Daily Current Affairs in Telugu 04-02-2022
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నూతన చైర్మన్ గా జగదీశ్ కుమార్ నియామకం :

దేశంలో ఉన్నత విద్యకు సంబంధించి అత్యున్నత పదవి మరోసారి తెలుగు వ్యక్తికి దక్కింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నూతన చైర్మన్ గా జేఎన్ యూ ఉపకులపతి ఆచార్య మామిడాల జగదీశకుమార్ గారు నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో అయిదు సంవత్సరాలు కొనసాగుతారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఫిబ్రవరి 04 ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. 1961లో ఏపీలోని తెనాలికి చెందిన వాసిరెడ్డి శ్రీకృష్ణ( వీఎస్ కృష్ణ), 1991-95 వరకు కరీంనగర్ జిల్లాకు చెందిన జి. రామిరెడ్డి యూజీసీ చైర్మన్ గా పనిచేశారు. ఈ పదవిని పొందిన మూడో తెలుగు వ్యక్తి జగదీశ కుమార్. తెలంగాణలోని నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన ఆయన ఒకటి నుంచి ఆరో తరగతి వరకు స్వగ్రామంలో.. ఆ తర్వాత మిర్యా లగూడలో చదువుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నూతన చైర్మన్ గా జగదీశ్ కుమార్ నియామకం
ఎవరు: జగదీశ్ కుమార్
ఎప్పుడు: ఫిబ్రవరి 04
ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ యొక్క ఎండి గా రాహుల్ భాటియా నియామకం :

ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ తన సహ వ్యవస్థాపకుడు రాహుల్ భాటియాను కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించినట్లు ఫిబ్రవరి 04న ప్రకటించింది. దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు ఈ సంస్థ మాతృ సంస్థ. భాటియా ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ సహ వ్యవస్థాపకుడు మరియు ప్రమోటర్. షేర్ హోల్డర్ల ఆమోదానికి లోబడి భాటియాను తక్షణమే మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించాలని ఫిబ్రవరి 04న జరిగిన సమావేశంలో డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించిందని ఒక ప్రకటనలో తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ యొక్క ఎండి గా రాహుల్ భాటియా నియామకం
ఎవరు: రాహుల్ భాటియా
ఎప్పుడు: ఫిబ్రవరి 04
POSOCO యొక్క ఛైర్మన్ గా అదనపు బాద్యతలు చేపట్టిన శ్రీ ఎస్.ఆర్ నరసింహన్ :

శ్రీ SR నరసింహన్ POSOCO యొక్క ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (CMD)గా 1 ఫిబ్రవరి 2022 నుండి అదనపు బాధ్యతలను స్వీకరించారు. పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ (పిఇఎ) ప్యానెల్ డిసెంబర్ 2021న సిఎండి పదవికి ఎస్ఆర్ నరసింహన్ పేరును ఎంపిక చేసింది. గతంలో ఇదే సంస్థలో డైరెక్టర్ (సిస్టమ్ ఆపరేషన్)గా పనిచేశారు. ఫిబ్రవరి 1, 2022న పదవీ విరమణ పొందిన KVS బాబా స్థానంలో నరసింహన్ నియమితులయ్యారు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ (పిఇఎ) ప్యానెల్ డిసెంబర్ 2021న సిఎండి పదవికి ఎస్ఆర్ నరసింహన్ పేరును ఎంపిక చేసింది. గతంలో ఇదే సంస్థలో డైరెక్టర్ (సిస్టమ్ ఆపరేషన్)గా పనిచేశారు. ఫిబ్రవరి 1, 2022న పదవీ విరమణ పొందిన KVS బాబా స్థానంలో నరసింహన్ నియమితులయ్యారు. పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (POSOCO) అనేది భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్.
క్విక్ రివ్యు :
ఏమిటి: POSOCO యొక్క ఛైర్మన్గా అదనపు బాద్యతలు చేపట్టిన శ్రీ ఎస్.ఆర్ నరసింహన్
ఎవరు: శ్రీ ఎస్.ఆర్ నరసింహన్
ఎప్పుడు: ఫిబ్రవరి 04
చైనా లో ప్రారంబ౦ఐన వింటర్ ఒలింపిక్స్ క్రీడలు :

వింటర్ ఒలింపిక్స్ కు వేళైంది. ఫిబ్రవరి 04న ఈ క్రీడల ఆరంభోత్సవం వైభవంగా జరిగింది. చైనా దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ గారు ఈ ఆటలు ఆరంభమైనట్లు అధికారికంగా ప్రకటించారు. 2008లో వేసవి ఒలింపిక్స్ కు వేదికగా నిలిచిన జాతీయ బర్డ్నెస్ట్ స్టేడియంలో బాణసంచా మెరుపులు, ప్రదర్శనలతో వెలిగిపోగా వింటర్ ఒలింపిక్స్ ఆరంభోత్సవం కన్నుల పండువగా జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో పాటు తదితర ప్రపంచ నాయకులు ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు. వేసవి, వింటర్ రెండు ఒలింపిక్స్ ఆతిథ్యం ఇచ్చిన ఘనతను బీజింగ్ సొంతం చేసుకుంది. ఇప్పటికే కొన్ని ఈవెంట్లలో పోటీలు మొదలు కాగా ఫిబ్రవరి 05 నుంచి పతక ఈవెంట్లు ప్రారంభం కానున్నాయి. హైతీ, సౌదీ అరేబియా తొలిసారి వింటర్ ఒలింపిక్స్ బరిలో దిగుకోతున్నాయి ఈవెంట్ లలో పోటీలు మొదలు కాగ ఫిబ్రవరి 04 నుంచి పతక ఈవెంట్లు ప్రారంభం కానున్నాయి. సౌదీ తరపున ఫయిక్ అబ్ధి (స్కీయింగ్), హైతీ తరపున రిచర్డ్ స్టేడియా వియానో (స్కీయింగ్) పోటీపడబోతున్నారు. ఈ క్రీడల్లో 31 దేశాల నుంచి దాదాపు మూడు వేల క్రీడల్లో మంది అథ్లెట్లు బరిలో ఉన్నారు.
- చైనా దేశ రాజధాని : బీజింగ్
- చైనా దేశ కరెన్సీ : రెన్బిన్ బి
- చైనా దేశ అద్యక్షుడు :జిన్ పింగ్
క్విక్ రివ్యు :
ఏమిటి: చైనా లో ప్రారంబ౦ఐన వింటర్ ఒలింపిక్స్ క్రీడలు
ఎవరు: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్
ఎక్కడ: చైనా
ఎప్పుడు: ఫిబ్రవరి 04
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ౦గా ఫిబ్రవరి 4 :

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ౦గా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు దీని ద్వారా క్యాన్సర్ వ్యాధి గురించి దానిని ఏ విధంగా నయం చేయాలో ప్రజలకు తెలియజేసేందుకు WHO వారిచే గుర్తింపబడిన ఈ రోజును ప్రపంచ క్యాన్సర్ దినం గా జరుపుకుంటారు.. 2008లో రచించబడిన ప్రపంచ క్యాన్సర్ డిక్లరేషన్ యొక్క లక్ష్యాలకు మద్దతు ఇవ్వడానికి యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ద్వారా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నిర్వహించబడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ౦గా ఫిబ్రవరి 4
ఎక్కడ: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు: ఫిబ్రవరి 04
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |