
Daily Current Affairs in Telugu 05 & 06-12-2020
పుట్ బాల్ జగ్లింగ్ లో ప్రపంచ రికార్డు సృష్టించిన బాలిక అఖిల :

కేరళ లోని కన్నూర్ కు చెందిన ఒక బాలిక పుట్ బాల్ జగ్లింగ్ లో ప్రపపంచ రికార్డు సాధించింది. కన్నూర్ లోని చేరుకున్న ప్రాంతానికి చెందిన అఖిల పదమూడేళ్ళ పుట్ బాల్ క్రీడలపై ఆసక్తి పెంచుకుంది. నిమిషం వ్యవధిలో 171 సార్లు బంతిని నేలకు తాకనివ్వకుండా తన కాళ్ళపై ఆడిస్తూ అఖిల ఈ ఘనత ను సాధించింది. బ్రెజిల్ కు చెందిన జగ్లర్ జాషువా డ్యురేట్టి పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. కన్నూర్ లోని స్పోర్ట్స్ డివిజిన్ స్కూల్ లో ఏడో తరగతి చదువుతున్న అఖిల రాష్ట్ర క్రీడా శిక్షణ కార్యక్రమం “కిక్ ఆఫ్” లో చిన్న వయసులోనే తర్పీడు పొందింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: పుట్ బాల్ జగ్లింగ్ లో ప్రపంచ రికార్డు సృష్టించిన బాలిక అఖిల
ఎవరు: అఖిల
ఎక్కడ: కేరళ లోని కన్నూర్
ఎప్పుడు: డిసెంబర్ 06
భారతీయ వ్యవసాయ పరిశోదన మండలి (ఐసిఎఆర్)కి దక్కిన ఐరాసా అవార్డు :

భారత వ్యవసాయ పరిశోదన మండలి (ఐసిఏఆర్) కి ఐక్య రాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ భూమి బోల్ వరల్డ్ సాయిల్ డే అవార్డు లబించింది. ప్రజల్లో భూసార పరీక్షలపై అవగాహన కల్పించినందుకు గాను ఈ పురస్కారాన్ని ఐసిఏఆర్ సొంత౦ చేసుకుంది. గత ఏడాది డిసెంబర్ భూసార పరీక్షలను సామజిక మాధ్యమాల్లో భారీ అవగాహన కార్యక్రమాన్ని ఐసిఏఆర్ నిర్వహించింది. జనవరి లో బ్యాంకాక్ జరిగే అధికారిక కార్యక్రమం లో అవార్డు అందజేస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారతీయ వ్యవసాయ పరిశోదన మండలి (ఐసిఎఆర్) కి దక్కిన ఐరాసా అవార్డు
ఎవరు: ఐసిఎఆర్
ఎప్పుడు: డిసెంబర్ 06
ఆంధ్రప్రదేశ్ ఎసిబి డైరెక్టర్ గా బి.మల్లారెడ్డి నియమకం :

తెలంగాణా రాష్ట్ర కేడర్ లో పదవి విరమణ పొందిన సీనియర్ ఐపిఎస్ అధికారి బి.మల్లారెడ్డి ఎపి అవినీతి నిరోధక శాఖా (ఎసిబి) డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన నీలం సాహ్నిగారు డిసెంబర్04న ఉత్తర్వులు జారీ చేసారు. ఆయన ఈ పదవిలో ఎసిబి డైరెక్టర్ గా రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. ఈయన మొదట నల్గొండ జిల్లా రామడుగు కు చెందిన మల్లారెడ్డి 1987 డిఎస్పి గా ఎంపిక అయి కడప జిల్లలో విధులు నిర్వహించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ ఎసిబి డైరెక్టర్ గా బి.మల్లారెడ్డి నియమకం
ఎవరు: బి.మల్లారెడ్డి
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: డిసెంబర్ 06
అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కివీస్ క్రికెటర్ కోరే అండర్సన్ :

న్యూజిలాండ్ పేస్ ఆల్ రౌండర్ కోరే అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. కివీస్ తరపున 13టెస్టులు,49వన్డేలు ,31టి20 ల్లో ప్రాతినిత్యం వహించిన అతను గత రెండేళ్ళుగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. 2014 లో వెస్టిండీస్ తో మ్యాచ్ లో అత్యంత వేగవంతమైన రికార్డు అండర్సన్ సొంతం చేసుకున్నాడు. ఆ రికార్డు తర్వాత డివిలియర్స్ (31బంతులలో) బద్దలు కొట్టాడు. లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్ మ్యాన్ అయిన అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 2277 పరుగులు చేయడంతో పాటు 90 వికెట్లు పడగొట్టాడు. ఐపిఎల్ లో డిల్లి డేర్ డివిల్స్ ముంబై ఇండియన్స్ రాయల్స్ చాలంజర్స్ ,బెంగళూర్ జట్ల తరపున ఆడాడు. 2015 వన్డే ప్రపంచ కప్ రన్నరప్ నిలిచిన న్యూజిలాండ్ జట్టు లోను ఉన్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కివీస్ క్రికెటర్ కోరే అండర్సన్
ఎవరు: కోరే అండర్సన్
ఎప్పుడు: డిసెంబర్ 06
ప్రపంచ నేల దినోత్సవం గా డిసెంబర్ 6 :

ప్రతి సంవత్సరం డిసెంబర్ 5 ను ప్రపంచ నేల దినోత్సవంగా పాటిస్తున్నారు. 2013 లో, ఐక్యరాజ్యసమితి యొక్క ఆహార సంస్థ మరియు వ్యవసాయసంస్థ సమిష్టిగా దీనికి మద్దతు ఇచ్చింది మరియు ఈ రోజు గుర్తుగా యుఎన్ అసెంబ్లీ అధికారులను అభ్యర్థించింది. ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థల గురించి మరియు మానవ జీవితాలలో నేల యొక్క ప్రాముఖ్యత దాని వల్ల ఉపయోగాల గురించి అవగాహన పెంచడానికి ఈ రోజును జరుపుకుంటారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ నేల దినోత్సవం గా డిసెంబర్ 6
ఎప్పుడు: డిసెంబర్ 06
హాఫ్ మారథాన్ లో వరల్డ్ రికార్డు సృష్టించిన కెన్యా లాంగ్ రన్నర్ కాండి:

కెన్యా లాంగ్ డిస్టన్స్ రన్నర్ కొబివోత్ కాండి హాఫ్ మారథాన్ లో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసాడు. డిసెంబర్ 06న స్పెయిన్ లో జరిగిన మెన్స్ హాఫ్ మారథాన్ (21కిలో మీటర్లు) ను 24ఏళ్ల కాండి 57 నిమిషాల 32 సెకన్ల ముగించాడు. దీంతో 2019లో జెఫ్రీ కాం వోరన్ నెలకొల్పిన రికార్డు బ్రేక్ చేసాడు. కాం వోరార్ కంటే 29 సెకన్ల ముందుగానే కాండి లక్ష్యాన్ని చేరాడు. వరల్డ్ చాంపియన్ జాకబ్ కిలిపియో (ఉగాండా) రోనేక్స్ కిపుర్టో టాప్ -2,3 లో నిలిచారు. మహిళా రేస్ ను జేనేబి దిబాబా ఒక గంట 5ని.18సెకన్లలో ముగించి టాప్ లో నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: హాఫ్ మారథాన్ లో వరల్డ్ రికార్డు సృష్టించిన కెన్యా లాంగ్ రన్నర్ కాండి
ఎవరు: కాండి
ఎప్పుడు: డిసెంబర్ 06
ఆకాష్ క్షిపణి ని విజయవంతంగా ప్రయోగించిన భారత్ :

భారత వైమానిక దళం మరో సారి ఆకాష్ క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తల పరిస్థితుల నేపద్యంలో ఈ ప్రయోగాలు ప్రాదాన్యం సంతరించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని సూర్య లంక టెస్ట్ ఫైరింగ్ రేంజ్ గత వారం పది ఆకాష్ క్షిపణులను ఖచ్చితత్వం చేదించాయని క్షిపణులను రక్షణ పరిశోధన అబివృద్ది సంస్థ (డిఆర్డివో) రూపకల్పన చేయగా బిడిఎల్ ఉత్పత్తి చేస్తుంది. దేశీయంగా తయారుచేసిన క్షిపను లను భారత్ సైన్యం వైమానిక దళంలో వినియోగిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆకాష్ క్షిపణి ని విజయవంతంగా ప్రయోగించిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ: భారత్
ఎప్పుడు: డిసెంబర్ 06
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |