున్న బోపన్న రామ్ కుమార్ :

టెన్నిస్ టోర్నమెంట్ రోహన్ బోపన్న-రామ్ కుమార్ రామ నాథన్ టైటిల్ గెలుచుకున్నారు. ఫిబ్రవరి 06 న హోరాహోరీగా జరిగిన డబుల్స్ ఫైనల్లో బోపన్న-రామ్క మార్ 6-7 (10-12), 6-3, 10-6తో ల్యూక్ సావిల్లె-జాక్ ప్యాట్రిక్ (ఆస్ట్రేలియా)పై పోరాడి గెలిచారు. టైబ్రేకర్ కు మళ్లిన తొలి సెట్ లో బోపన్న జోడీ గట్టిగానే పోరాడినా సెట్ కోల్పోయారు. అయితే రెండో సెట్ లో బలంగా పుంజుకున్న భారత జంట మూడో గేమ్ లోనే: ప్రత్యర్ధి సర్వీస్ బ్రేక్ చేసి, ఆపై సెట్ గెలిచి మ్యాచ్ లో నిలిచింది. సూపర్ టై బ్రేకర్ లో కూడా పోటీ నువ్వానేనా అన్నట్లే నడిచింది. అయితే తొమ్మిదో గేమ్ బ్రేక్ సాధించిన బోపన్న జోడీ అపై సెట్ తో ట్రోపీని గెలుచుకుంది. బోపన్నకు ఈ 21వ ఏటీపీ డబుల్ టైటిల్ మార్కుగా రెండోది. గత నెల అడిలైడ్ తొలిసారి జోడీ కట్టారు ఆ టోర్నీలో ఫైనల్ చేరినా రన్నరప్ ట్రోఫీతో . టాటా ఓపెన్ సింగిల్స్ టైటిల్ ను సౌసా (పోర్చుగల్) పైగెలుచుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: టాటా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్ ను గెలుచుకున్న బోపన్న రామ్ కుమార్
ఎవరు: బోపన్న రామ్ కుమార్
ఎప్పుడు : ఫిబ్రవరి 06
ఆస్ట్రేలియా క్రికెట్ టీం కోచ్ గా జస్టిన్ లాంగర్ రాజీనామా:

సరళత లేని కోచింగ్ శైలితో ఇబ్బందిపడుతున్నామని గత కొంత కాలంగా సీనియర్ క్రికెటర్ల నుంచి విమర్శలు ఎదు క్కౌంటున్న జస్టిన్ లాంగర్: ఆస్ట్రేలియా కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో చర్చించిన తర్వాత అతడు తన రాజీనామాను సమర్పించారు. కోచ్ గా 51 ఏళ్ల లాంగర్ నాలుగేళ్ల పదవి కాలం ఈ జూన్ తో ముగియనుంది. అయితే అతడికి కొనసాగింపు ఇవ్వాలా లేదా అనే విషయంపై గత కొంతకాలంగా చర్చ నడుస్తోంది. “స్వల్ప కాలవ్యవదిరి కోచ్ గా ఉండాలన్న మా ప్రతిపాదనను లాంగర్ తిరస్కరించాడు. అతడు సమర్పించిన రాజీనామా అంగీకరించాం” అని క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పింది. యూఏఈ లో జరిగిన టీ20 ప్రపంచకప్ అనూహ్యంగా టైటిల్ గెలిచిన ఆసిస్ స్వదేశంలో జరిగిన యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండు కు 1-0తో చిత్తు చేసి విజేతగా నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆస్ట్రేలియా క్రికెట్ టీం కోచ్ గా జస్టిన్ లాంగర్ రాజీనామా
ఎవరు: జస్టిన్ లాంగర్
ఎక్కడ : ఆస్ట్రేలియా
ఎప్పుడు : ఫిబ్రవరి 06
వింటర్ ఒలింపి క్స్ లో తొలి పసిడి పతకాన్ని గెలుచుకున్న నార్వే దేశం :

వింటర్ ఒలింపి క్స్ లో తొలి పసిడి పతకాన్ని నార్వే సొంతం చేసుకుంది. మహిళల స్కైథాన్ క్రాస్కంట్రీ రేసులో డ్రెస్ జోహాగ్ స్వర్ణం కైవసం చేసుకుంది. ఈ విభాగంలో నటాలియా (రష్యా) రజతం, స్టాడ్లోబెర్ (ఆస్ట్రియా) కాంస్యం గెలుచుకున్నారు. బైథాన్ లో మరో స్వర్ణం నార్వే సొంత మైంది. మిక్స్డ్ రిలేలో ఆ జట్టు పసిడి గెలవగా ఫ్రాన్స్, రష్యా రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాయి. ఆతిధ్య చైనా కూడా బోణీ కొట్టింది. షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ లో చైనా స్వర్ణం గెలవగా, ఇటలీ రజతం, హంగేరి కాంస్యం దక్కించుకున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: వింటర్ ఒలింపి క్స్ లో తొలి పసిడి పతకాన్ని గెలుచుకున్న నార్వే దేశం
ఎవరు: నార్వే దేశం
ఎక్కడ : చైనా (బీజింగ్)
ఎప్పుడు : ఫిబ్రవరి 07
ప్యాభా పురస్కారాలను గెలుచుకున్న మహిమా దాట్ల బిపి ఆచార్య :

తెలంగాణలో ఈ ఫిబ్రవరి నాలుగో వారం జరగనున్న బయో ఆసియా అంతర్జా తీయ సదస్సు సందర్భంగా బయోలాజికల్-ఇ ఎండ్ ‘మహిమా దాట్ల, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్యలకు ఆసియా బయోటెక్ సంఘాల సమాఖ్య (ఫ్యాబా) పుర స్కారాలను ప్రకటించింది. కరోనాపై పోరులో భాగంగా కార్బెవాక్స్ టీకా తయారీతోపాటు వివిధ టీకాల రూపక ల్పనకుగాను మహిమను బీఎస్ బజాజ్ స్మారక పురస్కారం, జీనోమ్ వ్యాలీ, బయోటెక్ రంగం అభివృద్ధికిగాను బీపీ ఆచార్యను ఫ్యాబా జీవన సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ నెల 24, 26 తేదీల్లో జరిగే బయో ఆసియా సదస్సులో వీటిని అందజేస్తామని ఫ్యాూ కార్యనిర్వాహక అధ్యక్షుడు రెడ్డన్న తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్యాభా పురస్కారాలను గెలుచుకున్న మహిమా దాట్ల బిపి ఆచార్య
ఎవరు: మహిమా దాట్ల బిపి ఆచార్య
ఎక్కడ : తెలంగాణ
ఎప్పుడు : ఫిబ్రవరి 05
ఇరాన్ తో అణు నిషేదాని ఎత్తివేసిన అమెరికా దేశం :

ఇరాన్ తో అణు ఒప్పందాన్ని పునరుద్ధరించే దిశగా ఆమె రికా దేశం చర్యలు ప్రారంభించింది. ఈ నిర్ణయం వల్ల ఇరాన్ అణు కార్యక్రమాలకు సహకరించే దేశాలు, కంపెనీలకు అమెరికా విధించే జరిమానాల నుంచి మినహాయింపు లభించనుంది. ఇరాన్ అణు కార్యక్రమానికి ఆటంకంగా ఉన్న పలు ఆంక్షలను బైడెన్ సర్కారు ఎత్తివేసింది. 2018లో ఇరాన్ దేశం అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగిన అనంతరం అప్పటి అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆంక్షలు విధించారు. తాజా పరిణామాల నేపద్యంలో ఇరాన్ ఆణు కార్యకలాపాలకు సంబంధించి విధించిన అనేక ఆంక్ష లను మినహాయిస్తూ అమెరికా విదేశాంగ మoత్రి ఆంటోనీ బ్లింకేట్ ఇటీవలే సంతకం చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇరాన్ తో అణు నిషేదాని ఎత్తివేసిన అమెరికా దేశం
ఎవరు: అమెరికా దేశం
ఎప్పుడు : ఫిబ్రవరి 05
కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ సోనాలి సింగ్ ను నియమించిన భారత ప్రభుత్వం :

ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ శాఖ కింద కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సిజిఎ) కి అదనపు బాధ్యతలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సోనాలి సింగ్ ను నియమించింది. సోనాలి సింగ్ అక్టోబర్ 2019 నుండి ఆడిషనల్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్ గా పనిచేస్తున్నారు. సోనాలి సింగ్ అక్టోబర్ 2019 నుండి అడిషనల్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ పనిచేస్తున్నారు. జనవరి 31, 2022న పదవీ విరమణ పొందిన దీపక్ డాష్ స్థానంలో ఆమె నియమితులయ్యారు. సోనాలి ఇండియన్ సివిల్ అకౌంట్స్ (PAS)కి చెందిన 1987 బ్యాచ్ అధికారి. CGA అనేది భారత ప్రభుత్వానికి ప్రధాన అకౌంటింగ్ సలహాదారు. కార్యాలయం వ్యయ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, GOIలో ఉంది. CGA యొక్క కార్యాలయం సాంకేతికంగా మంచి నిర్వహణ అకౌంటింగ్ వ్యవస్థను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి ఆదేశాలను కలిగి ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వ లెక్కలను కూడా సిద్ధం చేసి సమర్పిస్తుంది. ఇది ఖజానా నియంత్రణ మరియు అంతర్గత ఆడిట్లకు కూడా బాధ్యత వహిస్తుంది
క్విక్ రివ్యు :
ఏమిటి: కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ సోనాలి సింగ్ ను నియమించిన భారత ప్రభుత్వం
ఎవరు: భారత ప్రభుత్వం
ఎప్పుడు : ఫిబ్రవరి 05
.
ప్రపంచ టేబుల్ టెన్నిస్ యూత్ కంటెండర్ చాంపియన్ షిప్ లో కాంస్య పతకం గెలుచుకున్న సుహైనా సైని :

భారత వర్ధమాన ప్యాడ్లర్ సుహానా సైనీ ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) యూత్ కంటెండర్ ట్యునీషియా చాంపియన్ షిప్ లో కాంస్య పతకం చేజిక్కించుకుంది. హర్యానాకు చెందిన 15 ఏండ్ల సుహానా ఫిబ్రవరి 06న జరిగిన అండర్-19 సెమీఫైనల్లో 11-9, 9-11, 10-12, 11-13తో రొమేనియాకు చెందిన వెలనా జహరియా చేతిలో ఓటమి పాలైంది. తొలి గేమ్ నెగ్గిన సుహానా ఆ తర్వాత వరుసగా మూడు గేమ్ లు కోల్పోయి కాంస్యంతో సరిపెట్టుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ టేబుల్ టెన్నిస్ యూత్ కంటెండర్ చాంపియన్ షిప్ లో కాంస్య పతకం గెలుచుకున్న సుహైనా సైని
ఎవరు: సుహైనా సైని
ఎప్పుడు : ఫిబ్రవరి 05
అండర్-19 ప్రపంచకప్ ను గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు :

రికార్డు స్థాయిలో భారత్ కు అయిదోసారి అండర్-19 ప్రపంచక పన్ను అందించిన కుర్రాళ్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ.40 లక్షల చొప్పున అందించనుంది. సహాయ సిబ్బంది ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ఇవ్వనుంది. “అన్ని విభాగాల్లోనూ ఆకట్టు కున్న కుర్రాళ్లు భారత్ కు అయిదో ప్రపంచకప్ అందించారు. మైదానంలో గొప్పగా రాణించిన వాళ్లు కోవిడ్ పైనా అద్భుతంగా పోరాడారు. దాని నుంచి కోలుకుని తిరిగి పుంజుకోవడం జట్టు తపన, అంకితభావం, ధైర్యాన్ని చాటుతోంది. ప్రధాన కోచ్ హృనికేష్ కనిత్కర్ సహా కోచింగ్ సి. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్ సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ కుర్రాళ్లకు అండగా నిలిచారు. వాళ్లను విజయం దిశగా నడిపారు. వివిధ విభాగాల క్రికెటర్ల కోసం మన దగ్గర ఉత్తమ విధానం ఉంది. మంచి కోచ్ లు అందుబాటులో ఉన్నారు” అని బీసీసీఐ. అధ్యక్షుడు గంగూలీ తెలిపాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అండర్-19 ప్రపంచకప్ ను గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు
ఎవరు: భారత క్రికెట్ జట్టు
ఎప్పుడు : ఫిబ్రవరి 06
ప్రఖ్యాత గాయని భారత రత్న లతా మంగేష్కర్ కన్నుమూత :

ఏడు దశాబ్దాలపాటు ఆబాలగోపాలాన్ని నిరంతరం గాన మాధుర్యంతో ఓలలాడించిన గాత్రం మూగబోయింది. 36 భాషలో వేలాది పాటలు పాడిన ఆమె శాశ్వతంగా సెలవు తీసుకుని అప్పటి నుంచి ఆ దివికేగిసారు. కొంతకాలం నుంచి కఠినాతో పాటు న్యుమోనియాతో పోరాడుతున్న ప్రఖ్యాత గాయని, భారత రత్న లతా మంగే ష్కర్ (92) కన్నుమూశారు. స్వల్పంగా కోవిడ్-19 లక్షణాలతో ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో గత నెల 8న చేసిన ఆమె అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. మధ్యలో కొన్నాళ్లు ఆరోగ్యం మెరుగుపడగా ఉంది. దీంతో వెంటిలేటర్ ను తొలగించారు. తర్వాత క్రమేపీ పరిస్థితి విషమించింది. ఫిబ్రవరి 06 నుంచి అత్యంత విషమంగా మారింది. కీలక అవయవాలు పనిచేయకపోవడంతో ఫిబ్రవరి 06న ఉదయం 3.12 గంటలకు ఆమె తుది శ్వాస విడిచినట్లు వైద్యులు,. వెల్లడించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రఖ్యాత గాయని భారత రత్న లతా మంగేష్కర్ కన్నుమూత
ఎవరు: లతా మంగేష్కర్
ఎప్పుడు : ఫిబ్రవరి 06
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |