
Daily Current Affairs in Telugu 04-12-2020
ఫిక్కి అధ్యక్షునిగా తొలిసారిగా మీడియా ఎగ్సిక్యుటివ్ ఉదయ శంకర్ నియామకం :

పరిశ్రమల సమాఖ్య ఫిక్కి అధ్యక్షునిగా 2020-21 సంవత్సరానికి మీడియా ఎగ్సిక్యుటివ్ ఉదయ శంకర్ గారు నియమితులయ్యారు ఈ డిసెంబర్ 11-14 తేదిల్లో జరగబోయే ఫిక్కి 93వ వార్షిక సాదారణ సమవేశంలో (ఎజిఎం) ఫిక్కి ప్రస్తుత ప్రెసిడెంట్ అపోలో హాస్పిటల్స్ గ్రూప్ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ సంగీత రెడ్డి నుంచి శంకర్ గారు బాద్యతలు స్వీకరించారు. ఉదయ శంకర్ ప్రస్తుతం ది వాల్ డిస్నీ కంపెని (ఆసియా ఫసిఫిక్ ) ప్రెసిడెంట్ స్టార్,డిస్నీ ఇండియా చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఫిక్కి కి తొలిసారిగా మీడియా వినోద రంగ ఎగ్సిక్యుటివ్ గా పని చేసిన వ్యక్తి ప్రెసిడెంట్ గా రాబోతున్నారు. ఉదయ్ శంకర్ తమ కంపెని బాద్యతల నుంచి డిసెంబర్ 31న తప్పుకోనున్నట్లు ది వాల్ డిస్నీ కంపెని వెల్లడించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఫిక్కి అధ్యక్షునిగా తొలిసారిగా మీడియా ఎగ్సిక్యుటివ్ ఉదయ శంకర్ నియామకం
ఎవరు : ఉదయ శంకర్
ఎప్పుడు: డిసెంబర్ 04
ఫార్చున్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2020 జాబితాలో స్థానం దక్కించుకున్న భారత సంతతి వ్యక్తులు :

ఫార్చున్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2020 జాబితాలో సంతతికి చెందిన అడోబ్ సియివో శాంతమ నారాయణ్ మాస్టర్ కార్డ్ సియివో అజయ్ బంగా చోటు దక్కించుకున్నారు. టెస్లా సియివో ఎలాన్ అగ్రస్థానంలో నిలిచారు. అలెన్ మాస్క్ వరుసగా రెండో సారి ఈ జాబితాలో అగ్రస్థానం పొందడం గమనార్హం. కరోనా సంక్షోబం ప్రభావం ఉన్నప్పటికీ ఇతర దిగ్గజ నాయకులు సైతం గణనీయం పని తీరు కనబరచినట్లు ఫార్చున్ తెలిపింది. ఈ జాబితాలో 8వ స్థానం లో నారాయణ్ ఉన్నారు. ఆయన సారద్యంలో అడోబ్ డిజైన్,పబ్లిషింగ్ టూల్స్ మరింత మందికి చేరువకావడం కొనసాగిందని వెల్లడించింది. ప్రతికూల పరిస్థితుల్లోను కంపెని మూడో త్రైమసికంలో 14వృద్ది తో 3.3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. గత పదేళ్లుగా మాస్టర్ కార్డ్ సియోవో గా వ్యవహరిస్తున్న అజయ్ బంగా జాబితాలో 9వ స్థానం లో నిలిచారు. ఫార్చున్ 20 మంది జాబితాలో అడ్వాన్స్ డ్ మైక్రో డివైసెస్ సియివో లీసా సూ (2స్థానం ) నెట్ ఫ్లిక్స్ సియివో రీడ్ హేస్టింగ్స్ (4) ఫోర్టిస్కూ మెటల్స్ గ్రూప్ సియివో ఎలిజిబెత్ గెయిన్స్ (5) అమెజాన్ జెఫ్ బెజోస్ (7) ,ఇంట్యుట్ సియివో శాసన్ గూడార్జి (16) స్థానాల్లో ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఫార్చున్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2020 జాబితాలో స్థానం దక్కించుకున్న భారత సంతతి వ్యక్తులు
ఎవరు : అడోబ్ సియివో శాంతమ నారాయణ్ మాస్టర్ కార్డ్ సియివో అజయ్ బంగా
ఎప్పుడు: డిసెంబర్ 04
భారత అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ గా రాదా కృష్ణన్ నాయర్ నియామకం :

జాతీయ అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ గా రాదక్రిష్ణన్ నాయర్ ను భారత్ అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) నియమించింది. జులైలో బహదూర్ సింగ్ రాజీనామా తో ఖాళి అయిన ఈ స్థానం లో 62 ఏళ్ల నాయర్ ఏఎఫ్ ఐ ఎంపిక చేసింది. ఆయన ఇంతక ముందు ఏడేళ్ళుగా భారత జట్టుకు నాయర్ డిప్యుటీ చీఫ్ కోచ్ గా వ్యవహరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ గా రాదా కృష్ణన్ నాయర్ నియామకం
ఎవరు : రాదా కృష్ణన్ నాయర్
ఎప్పుడు: డిసెంబర్ 04
ఇండియన్ నేవీ డే గా డిసెంబర్ 04 :

భారత దేశం ప్రతి సంవత్సరం డిసెంబర్ 04న నేవీ దినం గా జరుపుకుంటారు. దేశంలో భారత నావికా దళం మరియు అది సాధించిన విజయాలలో వాటి పాత్ర ను గుర్తించడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 04న నేవీ డే ను జరుపుకుంటారు. 1971లో జరిగిన ఆపరేషన్ ట్రైడెంట్ సమయంలో భారత నావికా దళం పిఎన్ఎస్ ఖైబర్ తో సహా నాలుగు పాకిస్తాన్ దేశం యొక్క ఓడలను ముంచి వేసింది.ఈ రోజున 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధం లో మరణించిన వారిని జ్ఞాపకం గా కూడా దీని జరుపుకుంటారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఇండియన్ నేవీ డే గా డిసెంబర్ 04
ఎవరు : ఇండియ
ఎప్పుడు: డిసెంబర్ 04
గాంధీ జి విలువలకు పట్టం కట్టేలా ఒక కొత్త చట్టం ను తీసుకోచ్చిన అమెరికా :

మహాత్మా గాంధీ విలువలకు పట్టం కట్టేలా అమెరికా ఒక నూతన చట్టం ను తీసుకు వచ్చింది. ఈ మేరకు ప్రతినిధుల సభ డిసెంబర్ 04 న గాంధి కింగ్ స్కాలరి ఎక్స్ చేంజ్ ఇన్షియేటివ్ బిల్లును ఆమోదించింది. దీని ద్వారా అమెరికా మేధావులు గాంధీ పైన అద్యయనం చేయడానికి వనరులు సమకూర్చనుంది. అదే విదంగా మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ తో బోధనలపై భారతీయ మేధావులు అద్యయనం చేయడానికి సహకారం అందించనుంది. ఈ బిల్లు ద్వారా అమెరికా విదేశాంగ శాఖా భారత పభుత్వాల తో కలిసి ఏట రెండు దేశాల మేదవుల విద్య సదస్సును నిర్వహించదానికి వీలు కలుగుతుంది. దీంతో పాటు ఘర్షణ వాతావరణాన్ని అహింస మార్గం లో పరిష్కరించడానికి కావాల్సిన నైపుణ్యాలను నేర్పించే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి భారత్ లోని సవాళ్ళను పరిష్కరించే దిశగా ఒక సంస్థను ఏర్పాటు చేయాలనీ ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. గాంధి- కింగ్ స్కాలరి ఎక్స్ చేంజ్ ఇన్షియేటివ్ కార్యక్రమాన్ని ప్రతి ఆర్ధిక సంవత్సరానికి మిలియన్ డాలర్లు చొప్పున 2025 వరకు అమెరికా నిధులు అందించనుంది. దీంతో పాటు గాంధి కింగ్ గ్లోబల్ అకాడమి కి 2021 ఆర్ధిక సంవత్సరంలో అందినవి 2 మిలియన్ డాలర్లు. అదే ఏడాది యుఎస్ గాంధీ కింగ్ డెవలప్ మెంట్ ఫౌండేషన్ కు 30మిలియన్ డాలర్లు అందించనుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : గాంధీ జి విలువలకు పట్టం కట్టేలా ఒక కొత్త చట్టం ను తీసుకోచ్చిన అమెరికా
ఎవరు : అమెరికా
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు: డిసెంబర్ 04
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |