
Daily Current Affairs in Telugu 03&04 December – 2022
ప్రతిష్టాత్మక మైన న్యూయార్క్ ఫిలిం క్రిటిక్ సర్కిల్ పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడుగా రాజమౌళి :

అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పేరు హాలివుడ్ లో మార్మోగుతుంది.ఆయన తీసిన ఆర్.ఆర్.ఆర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలని అందుకుంటుంది.అమెరికా లోని ఇటీవల నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనల తర్వాత ఆర్.ఆర్.ఆర్ సినిమాకి ఆ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి కి మరింతగా అభిమానులు పెరిగారు.ఆస్కార్ పురస్కారాల్లో ఫేవరేట్ గా నిలుస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఈ చిత్రానికి గాను ప్రతిష్టాత్మక మైన న్యూయార్క్ ఫిలిం క్రిటిక్ సర్కిల్ పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడుగా రాజమౌళి ఎంపికయ్యారు.ఆ విషయాన్నిట్విటర్ ద్వారా తెలియజేసింది సదరు సంస్థ.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రతిష్టాత్మక మైన న్యూయార్క్ ఫిలిం క్రిటిక్ సర్కిల్ పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడుగా రాజమౌళి
ఎవరు : రాజమౌళి
ఎప్పుడు : డిసెంబర్ 03
నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్ట్ టైమ్ చైర్ పర్సన్ గా రాజీవ్ లక్ష్మణ్ కరండికర్ నియమకం :

నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్.ఎస్.సి.ఐ పార్ట్ టైమ్ చైర్ పర్సన్ గా చెన్నై మ్యాతమేటికల్ ఇన్స్టిట్యూట్ (సి.ఎం.ఐ) లో ఏమేరిటస్ ప్రొఫెసర్ గా రాజీవ్ లక్ష్మణ్ కరండికర్ మూడేళ్ళ పాటు నియమితులయ్యారు. అతను 2010 లో CMI లో విజిటింగ్ ప్రొఫెసర్ గా చేరాడు.మరియు 2011 నుంచి ఏప్రిల్ 2021 వరకు CMI డైరెక్టర్ గా పని చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్ట్ టైమ్ చైర్ పర్సన్ గా రాజీవ్ లక్ష్మణ్ కరండికర్ నియమకం
ఎవరు : రాజీవ్ లక్ష్మణ్ కరండికర్
ఎప్పుడు : డిసెంబర్ 03
ఆలయాలలో సెల్ ఫోన్ లను తీసుకెళ్ళడానికి నిషేధిస్తున్నట్లు తీర్పునిచ్చిన్ మద్రాస్ హైకోర్ట్ :

మద్రాస్ హైకోర్ట్ ఆలయాలలో సెల్ ఫోన్ లను తీసుకెళ్ళడానికి నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఆలయాల యొక్క స్వచ్చత పవిత్రత ను పరిరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిసెంబర్ 04 న మద్రాస్ హైకోర్ట్ మదురై బెంచ్ తెలిపారు.హించు మత మరియు ధర్మాదాయ శాఖ (హెచ్ ఆర్ అండ్ సిఇ) డిపార్ట్ మెంట్ పరిధిలోకి వచ్చే ఆలయాల్లో కి భక్తులేవరు తమ సెల్ ఫోన్ లను తీసుకెళ్ళకుండా చూసుకోవాలని ఆదేశించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆలయాలలో సెల్ ఫోన్ లను తీసుకెళ్ళడానికి నిషేధిస్తున్నట్లు తీర్పునిచ్చిన్ మద్రాస్ హైకోర్ట్
ఎవరు : మద్రాస్ హైకోర్ట్
ఎప్పుడు : డిసెంబర్ 03
బంగ్లాదేశ్ దేశం పర్యావరణ నిర్వహణకు 250 మిలియన్ డాలర్ల సహాయం ఆమోదం తెలిపిన ప్రపంచ బ్యాంక్ :

బంగ్లాదేశ్ దేశం పర్యావరణ నిర్వహణకు బలోపేతం చేయడానికి మరియు గ్రీన్ ఇన్వెస్ట్ మెంట్ లలో ప్రైవేట్ రంగ భాగస్వాములను ప్రోత్సహించడానికి ప్రపంచ బ్యాంక్ 250 మిలియన్ డాలర్ ల ఫైనాన్సింగ్ ను ఆమోదించింది. బంగ్లాదేశ్ ఎన్విరాన్ మెంట్ సస్టైన బిలిటి అండ్ ట్రాన్స్ ఫార్మేషన్ (బెస్ట్) ప్రాజెక్ట్ ను విజయవంతంగా అమలు చేయడంవల్ల దేశం యొక్క కాలుష్యాన్ని పరిష్కరించడం లో సహాయపడుతుంది. గ్రేటర్ డాకా మరియు వెలుపల నివసిస్తున్న 21 మిలియన్ ల కు పైగా ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం 2019లో బంగ్లాదేశ్ లో జరిగిన మొత్తం మరణాలలో కాలుష్య సంబంధిత మరణాలు ఐదవ వంతుకు కారణం అయ్యాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : బంగ్లాదేశ్ దేశం పర్యావరణ నిర్వహణకు 250 మిలియన్ డాలర్ల సహాయం ఆమోదం తెలిపిన ప్రపంచ బ్యాంక్
ఎవరు : ప్రపంచ బ్యాంక్
ఎప్పుడు : డిసెంబర్ 03
2022 సంవత్సరానికి గాను అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్ గా నిలిచిన్ బాబార్ ఆజం :

పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ ఆజం మరో రికార్డు సాధించాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్ గా అతను రికార్డుల్లోకి ఎక్కాడు. రావల్పిండిలో ఇంగ్లండ్ తో జరుగుతున్న మొదటి టెస్టులో సెంచరీ చేసిన బాబర్ ఈ రికార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడంతో ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో బాబర్ ఖాతాలో 7 సెంచరీలు 7 సెంచరీలు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో 168 బంతుల్లో 19 ఫోర్లు, ఒక సిక్సర్ తో 136 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇది బాబర్‌కు టెస్టుల్లో 8వ సెంచరీ ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : 2022 సంవత్సరానికి గాను అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్ గా నిలిచిన్ బాబార్ ఆజం
ఎవరు : బాబార్ ఆజం
ఎప్పుడు : డిసెంబర్ 04
‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పుర స్కారం అందుకున్న భారత సంతతి మోహన్ మానిని :

భారత సంతతికి చెందిన మోహన్ మానిని. బ్రిటన్ రాజకుటుంబం నుంచి ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (ఓబీఈ) పుర స్కారం అందుకున్నారు. ఉత్తర లండన్ కు చెందిన మోహన్ సెయింట్ జాన్ అంబులెన్స్ చారిటీకి ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. సంస్థలో ఆయన సేవలకు గుర్తింపుగా గతేడాది బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 జన్మదిన వేడుకల్లో ఆయనకు ఈ అవార్డును ప్రకటించారు. తాజాగా ఎలిజబెత్ కుమార్తె ప్రిన్సెస్ అన్నే చేతులమీదుగా దీన్ని అందుకున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన మోహన్, క్యాజువల్ డైనింగ్ గ్రూప్‌లో క్రియే టివ్ ఫైనాన్స్ డైరెక్టర్‌గా సేవలందించారు. అనం తరం తన వ్యాపారాలను విక్రయించి స్వచ్చంద సంస్థల్లో సేవలందిస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పుర స్కారం అందుకున్న భారత సంతతి మోహన్ మానిని
ఎవరు : భారత సంతతి మోహన్ మానిని
ఎప్పుడు : డిసెంబర్ 04
అంతర్జాతీయ విమానయాన భద్రతలో 18వ స్థానం నిలిచిన భారత దేశ౦ :

అంతర్జాతీయ విమానయాన భద్రతలో మన దేశానికి 18వ స్థానం లభించిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. ఇంటర్నేషనల్, సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ) ఇచ్చే ఈ ర్యాంకుల్లో నాలు గేళ్ల క్రితం భారత్ 102వ స్థానంలో ఉంది. ఈ జాబితా తొలిస్థానంలో సింగ పూర్ ఉండగా, రెండు-మూడు స్థానాల్లో యూఏఈ, దక్షిణ కొరియా ఉన్నాయి. చైనా 49వ స్థానం ఉంది. కీలక భద్రతా అంశాల్లో 85.49 శాతానికి మెరుగు పడినట్లు డీజేసీ ప్ అరుణ్ కుమార్ తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : అంతర్జాతీయ విమానయాన భద్రతలో 18వ స్థానం నిలిచిన భారత దేశ౦
ఎవరు : భారత దేశ౦
ఎప్పుడు : డిసెంబర్ 04
ఇండోనేసియాలోని బద్దలైన తూర్పు జావా ప్రావిన్స్ లో మౌంట్ సెమెరు అగ్నిపర్వతం :

ఇండోనేసియాలోని తూర్పు జావా ప్రావిన్స్ లో మౌంట్ సెమెరు అనే అగ్నిపర్వతం డిసెంబర్ 04 విస్ఫోటం చెందడంతో దట్టమైన బూడిద మేఘాలు ఆవరించాయి. భారీగా లావా విడుదలైంది. ‘రుతుపవన వర్షాల ధాటికి 3,878 మీటర్లన ఎత్తులోని మౌంట్ సెమెరుపై లావా గోపురం సైతం కూలిపోయింది. అనేక గ్రామాలను బూడిద కప్పేసి ఎండను నిరోధించింది. కాగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వందల మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. బూడిద పొరలు 1500 మీటర్ల ఎత్తుకు పైగా ఎగిశాయి. సెమెరు అగ్నిప ర్వతం వాలుల నుంచి లావా సమీపంలోని నదివైపు ప్రవహించింది’ అని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఇండోనేసియాలోని బద్దలైన తూర్పు జావా ప్రావిన్స్ లో మౌంట్ సెమెరు అగ్నిపర్వతం
ఎవరు : మౌంట్ సెమెరు అగ్నిపర్వతం
ఎప్పుడు : డిసెంబర్ 04
టాటా స్టీల్ చెస్ బ్లిట్జ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న అర్జున్ ఇరిగేశి:

తెలంగాణ’ యువ చెస్ సంచలనం అర్జున్ ఇరిగేశి మరో టైటిల్ ను ఖాతాలో వేసుకున్నాడు. టాటా స్టీల్ చెస్ బ్లిట్జ్ ఓపెన్ లో డిసెంబర్ 04 న ఈ గ్రాండ్‌మాస్టర్ విజేతగా నిలిచాడు. మొత్తం 18 రౌండ్లు ముగిసేసరికి 12.5 పాయింట్లతో ఇతను అగ్రస్థానంలో నిలిచాడు. టోర్నీలో దూకుడు కొనసాగించిన అర్జున్ చివరి రౌండ్ ఫలితంతో సంబంధం లేకుండా 17 రౌండ్లు పూర్తయ్యే సరికే 12 పాయింట్లతో టైటిల్ భాయం చేసుకున్నాడు. చివరి రౌండ్లో మరో భారత గ్రాండ్ మాస్టర్ నిహాల్ సరీన్ తో గేమ్ డ్రా చేసుకుని తిరుగులేని ఆధిక్యంతో ట్రోఫీ సొంతం చేసుకున్నాడు. 10 విజయాలు, 5 డ్రాలు నమోదు చేసిన అతను.. 3 గేమ్ ఓడాడు. విదిత్ (9), ప్రజ్ఞానంద (8.5) నిహాల్ (8) వరుసగా 5, 6, 7 స్థానాల్లో నిలిచారు
క్విక్ రివ్యు :
ఏమిటి : టాటా స్టీల్ చెస్ బ్లిట్జ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న అర్జున్ ఇరిగేశి
ఎవరు : అర్జున్ ఇరిగేశి
ఎప్పుడు : డిసెంబర్ 04
Daily current affairs in Telugu Pdf September 2022 PDF |
---|
Daily current affairs in Telugu Pdf 01-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 02-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 03-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 04-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 05-09- 2022 PDF |
>Daily current affairs in Telugu Pdf 06-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 07-09- 2022 PDF |
>Daily current affairs in Telugu Pdf 08-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 09-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 10-09- 2022 PDF</strong> |
Daily current affairs in Telugu Pdf 11-09- 2022 PDF |
>Daily current affairs in Telugu Pdf 12-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 13-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 14-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 15-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 16-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 17-09- 2022 PDF</strong> |
Daily current affairs in Telugu Pdf 18-09- 2022 PDF |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |