
Daily Current Affairs in Telugu 01-04-2020

వింబుల్డన్ గ్రాండ్ స్లాం టెన్నిస్ టోర్నమెంట్ రద్దు :
కోవిడ్ -19 కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అసాధారణ పరిస్థితుల ద్రుష్ట్యా.. 2020 , ఏడాది ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్ స్లాం టెన్నిస్ టోర్నమెంట్ రద్దు చేస్తున్నట్లు ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్సిస్ క్లబ్ ( ఏఈఎల్ టిసి) ఏప్రిల్ 1న ప్రకటించింది. షెడ్యుల్ ప్రకారం 2020 ఏడాది వింబుల్డన్ టోర్నీ జూన్ 29 నుంచి జూలై 12 వరకు జరాల్సింది. 2021 ఏడాది వింబుల్డన్ టోర్నీ జూన్ 28 నుంచి జూలై 11 వరకు జరుగుతుందని ఏఈఎల్ టిసి తెలిపింది
క్విక్ రివ్యు:
ఏమిటి: వింబుల్డన్ గ్రాండ్ స్లాం టెన్నిస్ టోర్నమెంట్ రద్దు :
ఎప్పుడు: మార్చి 01
టోక్యో ఒలింపిక్ గేమ్స్ 2020 ను 2021 సంవత్సరానికి తిరిగి షెడ్యుల్ ప్రకటింపు :

కోవిడ్-19 కారణంగా టోక్యో ఒలింపిక్ గేమ్స్ 2020 ఒక సంవత్సరం వాయిదా పడడం జరిగింది .తిరిగి 2021 జూలై23 నుండి 2021 ఆగస్టు వరకు జరగనుంది . ఒలింపిక్ గేమ్స్ టోక్యో 2020 అంతకుముందు జూలై 24 నుండి 2020 ఆగస్టు 9 వరకు జరగాల్సి ఉంది . 32వ ఎడిషన్ వాయీదా నిర్ణయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటి (ఐఓసి) తో పాటు టోక్యో 2020 ఆర్గనైజింగ్ కమిటి , టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వం మరియుజపాన్ ప్రభుత్వం తీసుకున్నాయి .
క్విక్ రివ్యు:
ఏమిటి: టోక్యో ఒలింపిక్ గేమ్స్ 2020 ను 2021 సంవత్సరానికి తిరిగి షెడ్యుల్ ప్రకటింపు
ఎక్కడ: టోక్యో
ఎవరు: ఐవోసీ
ఎప్పుడు: మార్చి 01
కోవిద్ -19 తో ప్రపంచ వ్యాప్తంగా ఆహార సంక్షోబం :

కోవిద్ -19(కరోనా వైరస్) సంక్షోబాన్ని సమర్థంగా ఎదుర్కొనకపోతే ప్రపంచ వ్యాప్తంగా ఆహార సంక్షోబంనెలకొనే అవకాశం ఉందని మూడు అంతర్జాతీయ సంస్థల యొక్క అధిపతులు హెచ్చరించారు.ఈ మేరకు ఏప్రిల్ 01న ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అర్గానైసేషణ్ (ఎఫ్ఎవో) అధిపతి క్యూ డోంగ్యు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహేచ్ వో) అద్యక్షుడు టేద్రోస్ అధనోం ,ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటివో) డైరెక్టర్ రాబెర్తో అజేవేదో లు ఒక ప్రకటన విడుదల చేశారు.ఆహర లబ్యత పై ఏర్పడబోతున్న సందిగ్దత అంతర్జాతీయ ఎగుమతులపై ఆంక్షలకు కారణమౌతుంది.ఇది ప్రపంచ మార్కెట్ లో ఆహర కొరతకు దారి తీస్తుంది.అని పేర్కొన్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: కోవిద్ -19 తో ప్రపంచ వ్యాప్తంగా ఆహార సంక్షోబం
ఎవరు:డబ్ల్యుహేచ్వో
ఎప్పుడు: మార్చి 01
ఎంఎఫ్ఐ ప్యానెల్ చైర్మన్ గా హెచ్ ఆర్ ఖాన్ నియామకం:

మైక్రో క్రెడిట్ కోడ్ ఫర్ రేస్పాన్సింగ్ లెండింగ్ (సిఆర్ ఎల్) యొక్క స్టీరింగ్ కమిటీ కి మొదటి చైర్మన్ గా ఆర్బిఐ మాజీ డిప్యుటీ గవర్నర్ హెచ్ ఆర్ ఖాన్ నియమితులయ్యారు.బ్యాంకులు ,ఎన్బిఎఫ్సి –ఎఎఫ్ఐ లు మరియు ఎన్బిఎఫ్సి వంటి విబిన్న సంస్థలు కస్టమర్ రక్షణ ప్రమాణాలు కు కట్టుబడి రక్షణ ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా మైక్రో క్రెడిట్ పరిశ్రమకు సిఆర్ఎల్ ఒక స్వీయ నియంత్రణ దశ.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఎంఎఫ్ఐ ప్యానెల్ చైర్మన్ గా హెచ్ ఆర్ ఖాన్ నియామకం:
ఎక్కడ:న్యు డిల్లీ
ఎవరు: హెచ్ ఆర్ ఖాన్
ఎప్పుడు: మార్చి 01
ప్రముఖ చరిత్రకారుడు అర్జున్ దేవ్ కన్నుమూత :

దిగ్గజ చరిత్ర కారుడు అయిన మరియు విద్య వేత్త ప్రొఫెసర్ అర్జున్ దేవ్ కన్నుమూసారు.అతను పశ్చిమ పంజాబ్ (ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది) లోని లీయాలో 1938 నవంబర్ 12న జన్మించాడు.నేషనల్ కౌసిల్ ఆఫ్ ఎడుకేషన్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సిఈఆర్టి ) లో చరిత్రకారుడిగా ఈయన పని చేశారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రముఖ చరిత్రకారుడు అర్జున్ దేవ్ కన్నుమూత
ఎప్పుడు: మార్చి 01
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |