
Daily Current Affairs in Telugu 03&04 August-2022
తైవాన్ నుంచి దిగుమతి చేసుకునే పండ్లు, చేపలపై ఆంక్షలను ప్రకటించిన చైనా దేశం :

తైవాన్ దేశం నుంచి దిగుమతి చేసుకునే పండ్లు, చేపలపై చైనా దేశం ఆంక్షలను ప్రకటించింది. ఇక తైవాన్ ద్వీపానికి పంపనున్న ఇసుక రవాణాను కూడా నిలిపివేస్తున్నట్లు చైనా దేశం ప్రకటించింది, అమెరికాలో హైప్రొఫైల్ పదవిలో ఉన్న పెలోసీ తైవాన్ లో పర్యటించడం వల్ల చైనాతో దౌత్యపరమైన సమస్యలు తలెత్తాయి. సిట్రస్ జాతికి చెందిన కొన్ని రకాల పండ్లు, చేపల దిగుమతిని సస్పెండ్ చేస్తున్నట్లు చైనా కస్టమ్స్ శాఖ తెలిపింది. సహజమైన ఇసుకను తైవాస్కు ఎగుమతి చేసే అంశంపై నిషేధం విధిస్తున్నట్లు చైనా వాణిజ్య శాఖ నోటీసు ఇచ్చింది.
- చైనా దేశ రాజధాని : బీజింగ్
- చైనా దేశ కరెన్సీ : రెన్ మిన్బి
- చైనా దేశ అద్యక్షుడు : జిన్ పింగ్
క్విక్ రివ్యు :
ఏమిటి : తైవాన్ నుంచి దిగుమతి చేసుకునే పండ్లు, చేపలపై ఆంక్షలను ప్రకటించిన చైనా దేశం
ఎవరు : చైనా దేశం
ఎక్కడ: చైనా దేశం
ఎప్పుడు : జులై 03
టీ 20లలో 500+ స్కోరు చేసి 50 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా హార్దిక పాండ్య :

టీమిండియా క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. టీ 20లలో 500+ స్కోరు చేసి 50 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేస్తూ ఆ జట్టు ఓపెనర్ బ్రాండన్ కింగ్ ను ఔట్ చేయడం ద్వారా అతడు ఈ ఘనత అందుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : టీ 20లలో 500+ స్కోరు చేసి 50 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా హార్దిక పాండ్య
ఎవరు : హార్దిక పాండ్య
ఎప్పుడు : జులై 03
భారత ఆసియాన్ సదస్సు 2022 ను నిర్వహించిన కర్ణాటక లోని రేవా విశ్వ విశ్వవిద్యాలయం :

కర్నాటకలోని రెవా విశ్వవిద్యాలయం ఇండియా ASEAN సమ్మిట్ (భారత ఆసియాన్ సదస్సు) 2022ను నిర్వహించింది, ఈ కార్యక్రమానికి కంబోడియా, మయన్మార్ మరియు లావోస్ స్ నుండి వచ్చిన రాయబారులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. బెంగళూరులోని రెవా యూనివర్సిటీ మైదానంలో జరిగిన ఇండియన్ ఆసియాన్ సమ్మిట్ 2022లో, ఆగ్నేయాసియా దేశాల దౌత్యవేత్తలు తమ తమ దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై దృక్కోణాలను మార్పిడి చేసుకున్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత ఆసియాన్ సదస్సు 2022 ను నిర్వహించిన కర్ణాటక లోని రేవా విశ్వ విశ్వవిద్యాలయం
ఎవరు : కర్ణాటక లోని రేవా విశ్వ విశ్వవిద్యాలయం
ఎప్పుడు : జులై 03
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా సురేష్ ఎన్ పటేల్ నియామకం :

సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా సురేష్ ఎన్ పటేల్ నియాకమయ్యారు. సీవీసీ నియామకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇటీవల ఆమోదించింది. రాష్ట్రపతి భవన్ లో ఆగస్ట్ 04న సురేష్ పటేల్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రమాణస్వీకారం చేయించారు. సురేష్ పటేల్ గారు గతేడాది జూన్ నుంచి ఆయన తాత్కాలిక సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ CVC) గా పని చేస్తున్నారు .
క్విక్ రివ్యు :
ఏమిటి : సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా సురేష్ ఎన్ పటేల్ నియామకం
ఎవరు : సురేష్ ఎన్ పటేల్
ఎప్పుడు : జులై 03
తెలంగాణా రాష్ట్ర గిరిజన ఆర్ధికాభి వృద్ధి సంస్థ చైర్మన్ ఇస్లావత్ రామచంద్ర నాయకన్ నియామకం :

తెలంగాణా రాష్ట్ర గిరిజన ఆర్ధికాభి వృద్ధి సంస్థ (ట్రైకార్) చైర్మన్ ఇస్లావత్ రామచంద్ర నాయకన్ ని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ 14న . ఉత్తర్వులు, రామచంద్రనాయక్ చేసింది. నల్గొండ జిల్లా త్రిపురారం మండలానికి చెందిన ఆయన ప్రస్తుతం జిల్లా రైతుబందు సమితి అధ్యక్షుడిగా ఉన్నారు. రామచంద్రనాయక్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్ట్ 15న రాష్ట్రపతి ‘భవన్ లో నియామకపత్రం అందజేశారు.
- తెలంగాణా రాష్ట్ర రాజధాని ; హైదరాబాద్
- తెలంగాణా రాష్ట్ర సిఎం : చంద్ర శేఖర్ రావు
- తెలంగాణా రాష్ట్ర గవర్నర్ : తమిలసై సౌందర రాజన్
క్విక్ రివ్యు :
ఏమిటి : రాష్ట్ర గిరిజన ఆర్ధికాభి వృద్ధి సంస్థ చైర్మన్ ఇస్లావత్ రామచంద్ర నాయకన్ నియామకం
ఎవరు : రామచంద్ర నాయకన్
ఎప్పుడు : జులై 04
కామన్వెల్త్ క్రీడల చరిత్రలో స్క్వాష్ సింగిల్స్ లో పతకం గెలిచిన తొలి భారత ఆటగాడిగా నిలిచిన సౌరభ్ ఘోషల్ :

వెటరన్ స్క్వాష్ స్టార్ సౌరభ్ ఘోషల్ చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో స్క్వాష్ సింగిల్స్ లో పతకం గెలిచిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. పురుషుల సింగిల్స్ ఆతను కాంస్యం సాధించాడు. కంచు పతక పోరులో ఈ 35 ఏళ్ల పశ్చిమ బెంగాల్ ఆటగాడు 11-6, 11 1. 11-4తో డిఫెండింగ్ చాంపియన్ జేమ్స్ విల్స్ ట్రాప్ (ఇంగ్లాండ్)ను చిత్తుచేశాడు. మ్యాచ్లో పూర్తి అదిపత్యం చలాయించిన సౌరబ్ వరుస గేమ్ ల్లో ప్రత్యర్డి ని మట్టికరపించాడు. అతనికెది రెండో కామన్వెల్త్ 2018 గోల్డ్ కోస్ట్ క్రీడల్లో మిక్స్ డ్ డబుల్స్ లో దీనిక పల్లికల్ తో కలిసి అతను రజతం గెలిచి ఈ ఏడాది ప్రపంచ డబుల్స్ ఛాంపియన్షిప్స్ లోనూ ఆమెతో కలిసి అతను చాంపియన్ గా నిలి చిన సంగతి తెలిసిందే. 2014 ఆసియా క్రీడల్లో సింగిల్స్ రజతం నెగ్గిన అతను టీమ్ విభాగంలో పసిడి ఖాతాలో వేసుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కామన్వెల్త్ క్రీడల చరిత్రలో స్క్వాష్ సింగిల్స్ లో పతకం గెలిచిన తొలి భారత ఆటగాడిగా నిలిచిన సౌరభ్ ఘోషల్
ఎవరు : సౌరభ్ ఘోషల్
ఎప్పుడు : జులై 04
కామన్వెల్త్ క్రీడల వెయిట్లి లిఫ్టింగ్ లో కాంస్యం గెలిచిన ప్రీత్ సింగ్ :

కామన్వెల్త్ క్రీడల వెయిట్ లిఫ్టింగ్ లో భారత మరో పతకం దక్కింది. పురుషుల 109 కేజీల విభాగంలో లవ్ ప్రీత్ సింగ్ కాంస్యం గెలిచాడు. మొత్తం 355 కిలోలెత్తి (163+192) మూడో స్థానంలో నిలిచాడు. స్నాచ్ లో తొలి మూడు ప్రయత్నాల్లో అతను వరుసగా 157, 161, 163 కేజీలెత్తాడు. స్నాచ్ విభాగం ముగిసేసరికి బెసెట్టి (కెనడా)తో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. క్లీన్ అండ్ జర్క్ లో తొలి రెండు సార్లు 185, 189 కేజీ లెత్తిన అతను మూడో ప్రయత్నంలో 192 కేజీలతో జాతీయ రికార్డు సృష్టించాడు. జూనియర్ పెరిప్లెక్స్ (361 కేజీలు, కామెరూన్) స్వర్ణం, జాక్ (358 సౌరబ్ కేజీలు, సమోవా) రజతం నెగ్గారు. లుధియానాకు చెందిన దర్జీ తనయుడైన 24 ఏళ్ల లవ్ ప్రీత్ కు ఇవే తొలి కామన్వెల్త్ క్రీడలు మరోవైపు మహిళల 87 కేజీల విభాగంలో పూర్ణిమ పాండే (228 కేజీలు) ఆరో స్థానంలో నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : కామన్వెల్త్ క్రీడల వెయిట్లి లిఫ్టింగ్ లో కాంస్యం గెలిచిన ప్రీత్ సింగ్
ఎవరు : ప్రీత్ సింగ్
ఎప్పుడు : జులై 04
అండర్-20 ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మిక్స్డ్ రిలే పోటీలో రజతం గెలిచిన భారత్ :

అండర్-20 ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 4-400 మీటర్ల మిక్స్డ్ రిలే పోటీలో భారత జట్టు రజతం సాధించింది. ఈ క్రమంలో తమ పేరిటే ఉన్న ఆసియా జూనియర్ రికార్డును బద్దలు కొట్టింది. భరత్ శ్రీధర్, ప్రియ మోహన్, కపిల్, రూపల్ చౌదరిలతో కూడిన భారత బృందం 3 నిమిషాలలో 17. 67 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచింది. 0.2 సెకన్ల తేడాతో అమెరికా (3-17. 69) స్వర్ణం సాధించింది. ఇదే టోర్నీలో భారత జట్టు 310 62 సెకన్ల టైమింగ్ తో నెలకొల్పిన ఆసియా రికార్డు పైనల్లో మెరుగైంది. అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ చరిత్రలో ఇది రెండో అత్యుత్తమ టైమింగ్ కావడం విశేషం. హీట్స్ లో కూడా భారత్ అమెరికా తర్వాత రెండో స్థానంలోనే నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : అండర్-20 ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మిక్స్డ్ రిలే పోటీలో రజతం గెలిచిన భారత్
ఎవరు : భారత జట్టు
ఎప్పుడు : జులై 04
‘మిస్ సౌత్ ఇండియా’ గా ఎంపికైన ఆర్ట్స్ విభాగం విద్యార్థిని చరిష్మా కృష్ణ :

విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విభాగం విద్యార్థిని చరిష్మా కృష్ణ ‘మిస్ సౌత్ ఇండియా’ గా ఎంపికయ్యారు. పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆగస్ట్ 04న రాత్రి కేరళలోని కోచిలో నిర్వహించిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి పలువురు యువతులు పోటీల్లో పాల్గొనగా విశేష ప్రతిభ కనబరిచిన చరిష్మాకృష్ణ ‘మిస్ సౌత్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్నారు..
క్విక్ రివ్యు :
ఏమిటి : ‘మిస్ సౌత్ ఇండియా’ గా ఎంపికైన ఆర్ట్స్ విభాగం విద్యార్థిని చరిష్మా కృష్ణ
ఎవరు : చరిష్మా కృష్ణ
ఎప్పుడు : జులై 04
ఐక్య రాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా బాద్యతలు స్వీకరించిన రుచిరా కంబోజ్ :

ఐక్య రాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కంబోజ్(58) బాధ్యతలు స్వీకరించారు. ఆగస్ట్ 05న న్యూయార్క్ లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ సమక్షంలో ఆమె బాధ్యతలు చేపట్టారు’ టీఎస్ తిరుమూర్తి స్థానంలో ఎంపికైన ఆమె ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా నిలిచారు.
- ఐక్య రాజ్య సమితి యొక్క స్థాపన : 24 October 1945
- ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయం : న్యూయార్క్
- ఐక్య రాజ్య సమితి ప్రెసిడెంట్ : అంటోనియో గుటేరాస్
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐక్య రాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా బాద్యతలు స్వీకరించిన రుచిరా కంబోజ్
ఎవరు : రుచిరా కంబోజ్
ఎక్కడ: ఐక్య రాజ్య సమితిలో
ఎప్పుడు : జులై 04
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |