Daily Current Affairs in Telugu 05 September -2022
బీసీసీఐ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించనున్న మాస్టర్ కార్డ్ :

స్వదేశంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్ లకు బీసీసీఐ టైటిల్ స్పాన్సర్ గా మాస్టర్ కార్డ్ సంస్థ వ్యవహరించ నుంది. పేటీఎం నుంచి మాస్టర్ కార్డ్ ఈ హక్కులను సొంతం చేసుకుంది. దేశవాళీ టోర్నీలకు కూడా మాస్టర్ కార్డ్ స్పాన్సర్ గా ఉంటుంది. “స్వదేశంలో జరిగే పురుషులు, మహిళల అంతర్జాతీయ మ్యాచ్ లకు, దేశవాళీ పోటీలకు (రంజీ, దులీప్, ఇరానీ ట్రోఫీ, అండర్-19, అండర్-23 టోర్నీలు) మాస్టర్ కార్డ్ సంస్థ ప్రకటనకర్తగా వ్యవహరించనుంది” అని బీసీసీఐ తెలిపింది
- బిసిసిఐ పూర్తి రూపం : బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా
- బిసిసిఐ స్థాపన : డిసెంబర్ 1928
- బిసిసిఐ ప్రధానకార్యాలయం : ముంబాయ్
- బిసిసిఐ అద్యక్షుడు : సౌరవ్ గంగూలి
క్విక్ రివ్యు :
ఏమిటి : బీసీసీఐ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించనున్న మాస్టర్ కార్డ్
ఎవరు : మాస్టర్ కార్డ్
ఎప్పుడు : సెప్టెంబర్ 05
బ్రిటన్ నూతన ప్రధాని ఎంపిక ఐన లిజ్ ట్రాస్ :

బ్రిటన్ దేశ నూతన ప్రధాని ఎంపికలో వారాల తరబడి కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అధికార కన్జర్వేటివ్ పార్టీలో అంతర్గతంగా చేపట్టిన నాయకత్వ ఎన్నికలో విదేశాంగమంత్రి లిజ్ ట్రస్ విజయం సాధిం చారు. తన ప్రత్యర్థి, భారత సంతతికి చెందిన మాజీ ఆర్థికమంత్రి రిషి సునాక్ సుమారు 21 వేల ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. దీంతో 47 ఏళ్ల లిజ్ ట్రస్ ప్రధానమంత్రి. బాధ్యతలు చేపట్టడం ఇక లాంఛనప్రాయమే కానుంది. జులై 12న ఆరంభమైన ఓటింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 4 న ముగియగా, సెప్టెంబర్ 05న లండన్ డౌనింగ్ స్ట్రీట్ సమీపంలోని క్వీన్ ఎలిజబెత్ -2 సెంటర్ లో ఓట్లను లెక్కించారు. మొత్తం 1,72,437, మంది ‘సభ్యులకుగాను 1,42,379 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. లిజ్ ట్రాస్ కు 81,326 ఓట్లు రాగా, సునాక్ కు 60,399 ఓట్లు వచ్చి నట్టు రిటర్నింగ్ అధికారి గ్రహమ్ బ్రాడీ ప్రకటించారు. మరో 654 ఓట్లు చెల్లలేదు. హోరాహోరీగా జరుగుతున్న ఈ పోటీలో లిజ్ ట్రస్ విజయం సాధిస్తారంటూ పలు సర్వేలు చెబుతూ వచ్చాయి. వీటిని నిజం చేస్తూ ఫలితాలు వెలువడటంతో మార్గరేట్ దాచెర్, థెరెసా మేల తర్వాత బ్రిటన్ ప్రధాని పగ్గాలు చేపడుతున్న మూడో మహిళగా లిజ్ ట్రస్ చరిత్ర సృష్టించారు.
- బ్రిటన్ దేశ రాజధాని : యునైటెడ్ కింగ్డం
- బ్రిటన్ దేశ కరెన్సీ : పౌండ్ స్టెర్లింగ్
క్విక్ రివ్యు :
ఏమిటి : బ్రిటన్ నూతన ప్రధాని ఎంపిక ఐన లిజ్ ట్రాస్
ఎవరు : లిజ్ ట్రాస్
ఎక్కడ : బ్రిటన్
ఎప్పుడు : సెప్టెంబర్ 05
యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీ జాబితాలో చోటు దక్కించుకున్న వరంగల్:

యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీ జాబితాలో వరంగల్ చేరినట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలశాఖ మంత్రి. జి. కిషన్ రెడ్డి గారు వెల్లడించారు. రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం హోదా దక్కిన ఏడాదిలోపే ఇప్పుడు వరంగల్ కు రెండో గుర్తింపు లభించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుసంపన్నమైన భారతీయ వారసత్వాన్ని చాటిచెప్పి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు ప్రధానమంత్రి చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు ఇది నిదర్శనమని తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీ జాబితాలో చోటు దక్కించుకున్న వరంగల్
ఎవరు : వరంగల్
ఎప్పుడు : సెప్టెంబర్ 05
నేపాల్ దేశ గౌరవ జనరల్ హోదాను భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే :

నేపాల్ దేశ అధ్యక్షురాలు విద్య దేవీ భండారి తమ దేశ గౌరవ జనరల్ హోదాను భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండేకు ప్రదానం చేశారు. ఖాట్మండు లోని అధ్యక్షురాలి అధికారిక నివాసంలో సెప్టెంబర్ 05న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఖడ్గం, ప్రశంసా పత్రాన్ని కూడా జనరల్ మనోజ్ పాండేకు ఆమె అందించారు. రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు చిహ్నంగా గత ఏడు దశాబ్దాలుగా ఈ సంప్రదాయంగా కొనసాగుతోంది. నేపాల్ దేశ సైన్యాధిపతికి భారత్ కూడా గౌరవ జనరల్ హోదాను ప్రదానం చేస్తోంది.
- నేపాల్ దేశ రాజధాని : ఖాట్మండు
- నేపాల్ దేశ కరెన్సీ :నేపాలీస్ రూపి
- నేపాల్ దేశ అద్యక్షుడు :భిద్యా దేవి బండారి
- నేపాల్ దేశ ప్రదానమంత్రి : షేర్ బహదూర్ దేబా
క్విక్ రివ్యు :
ఏమిటి : నేపాల్ దేశ గౌరవ జనరల్ హోదాను భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే
ఎవరు : మనోజ్ పాండే
ఎక్కడ : నేపాల్ దేశ౦
ఎప్పుడు : సెప్టెంబర్ 05
లోక్ నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారాన్ని అందుకున్న తనికెళ్ళ భరణి :

లోక్ నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత మరిం తనికెళ్ల భరణికి అందించారు.కాగా ఈ లోక్నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏపీ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించారు. లోక్ నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఏపీ అధికార భాషా సంఘం చైర్మన్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, సినీ హీరో డాక్టర్ మంచు ‘మోహన్ బాబు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్. లోక్ సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్. జయప్రకాష్ నారాయణ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు పాల్గొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : లోక్ నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారాన్ని అందుకున్న తనికెళ్ళ భరణి
ఎవరు : తనికెళ్ళ భరణి
ఎప్పుడు : సెప్టెంబర్ 05
ట్రావెల్ రైటర్ ప్రపంచ సంస్థ “సంస్కృతికి ఉత్తమ గమ్యస్థానం గా ఎంపికైన పశ్చిం బెంగాల్ :

పశ్చిమ బెంగాల్ ను ట్రావెల్ రైటర్ ప్రపంచ సంస్థ “సంస్కృతికి ఉత్తమ గమ్యస్థానం Best Destination for Culture” గా ఎంపిక చేసిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు యు.ఎన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ యొక్క అనుబంధ సంస్థ అయిన పసిఫిక్ ఏరియా ట్రావెల్ రైటర్స్ అసోసియేషన్, సంస్కృతికి ఉత్తమ గమ్య అంతర్జాతీయ ట్రావెల్ అవార్డ్ 2023 గాను వెస్ట్ బెంగాల్ ను ని ప్రదానం చేస్తుంది. UN వరల్డ్ టూరిజం నైజేషన్ యొక్క అనుబంధ సంస్థ అయిన పసిఫిక్ ఏరియా ట్రావెల్ రైటర్స్ అసోసియేషన్, సంస్కృతికి ఉత్తమ గమ్యస్థానం కోసం అంతర్జాతీయ ట్రావెల్ అవార్డు 2029తో పశ్చిమ బెంగాల్ కు ప్రదానం చేస్తుందని తెలిపారు.
- పశ్చిం బెంగాల్ రాష్ట్ర రాజధాని : కోల్ కతా
- పశ్చిం బెంగాల్ రాష్ట్ర సిఎం : మమతా బెనర్జీ
- పశ్చిం బెంగాల్ గవర్నర్ : శ్రీ లా గణేషన్
క్విక్ రివ్యు :
ఏమిటి : ట్రావెల్ రైటర్ ప్రపంచ సంస్థ “సంస్కృతికి ఉత్తమ గమ్యస్థానం గా ఎంపికైన పశ్చిం బెంగాల్
ఎవరు : పశ్చిం బెంగాల్ ఎప్పుడు : సెప్టెంబర్ 05
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |