
Daily Current Affairs in Telugu 05-04-2022
జాతీయ ఫెడరేషన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో రికార్డ్ సృష్టించిన కృపాల్ సింగ్ :

జాతీయ ఫెడరేషన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో కృపాల్ సింగ్ బాత్ డిస్కస్తోత్రోలో మీట్ రికార్డు నెలకొల్పుతూ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. మంగళవారం జరిగిన పురుషుల డిస్కస్ ఫైనల్లో కృపాల్ డిస్క్ ను 6183 మీటర్ల దూరం విసిరి 22 ఏళ్ల క్రితం అని ల్ కుమార్ (59,55 మీ) నెలకొల్పిన మీట్ రికార్డును బద్దలు కొట్టాడు. తాను విసిరిన నాలుగు త్రోల్లోనూ అతడు 60 మీటర్ల మార్కు దాటడం విశేషం. పోల్వార్ట్లో నలుగురు అథ్లెట్లు 4.90 మీటర్ల ఎత్తు ఎగరగా. వీరిలో కౌంట్ బ్యాక్ లో శివ, గోకుల్ ఇద్దరికి స్వర్ణాన్ని పంచారు. జ్ఞాన సోన్ కాంస్యం నెగ్గగా దీపక్ యాదవ్ నాలుగో స్థానంలో నిలిచాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : జాతీయ ఫెడరేషన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో రికార్డ్ సృష్టించిన కృపాల్ సింగ్
ఎవరు: కృపాల్ సింగ్
ఎప్పుడు: ఏప్రిల్ 05
భారత్లో కుబేరుల జాబితాలో అగ్రగామిగా నిలిచిన ముకేశ్ అంబానీ:

భారత్లో కుబేరుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. ఏడాది కిందట 140 మందే ఉండగా. ఇప్పుడు వీరి సంఖ్య 166కి చేరింది. వీరి సంయుక్త సంపద దాదాపు 26 శాతం వృద్ధి చెంది 750 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.56.25 లక్షల కోట్లు)కు చేరుకోవడం విశేషం. ఇక దేశంలో అగ్రగామి తొలి ముగ్గురి స్థానాలు యధాతథంగా కొనసాగాయి. ఆసియాలోనూ తొలి రెండు స్థానాలు ముకేశ్ అంబానీ ఏడాది వ్యవధిలో కేవలం 7 శాతం వృద్ధి దేశంలో సాధించినా. ఆసియాలో అగ్రగామి కుబేరుడిగా కొనసాగారు. ప్రపంచ వ్యాప్తంగా పదో స్థానంలో నిలిచిన ఆయన సంపద 90.7 బిలియన్ డాలర్ల (రూ.6.8 లక్షల కోట్లు)కు చేరుకుంది. గౌతమ్ అదానీ ఏడాది వ్యవ’దిలో ఏకంగా 40 బిలియన్ చేసుకుని (దాదాపు రూ. 75 లక్షల కోట్లు)తో ఆసియా, భారత్ లో రెండో అత్యంత ధనవంతుడిగా అయ్యారు. ఇటు అంబానీ ధనవంతుడిగా ఇటు అదానీలు వచ్చే దశాబ్దంలో భారీ హరిత ఇందనంపై. భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత్లో కుబేరుల జాబితాలో అగ్రగామిగా నిలిచిన ముకేశ్ అంబానీ
ఎవరు: ముకేశ్ అంబానీ
ఎప్పుడు: ఏప్రిల్ 05
హంగేరియన్ ప్రధానమంత్రి నాలుగవ సారి పదవి చేపట్టిన విక్టర్ ఒర్బన్ :

హంగేరియన్ ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్ 2022లో దేశంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి నాల్గవసారి పదవిలో కొనసాగారు. అతని రైట్-వింగ్ ఫిడెజ్ పార్టీ మొత్తం 98% కౌంట్‌లో 53.1% సాధించింది. మే 2010లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 58 ఏళ్ల ఆయన ఇప్పటికే హంగేరియన్ ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్ 2022లో దేశంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో తిరిగి ఘనవిజయం సాధించి నాల్గవసారి కూడా పదవిలో కొనసాగారు. అతని రైట్-వింగ్ ఫిడెజ్ పార్టీ తరపున మొత్తం 98% కౌంట్‌లో 53.1% సాధించింది. మే 2010లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 58 ఏళ్ల ఆయన ఇప్పటికే యురోపియాన్ యునియన్ లో లో ఎక్కువ కాలం ప్రభుత్వ అధిపతిగా ఉన్నారు.
క్విక్ రివ్యు
ఏమిటి : హంగేరియన్ ప్రధానమంత్రి నాలుగవ సారి పదవి చేపట్టిన విక్టర్ ఒర్బన్
ఎవరు: విక్టర్ ఒర్బన్
ఎక్కడ; హంగేరి
ఎప్పుడు: ఏప్రిల్ 05
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి స్వతంత్ర నిపుణుడిగా డాక్టర్ ఇయాన్ ఫ్రై నియామకం :

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) మానవ హక్కులు మరియు వాతావరణ మార్పుల కోసం ప్రపంచంలోని మొట్టమొదటి స్వతంత్ర నిపుణుడిగా డాక్టర్ ఇయాన్ ఫ్రైని నియమించింది. మూడేళ్ల కాలానికి డాక్టర్ ఫ్రై నియమితులయ్యారు. అతను తువాలు మరియు ఆస్ట్రేలియా దేశాల యొక్క ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. అక్టోబర్ 2021లో UNHRC మానవ హక్కులు మరియు వాతావరణ మార్పుల కోసం ప్రత్యేకం రిపోర్టర్ని సృష్టించింది. వాతావరణ మార్పుల సందర్బం లో మానవ హక్కుల ప్రచారం మరియు రక్షనపైన అధికారికంగా ప్రత్యేక రిపోర్టర్ అని పిలుస్తారు .
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి స్వతంత్ర నిపుణుడిగా డాక్టర్ ఇయాన్ ఫ్రై నియామకం
ఎవరు: డాక్టర్ ఇయాన్ ఫ్రై
ఎప్పుడు: ఏప్రిల్ 05
జాతీయ సముద్ర దినంగా ఏప్రిల్ 05 :

ఏప్రిల్ 5న దేశవ్యాప్తంగా జాతీయ సముద్ర దినంగా జరుపుకుంటారు. మరియు భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో సముద్ర వాణిజ్యం పాత్ర మరియు ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం పాత్ర మరియు దాని వ్యూహాత్మక స్థానం కోసం అంకితం చేయబడింది. గత సంవత్సరం జాతీయ సముద్రయాన దినోత్సవం యొక్క థీమ్ సస్టైనబుల్ షిప్పింగ్ బియాండ్ కోవిడ్-19 ‘. ఈ సంవత్సరం థీమ్ కి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. భారతదేశంలోని 12 ప్రధాన ఓడరేవులలో, జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ అతిపెద్దది మరియు ప్రపంచంలోని టాప్ 100 కంటైనర్ పోర్ట్ లలో 28వ స్థానంలో ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : జాతీయ సముద్ర దినంగా ఏప్రిల్ 05
ఎప్పుడు: ఏప్రిల్ 05
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |