
Daily Current Affairs in Telugu 02-04-2020
తక్కువ ఖర్చు తో పోర్టబుల్ వెంటి లెటర్ ను అబివృద్ది చేసిన ఐఐటి కాన్పూర్:

దేశంలో పెరుగుతున్న మహమ్మారి వైరస్ అయిన కోవిద్ -19 కేసుల మద్య ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) కాన్పూర్ పోర్టబుల్ వెంటిలెటర్ ను అబివృద్ది చేసింది.ఇది మార్కెట్లో లబించే వాటి కంటే చాలా చౌకగా ఉంటుంది.ఈ వెంటిలెటర్ యొక్క నమూనా చాలా త్వరగా సిద్దంగా ఉంటుంది.మరియు సమావేశమైన తర్వాత దేనిని లైఫ్ సపోర్ట్ సిస్టం గా ఉపయోగించవచ్చు .కోవిద్-19 రోగులకు వెంటిలెటర్ చాలా ముఖ్యమైన వైద్య పరికరాలు ముక్యంగా వృద్దులు మరియు పిల్లలకు చాలా ప్రమాదకరము
క్విక్ రివ్యు :
ఏమిటి: తక్కువ ఖర్చు తో పోర్టబుల్ వెంటి లెటర్ ను అబివృద్ది చేసిన ఐఐటి కాన్పూర్
ఎవరు: ఐఐటి కాన్పూర్
ఎప్పుడు:ఏప్రిల్ 02
సుందరం హోమ్ పైనాస్స్ కొత్త ఎండి గా ఎల్.దురైస్వామి నియామకం :

సుందరం హోమ్పైనాస్స్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా లక్ష్మి నారాయణన్ దురైస్వామి బాధ్యతలు స్వీకరించారు . 2010 నుండి సుందరం హోమ్ పైనాస్స్ మేనేజింగ్ డైరెక్టర్గ పనిచేస్తున్న శ్రీనివాస్ ఆచార్య స్థానంలో ఆయన వచ్చారు. సుందరం పైనాస్స్ తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ సుందరం హోమ్ పైనాస్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా లక్ష్మి నారాయణన్ ను ఏప్రిల్ 1,2020 నుంచి నియమిస్తున్నట్లు ప్రకటించింది .
క్విక్ రివ్యు :
ఏమిటి: సుందరం హోమ్ పైనాస్స్ కొత్త ఎండి గా ఎల్.దురైస్వామి నియామకం ఎవరు:
ఎప్పుడు:ఏప్రిల్ 02
కోవిద్-19 కు వ్యతిరేకంగా ప్రాజెక్టు ప్రపంచ బ్యాంక్ భారత దేశానికి వన్ బిలియన్ సహాయం:

భారత దేశం యొక్క కోవిద్ -19 అత్యవసర ప్రతిస్పందన మరియు ఆరోగ్య వ్యవస్థల సంసిద్దత ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంక్ భారత ప్రభుత్వానికి 1 బిలియన్ల ను ఆపర్ చేసింది. ఇది మహమ్మారి సమయంలో భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల సంసిద్దత ను అభివృద్ధి చేయడమే .ఈ ప్రాజెక్ట్ ప్రకారం కోవిడ్ – 19 ముప్పును తగ్గించి , భారతదేశంలో ప్రజారోగ్య సంసిద్దత కోసం జాతీయ వ్యవస్థలను బలోపేతం చేస్తుంది .
క్విక్ రివ్యు :
ఏమిటి: కోవిద్-19 కు వ్యతిరేకంగా ప్రాజెక్టు ప్రపంచ బ్యాంక్ భారత దేశానికి వన్ బిలియన్ సహాయం
ఎవరు: ప్రపంచ బ్యాంక్
ఎప్పుడు:ఏప్రిల్ 02
UN COP26 వాతావరణ సదస్సు 2021 కి వాయిదా :

నవంబర్ లో గ్లాస్గో లో జరగనున్న యునైటెడ్ నేషన్స్ COP-26 వాతావ్వరణ మార్పుల సమవేశం కోవిద్ -19 కారణంగా వచ్చే ఏడాది 2021 వరకు వాయిదా పడింది.ఈ సమావేశాన్ని వాయిదా వేసే నిర్ణయం UK మరియు దాని ఇటాలియన్ భాగస్వాములతో కలిసి ఐక్యరాజ్యసమితి ప్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లేమేట్ చేంజ్ (UNFCCC) యోక్క COP బ్యూరో తీసుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: UN COP26 వాతావరణ సదస్సు 2021 కి వాయిదా
ఎక్కడ: గ్లాస్గో
ఎప్పుడు:ఏప్రిల్ 02
పద్మశ్రీ గ్రహీత భాయ్ నిర్మల్ సింగ్ కన్నుమూత:

పద్మ శ్రీ అవార్డు గ్రహీత గోల్డెన్ టెంపుల్ లోని మాజీ హజురిరాగి బావినిర్మల్ సింగ్ కోవిద్-19 సోకి కన్నుమూసారు.అతను పంజాబ్ లోని అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో గుర్బని ఎక్స్పోనేనట్ యొక్క మరియు గురుగ్రంద్ సాహిబ్ యొక్క గుర్బానిలోని మొత్తం 31 “రాగ్స్” గురించి జ్ఞానం కలిగి ఉన్నాడు. ఆయనకు 2009 లో పద్మ శ్రీ అవార్డు లబించిది.
క్విక్ రివ్యు :
ఏమిటి: పద్మశ్రీ గ్రహీత భాయ్ నిర్మల్ సింగ్ కన్నుమూత
ఎవరు: భాయ్ నిర్మల్ సింగ్
ఎక్కడ:పంజాబ్
ఎప్పుడు: ఏప్రిల్ 02
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |