Daily Current Affairs in Telugu 03 September-2022
ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ నూతన సెక్రటరి జనరల్ గా షాజీ ప్రభాకరన్ నియామకం :

ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (AIFF) సెప్టెంబర్ 03న జరిగిన కార్యవర్గ సమావేశంలో షాజీ ప్రభాకరన్ గారు కొత్త సెక్రటరీ జనరల్ గా నియమితులైనట్లు ప్రకటించింది, కొత్తగా నియమించబడిన చీఫ్ కళ్యాణ్ చౌబే గారు ఈ పదవికి అతని పేరు ప్రతిపాదన తెలపగా ఏకగ్రీవ ఆమోదం లభించింది.
- ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ స్థాపన : జూన్ 23 1937
- ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రధాన కార్యాలయం : న్యూ డిల్లి
- ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ నూతన చీఫ్ : కళ్యాన్ చౌబే
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ నూతన సెక్రటరి జనరల్ గా షాజీ ప్రభాకరన్ నియామకం
ఎవరు : షాజీ ప్రభాకరన్
ఎప్పుడు : సెప్టెంబర్ 03
దేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానంలో కంప్లైంట్ లా స్కూల్ ను ప్రారంబించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం :

భారతదేశంలోని న్యాయ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ఇన్ మేనేజ్మెంట్ (IILM) యూనివర్సిటీ, గ్రేటర్ నోయిడా దేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం (NEP 2020) కంప్లైంట్ లా స్కూల్ ను ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆమోదంతో మరియు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) గుర్తింపుతో ఈ పాఠశాల ప్రారంభించబడింది.
- ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని :లక్నో
- ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సిఎం : యోగి ఆదిత్యానాద్
- ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ : ఆనంది బెన్ పటేల్
క్విక్ రివ్యు :
ఏమిటి : దేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానంలో కంప్లైంట్ లా స్కూల్ ను ప్రారంబించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎవరు : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర౦
ఎప్పుడు : సెప్టెంబర్ 03
అభివృద్ధి చెందిన అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరించిన భారత్ :

స్వాతంత్య్ర 75వ శతాబ్ది ఉత్సవాల నాటికి “అభివృద్ధి చెందిన” దేశంగా అవతరించాలని ప్రధానమంతత్రి నరేంద్ర మోదీ కోరుతున్న నేపథ్యంలో ఈ వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ యూకేను, అదీ రెండు శతాబ్దాల పాటు భారత ఉపఖండాన్ని పరిపాలించిన ఒకదానిని దాటడం ఒక ప్రధాన మైలురాయిగా భావిస్తున్నారు. బ్లూమ్ బెర్గ్ ప్రకారం, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా నిలిచింది. తాజా లెక్కల ప్రకారం, 2022 మార్చి చివరిలో యునైటెడ్ వ్యవస్థగా నిలిచింది. తాజా లెక్కల ప్రకారం, 2022 మార్చి చివరిలో యునైటెడ్ కింగ్ డమ్ ను అధిగమించి ఇండియా ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దీనిపై చాలా నివేదికలు వచ్చాయి బ్లూమ్బర్గ్ ఐఎంఎఫ్ డేటాబేస్, చారిత్రాత్మక మారకపు ధరలను ఉపయోగించడం ద్వారా ఈ నిర్ణయానికి వచ్చింది ఇరు దేశాలమధ్య జనాభా, తలసరి జీడీపి, పేదరికం, హ్యూమన్ పేదరికం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యూనివర్సల్ హెల్త్ కెర్ కవరేజ్ అంశాలను పోల్చింది. రెండు దేశాల మధ్య ఉన్న అత్యంత ప్రాథమిక వ్యత్యాసాలలో జనాభా. 2022 నాటికి, భారతదేశంలో 1.41 బిలియన్ల జనాభా ఉండగా, యూకేజనాభా 68.5 మిలియన్లు. మరో మాటలో చెప్పాలంటే, భారత జనాభా 20 రెట్లు ఎక్కువ.
క్విక్ రివ్యు :
ఏమిటి :అభివృద్ధి చెందిన అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరించిన భారత్
ఎవరు : భారత్
ఎప్పుడు : సెప్టెంబర్ 03
నేషనల్ లీగల్ సర్వీసెస్ ఆథారిటీ ఎగ్సిక్యుటివ్ చైర్ పర్సన్ గా డి వై. చంద్ర చూడ్ నియమకం :

నేషనల్ లీగల్ సర్వీసెస్ ఆథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్ప ర్సన్ గా సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ డి వై. చంద్ర చూడ్ గారు నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సీజేఐ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిని ఈ పదవిలో నియమించడం సంప్రదాయంగా వస్తోంది. గత నెల 26 వరకు ఈ స్థానంలో జస్టిస్ యు.యు. లలిత్ గారు ఉన్నారు. ఆయన సీజేఐగా ప్రమాణం చేయడంతో ఇప్పుడు ఆ బాధ్యతలను జస్టిస్ చంద్ర చూద్ కు అప్పగించారు. జస్టిస్ డి.వై.చంద్ర చూ నవంబరు 9న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 2024 నవంబరు 10 వరకు కొనసాగుతారు.
- నల్సా పూర్తి రూపం : నేషనల్ లీగల్ సర్వీసెస్ ఆథారిటీ
- నేషనల్ లీగల్ సర్వీసెస్ ఆథారిటీ స్థాపన : 9 నవంబర్ 1995
- నేషనల్ లీగల్ సర్వీసెస్ ఆథారిటీ ప్రధాన కార్యాలయం : న్యు డిల్లి
క్విక్ రివ్యు :
ఏమిటి : నేషనల్ లీగల్ సర్వీసెస్ ఆథారిటీ ఎగ్సిక్యుటివ్ చైర్ పర్సన్ గా డి వై. చంద్ర చూడ్ నియమకం
ఎవరు : డి వై. చంద్ర చూడ్
ఎప్పుడు : సెప్టెంబర్ 03
సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్ గా ఎంపికైన వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా :

సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్ వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు. బ్రయాన్ లారా ఎంపిక య్యాడు. ఇప్పటిదాకా కోచ్ ఉన్న టామ్ మూడీ స్థానంలో 2023 సీజన్క లారా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఓ టీ20 జట్టుకు కోచ్ గా వ్యవహరించనుండడం 53 ఏళ్ల లారాకు ఇదే తొలిసారి. ప్రస్తుతం ఎస్ఆర్ హెచ్ జట్టుగా సలహాదారుగా బ్రయాన్ సేవలు అందిస్తున్నాడు. సన్ రైజర్స్ కోచ్ గా టామ్ మూడీ రెండు పర్యాయాలు పని చేశాడు. మొదట 2013-19 వరకు ఈ బాధ్యతల్లో “ఉన్న అతడు గతేడాది మళ్లీ కోచ్ గా వచ్చాడు. టామ్ హయాంలో అయిదుసార్లు ప్లే ఆఫ్ కు చేరిన సన్ రైజర్స్ 2016లో ఛాంపియన్ గా నిలిచింది.. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ డెజర్ట్ వైపుకు మూడీ డైరెక్టర్ గా పని చేయబోతున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్ గా ఎంపికైన వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా
ఎవరు : బ్రియాన్ లారా
ఎప్పుడు : సెప్టెంబర్ 03
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు టీవీ శంకర నారాయణన్ కన్నుమూత :

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు టీవీ శంకర నారాయణన్ (77) చెన్నైలో సెప్టెంబర్ 03న. సాయంత్రం తుదిశ్వాస విడిచారు ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు మణి అయ్యర్ కు ఆయన మేనల్లుడు మణి అయ్యర్ తో పలు సంగీత కచేరీలలో పాల్గొన్న వేంటు అయ్యర్ కుమారుడే శంకర నారాయణన్ 1945లో మయిలాగుత్తురైలో జన్మించారు. చెన్నైలో స్థిరపడ్డ ఆయన న్యాయశాస్త్రంలో డిగ్రీ చదివారు కర్ణాటక సంగీతం పట్ల అభిమానంతో ఆ రంగాన్నే కెరీర్ పెంచుకున్నారు. తండ్రి మణి అయ్యర్ తో కలిసి తొమ్మిదేళ్ల వయసు నుంచే కచేరీలు చేయడం ప్రారంభించారని శంకర నారాయణన్ కుమారుడు మహదేవన్ తెలిపారు. 2003లో మ్యూజిక్ అకాడమీ నుంచి సంగీత కళానిధి పురస్కారం, అదే సంవత్సరంలో కేంద్రం నుంచి పద్దు కృష్ణక సబ్ అందుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు టీవీ శంకర నారాయణన్ కన్నుమూత
ఎవరు : టీవీ శంకర నారాయణన్
ఎప్పుడు : సెప్టెంబర్ 03
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |