Daily Current Affairs in Telugu 03&04 June-2022
అంతర్జాతీయ హాకీ సమాఖ్య హాకీ ఫైవ్స్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత జట్టు :

అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఎహెచ్) హాకీ ఫైవ్స్ టోర్నమెంట్ లో (ఒక్కో జట్టులో ఐదుగురు చొప్పున ఆడతారు) భారత పురుషుల జట్టు విజేతగా నిలిచింది. ఐదు జట్ల మధ్య జరిగిన ఈ టోర్నీలో భారత్ అజేయంగా నిలిచింది. పోలాండ్ జట్టుతో మే 05న హోరాహోరీగా జరిగిన ఫైనల్లో భారత్ 6-4 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున సంజయ్, గురీందర్ సింగ్ ఒక్కో గోల్ చేయగా దామి. సింగ్ రాహిల్ మొహమ్మద్ రెండేసి గోల్స్ చేసి విజయం సాధించారు.
- ఇంటర్నేషనల్ హాకి సమాఖ్య స్థాపన :1924 జనవరి 7
- ఇంటర్నేషనల్ హాకి సమాఖ్య ప్రధాన కార్యాలయం :లుసానే స్విట్జర్ ల్యాండ్
- ఇంటర్నేషనల్ హాకి సమాఖ్య సియివో : తెర్రి వేల్
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ హాకీ సమాఖ్య హాకీ ఫైవ్స్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత జట్టు
ఎవరు: భారత జట్టు
ఎప్పుడు : మే 05
14వసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ :

వేదిక అదే. ప్రత్యర్థి మారాడంతే. తుది ఫలితం మాత్రం యథాతథమే. ఎర్రమట్టి కోర్టులపై మకుటంలేని మహారాజు తానేనని స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ మరోసారి నిరూపించుకున్నాడు. 36 ఏళ్ల వయస్సులో ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 14వ సారి విజేతగా నిలిచి ఔరా అనిపిం చాడు. 2005లో తన 19 ఏళ్ల ప్రాయంలో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించిన రాఫెల్ నాదల్ 17 ఏళ్ల తర్వాత కూడా అదే ఉత్సాహంతో, అదే పట్టుదలతో, లనే విజయకాంక్షతో బరిలోకి దిగి తన గెలుపు పాట వినిపించాడు. ఫైనల్ చేరేలోపు తనను . ఓడించగలిగే సత్తా ఉన్న ఆటగాళ్లను హోరాహోరీ పోరాటాల్లో ఇంటిదారి పట్టించిన ఈ స్పెయిన్ సూపర్ స్టార్ తుది సమరంలో మాత్రం చెలరేగిపో యాడు. కెరీర్లో తొలి గ్రాంమ్ ఫైనల్ ఆడుతున్న నార్వే ప్లేయర్, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ కాన్సర్ రూమ్ ను నాదల్ హడలెత్తించాడు. రూమ్ కేవలం ఆరు గేమ్ లు కోల్పోయిన నాడర్ నాదల్ హడలెత్తించాడు. రూమ్ కు కేవలం ఆరు గేమ్ లు కోల్పోయిన నాదల్ 2 గంటల 18 నిమిషాల్లో ఫైనల్ ను ముగించేసి తనకెంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని ముద్దాదాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: 14వసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్
ఎవరు: స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్
ఎప్పుడు : మే 05
హర్యానాలో ప్రారంభ౦ అయిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 :

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 యొక్క నాల్గవ ఎడిషన్ హర్యానా రాష్ట్రములో ప్రారంభమయ్యాయి. పంచకుల వేదికగా కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షా గ్రాండ్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ను అధికారికంగా ప్రారంభించారు.కాగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ దేశంలోనే అతిపెద్ద జాతీయ స్థాయి క్రీడా పోటీ.
- హర్యానా రాష్ట్ర రాజధాని :చండీఘర్
- హర్యానా రాష్ట్ర సిఎం : మనోహర్ లా ఖట్టార్
- హర్యానా రాష్ట్ర గవర్నర్ : బండారు దత్తాత్రేయ
క్విక్ రివ్యు :
ఏమిటి: హర్యానాలో ప్రారంభ౦ అయిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్
ఎవరు: ఖేలో ఇండియా యూత్ గేమ్స్
ఎక్కడ : హర్యానా
ఎప్పుడు : మే 04
ఢిల్లీ ఎన్సికల కి స్టేట్ ఐకాన్ గా నియమితులైన క్రికెటర్ యష్ దుల్ :

తమ ఓటు హక్కును వినియోగించుకునేలా రాష్ట్రములోని యువకులను ప్రోత్సహించేందుకు ఢిల్లీ ఎన్నికల సంఘం భారత క్రికెటర్ యష్ ధుల్ ను ఢిల్లీ స్టేట్ ఐకాన్ గా నియమించింది. కాలేజీ స్థాయి ఓటరు అవగాహన కార్యక్రమాల్లో కూడా పాల్గొనేందుకు క్రికెటర్ అంగీకరించాడు. 2021-22రంజీ ట్రోఫీలో ఢిల్లీ క్రికెట్ జట్టు తరపున యష్ ధుల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 2021 అండర్ 16 ట్రోఫీలో ఢిల్లీ క్రికెట్ జట్టు తరఫున యష్ ధుల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అతను వెస్టిండీస్ లో 2022 ICC అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కు భారతదేశానికి కెప్టెన్ గా కూడా ఉన్నాడు..
- డిల్లి సిఎం : అరవింద్ కేజ్రివాల్
- డిల్లి లెఫ్టినెంట్ జనరల్ : వినయ్ కుమార్ మహంతి
క్విక్ రివ్యు :
ఏమిటి: ఢిల్లీ ఎన్సికల కి స్టేట్ ఐకాన్ గా నియమితులైన క్రికెటర్ యష్ దుల్
ఎవరు: క్రికెటర్ యష్ దుల్
ఎక్కడ : డిల్లి
ఎప్పుడు : మే 05
ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జూన్ 05 :

జూన్ 5వ తేదీని పర్యావరణ దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని 1972లో స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్ సమయంలో UN జనరల్ అసెంబ్లీ ఏర్పాటు చేసింది. పర్యావరణ పరిరక్షణను ప్రధాన సమస్యగా మార్చడానికి ఇది ప్రపంచంలోనే చేసిన మొదటి సమావేశం. కాగా ఈ ప్రపంచ పర్యావరణం దినం గా మొదటిసారిగా 1974లో జరుపుకుంది. ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఈ ఏడాది పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ ‘ఓన్లీ వన్ ఎర్త్’ గా ఉంది. పర్యావరణం మరియు ప్రకృతిపై అవగాహన కల్పించడానికి దీనిని జరుపుకుంటారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జూన్ 05
ఎవరు: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు : మే 05
దేశంలోనే తొలి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోపు ఉత్తరాఖండ్ లో ఏర్పాటు :

దేశంలోనే తొలి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోపు ఉత్తరాఖండ్ లో ఏర్పా టైంది. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ సంస్థ.. నైనిటాల్ కొండ ప్రాంతంలోని దేవస్థల్ అబ్జర్వేటరీ వద్ద ఈ సైనిక అవసరానికి టెలిస్కోపును ఏర్పాటు చేసింది. ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలివిజన్ స్కోపుగా (ఐఎల్ఎంటీ) పిలుస్తున్న ఈ పరికరం, ఆస్టరాయిడ్లు, సూపర్సోవాలతో పాటు అంతరిక్ష వ్యర్ధాలపై పరిశీలన చేస్తుంది. ఆసియాలో అతిపెద్ద మిర్రర్ టెలిస్కోపుగా ఇది నిలవనుంది. ప్రపంచంలో ఇలాంటి టెలిస్కోపులు కొన్ని మాత్రమే ఉన్నాయి. అవన్నీ సైనిక అవసరాలు, లేదా ఉపగ్రహాలపై కన్నేసి ఉంచేందుకు ఏర్పాటుచేశారు. ఖగోళ పరిశోధనల కోసం ప్రపంచంలోనే తొలిసారి బెల్జియం ఏర్పాటుచేసిన లిక్విడ్ మిర్రర్ టెలిస్కోపు ఇదే కావడం విశేషం. హిమాలయాల్లో 2450 మీటర్ల ఎత్తైన ప్రాంతంలో లిక్విడ్ టెలిస్కోపును ఏర్పాటు చేశారు. ఈ టెలిస్కోపును ఉపయోగించి అక్టోబర్ నుంచి శాస్త్రీయ పరిశోధనలు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
- ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని : డెహ్రాడూన్
- ఉత్తరాఖండ్ రాష్ట్ర సిఎం :పుష్కర్ సింగ్ దామి
- ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్ : గుర్మీత్ సింగ్
క్విక్ రివ్యు :
ఏమిటి: దేశంలోనే తొలి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోపు ఉత్తరాఖండ్ లో ఏర్పాటు
ఎవరు: ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : ఉత్తరాఖండ్ లో
ఎప్పుడు : మే 04
ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ విజేతగా నిలిచిన ఇగా స్వైటేక్ :

మట్టి కోర్టులో ప్రపంచ నంబర్ వన్ మళ్లి కుమ్మేసింది. పోలెండ్ రాష్ట్ర అమ్మాయి ఇగా స్వైటెక్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకుంది.. ఫేవరెట్ గా టోర్నీలో అడుగుపెట్టిన ఆమె అంచనాలకు తగ్గట్లే అదరగొట్టింది. దూకుడు కొనసాగిస్తూ మే 05న జరిగిన ఫైనల్ లో 6-1, 6-3తో కాకో గాప్పై అలవోకగా విజయం సాధించింది. ఫిబ్రవరి నుంచి ఓటమనేదే తెలియని స్వైటెక్ కు ఇది వరుసగా ఏడవ విజయం. అద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించిన స్వైటిక్ మ్యాచ్ లో 18 విన్నర్లు కొట్టింది. ఆమె బలమైన ఫోర్ హ్యాండ్ షాట్లతో అదరగొట్టింది. గాప్ మూడు డబుల్ పార్టీలు, 23 అనవసర తప్పిదాలు చేసింది. స్వైటెక్ట్ అయిదు సార్లు ప్రత్యం సర్వీసును బ్రేక్ చేయగా గాఫ్ ఒక్క బ్రేక్ఏ సాధించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ విజేతగా నిలిచిన ఇగా స్వైటేక్
ఎవరు: ఇగా స్వైటేక్
ఎప్పుడు : మే 04
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |