Daily Current Affairs in Telugu 02-07-2021
దేశంలోనే తొలిసారి పర్యావరణ పరీక్ష కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్లు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ :

దేశంలో తొలిసారిగా పర్యావరణ పరీక్ష కేంద్రాన్ని (ఎన్విరాన్మెంటల్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్) విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్లు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) సీఎండీ కమెడోర్ సిద్ధార్థ మిశ్రా తెలి పారు జూన్ 24న విశాఖలో ఆ కేంద్రం నిర్మాణానికి తూర్పు నౌకాదళ ఉపద ళధిపతి (చీఫ్ ఆఫ్ స్టాఫ్) వైస్ఆడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా గారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సిద్ధార్ధమిశ్రా మాట్లాడుతూ.. టోర్పెడోలు, సముద్ర అంతర్భాగాల్లో దూసుకెళ్లే ఆయుధాల తయారీకి ఈ కేంద్రం అత్యంత ఉపయుక్తమని వివరించారు. ఇందులో టోర్సెడో మొత్తాన్ని పరిశీలించడానికి అవసరమైన వైబ్రేషన్ పరీక్ష, ధర్మల్, వాకింగ్, చాంబర్లు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో బీడీఎల్ సాంకేతిక విభాగం డైరెక్టర్ ఎన్.పి. దివాకర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమొడోర్ ఎ మాధవరావు, విశాఖపట్నం బీడీఎల్ అధిపతి ఎస్.వి. కామేశ్వర్, ఎన్ఎస్ఓటీఎల్, తూర్పు, నౌకాదళం అధికారులు పాల్గొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : దేశంలోనే తొలిసారి పర్యావరణ పరీక్ష కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్లు భారత్ డైనమిక్స్ లిమిటెడ్
ఎవరు: భారత్ డైనమిక్స్ లిమిటెడ్
ఎప్పుడు: జులై 02
ఆకాశవాణి సంస్థ నూతన డైరెక్టర్ జనరల్ గా ఐ.ఏ.ఎస్ నూకల వేణు ధర్ రెడ్డి నియామకం :

ఆల్ ఇండియా రేడియో(ఆకాశవాణి) నూతన డైరెక్టర్ జనరల్‌గా ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) అధికారి నూకల వేణుధర్ రెడ్డి తాజాగా బాధ్యతలు ఆకాశవాణికి పూర్వవైభవం తెస్తామని, ప్రజల రోజువారీ జీవనంలో భాగమయ్యేలా కార్యక్రమాలను రూపొందిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతామని పేర్కొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆకాశవాణి సంస్థ నూతన డైరెక్టర్ జనరల్ గా ఐ.ఏ.ఎస్ నూకల వేణుధర్ రెడ్డి నియామకం
ఎవరు: ఐ.ఏ.ఎస్ నూకల వేణుధర్ రెడ్డి
ఎప్పుడు: జులై 02
రోదసిలోకి తొలిసారి పయనం అవుతున్న తొలి తెలుగు అమ్మాయి శిరీష బండ్ల :

విశ్వ వినువీధిలో తెలుగు కీర్తి పతాకం ఎగరబోతోంది. రోదసిలోకి తొలిసారిగా ఒక తెలుగమ్మాయి పయనమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్రాష్ట్రం లోని గుంటూరు జిల్లాకు చెందిన శిరీష బండ్ల చరిత్ర సృష్టించనున్నారు. కల్పనా చావ్లా తర్వాత రోదసియానం చేయనున్న భారత సంతతి మహిళగా ఆమె ఘనత సాధించనున్నారు. ప్రముఖ అంతరిక్ష సంస్థ ‘వర్జిన్ గెలాక్టిక్’ ఈ నెల 11న మానవసహిత వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ 22 ని నింగిలోకి పంపనుంది. అందులో ఆ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ తో పాటు మరో అయిదుగురు ప్రయాణించను.న్నారు. ఈ బృందంలో 30 ఏళ్ల శిరీష ఒకరు. కాగా ఈ స్పేస్ క్రాఫ్ట్ న్యూమెక్సికో నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనితో అంతరి క్షంలో అడుగుపెట్టిన తొలి ప్రైవేటు ధనిక వ్యక్తిగా రిచర్డ్ బ్రాన్సన్, మరియు స్పేస్ లో అడుగు పెట్టిన తొలి తెలుగమ్మాయిగా శిరీషలు చరిత్ర సృష్టించనున్నారు. కల్పనా చావ్లా తర్వాత భారత్ లో పుట్టి స్పేస్ లో ‘అడుగుపెట్టబోతున్న రెండో మహిళ గానూ, రాకేష్ శర్మ, కల్పనా చావ్లా. సునీతా విలియమ్స్ తరువాత భారత సంతతి నుంచి అంతరిక్షంలోకి వెళ్ల నున్న నాలుగో వ్యోమగామిగా నిలవనుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : రోదసిలోకి తొలిసారి పయనం అవుతున్న తొలి తెలుగు అమ్మాయి శిరీష బండ్ల
ఎవరు: శిరీష బండ్ల
ఎప్పుడు: జులై 02
‘ది 2021 క్లాస్’ గా పిలువబడే బృందం లో భారత్ నుంచి ముగ్గురికి దక్కిన చోటు :

ఆస్కార్ పురస్కారాల్ని నిర్వహించే ‘అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’లో 2021 బృందంలో మన దేశం నుంచి ముగ్గురికి ఆహ్వానం అందింది. ‘ది 2021 క్లాస్’ గా పిలిచే ఈ బృందంలో ప్రపంచవ్యా ప్తంగా ఉన్న నటులు, సాంకేతిక నిపుణుల్ని ఆహ్వానించారు. 395 మందితో కూడిన ఈ జాబితాలో నటి విద్యా బాలన్, నిర్మాతలు ఏక్తా కపూర్, శోభా కపూర్లు ఉన్నారు. ‘తుమ్హారీ సులు’, ‘కహానీ’ చిత్రాల్లోని నటనలకు గానూ విద్యాబాలన్ కు ఈ గౌరవం దక్కింది. ‘డ్రీమ్ గర్ల్’, ‘వన్స్ అప్ ఆన్ ఎ టైమ్ ఇన్ ముంబయి’ చిత్రాల నిర్మాతగా ఏక్తాకపూర్, ‘ఉడ్తా పంజాబ్, ‘ది డర్టీ పిక్చర్ లు నిర్మాతగా శోభాకపూర్‌లకు ఈ గుర్తింపు దక్కింది. వీళ్లందరూ ఆస్కార్ పురస్కార గ్రహీతల్ని ఎంపిక చేసే ఓటింగ్ లో పాల్గొంటారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ‘ది 2021 క్లాస్’ గా పిలువబడే బృందం లో భారత్ నుంచి ముగ్గురికి దక్కిన చోటు :
ఎవరు: నటి విద్యా బాలన్, నిర్మాతలు ఏక్తా కపూర్, శోభా కపూర్లు
ఎప్పుడు: జులై 02
టోక్యో పారాలింపిక్స్ లో పతకదారిగా మరియప్పన్ తంగవేలు ఎంపిక :

టోక్యో పారాలింపిక్స్ లో తంగవేలు మరియప్పన్ త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారత జట్టును నడిపించను న్నడు. రియో ఒలింపిక్స్ పసిడి పతకం గెలిచి చరిత్ర సృష్టించిన ఈ తమిళనాడు క్రీడాకారుడిని.. ఆగస్టు 24న ఆరంభమయ్యే పారాలింపిక్స్ ఆరం భోత్సవానికి పతాకధారిగా ఎంపిక చేశారు. “టోక్యో పారాలింపిక్స్ లో తంగవేలు భారత జట్టుకు పతకాధారిగా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు భారత పారాలింపిక్ సర్వసభ్య కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది” అని పారా అథ్లెటిక్స్ ఛైర్మన్ సత్యనారాయణ చెప్పాడు. రియోలో ప్రదర్శనకు గాను 25 ఏళ్ల తంగవేలుకు. అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న దక్కింది. పారాలింపిక్స్ హైజంప్ లో 189 మీటర్ల ఎత్తు ఎగిరిన మరియప్పన్., పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దుబాయ్ లో జరిగిన 2019 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో మూడో స్థానంలో నిలవడం ద్వారా తంగవేలు టోక్యో బెర్త్ ను సాధించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : టోక్యో పారాలింపిక్స్ లో పతకదారిగా మరియప్పన్ తంగవేలు ఎంపిక
ఎవరు: మరియప్పన్ తంగవేలు
ఎప్పుడు: జులై 02
400 మీటర్ల హార్డిల్స్ లో ప్రపంచ రికార్డు సృష్టించిన కార్ స్టీన్ :

ప్రపంచ చాంపియన్. ప్రపంచ రికార్జును బద్దలుకొట్టాడు. 29 ఏళ్ల ఘనమైన రికార్డుకు తిరిగి రాశాడు. ఇక్కడ జరుగుతున్న డైమండ్ లీగ్ మీట్ లో జరిగిన పురుషులు 400 మీటర్ల హర్డిల్స్ లో రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన కార్ స్టెన్ వారోమ్ (నార్వే) పోటీని అందరికంటే ముందు గా 46:70 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ క్రమంలో అతని వేగానికి దాదాపు మూడు దశాబ్దాల పాటు చెక్కుచెదరని రికార్డు చెదిరిపోయింది. 1992 బార్సి లోనా ఒలింపిక్స్ లో అమెరికా అథ్లెట్ కెవిన్ యంగ్ 46.79 సె.) నెలకొల్పిన రికార్డు తెరమరుగైంది. నార్వే అథ్లెట్ ఈ సారి తప్పకుండా ఒలింపిక్స్ లో చాంపియన్ గా నిలుస్తానని చెప్పాడు. వేగం పెరిగిన తన ప్రదర్శనతో ఒలింపిక్ రికార్డుపై కన్నేసినట్లు చెప్పాడు. గత రియో ఒలింపిక్స్ (2016)లో అతనికి రికార్డుకు నిరాశ ఎదురైంది. కెరీర్లో తొలిసారి పాల్గొన్న డ్లీగ్ మెగా ఈవెంట్లో అతను పదో స్థానంలో నిలిచాడు. 25 ఏళ్ల కార్డన్ 2017 నుంచి ట్రాక్ పై అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆ ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్ర 400 మీటర్ల హర్డిల్స్ విజేతగా నిలిచాడు. పోలండ్ ఆతిథ్యమిచ్చిన యూరోపియన్ అండర్ 23 చాంపియన్ షిప్లో 400 మీ.హర్టిల్స్ తో పాటు 400 మీ. పరుగులో సత్తాచాటుకున్నాడు. హర్టిల్స్ లో స్వర్ణం సాధించిన కార్సెన్, పరుగులో రజతం [పతకం నెగ్గాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : 400 మీటర్ల హార్డిల్స్ లో ప్రపంచ రికార్డు సృష్టించిన కార్ స్టీన్
ఎవరు: కార్ స్టీన్
ఎప్పుడు: జులై 02
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |