Daily Current Affairs in Telugu 09 June-2022
ప్రసార భారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా మయాంక్ కుమార్ అగర్వాల్ నియామకం :

ప్రస్తుతం దూరదర్శన్ క్టర్ జనరల్ గా లో న్యూస్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న మయాంక్ కుమార్ అగర్వాల్ కు ప్రసార భారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ప్రభుత్వం జూన్ 10న అదనపు బాధ్యతలు అప్పగించింది.1989-బ్యాచ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు లేదా ప్రభుత్వం ఆ పదవికి రెగ్యులర్ అపాయింట్మెంట్ ఇచ్చే వరకు ప్రసార భారతి CEOగా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తారు. కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అనుమతితో అగర్వాల్ నియామకం జరిగిందని ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత ప్రసార భారతి సీఈవోగా శశి శేఖర్ వెంపటి పదవీ విరమణ చేసిన నేపథ్యంలో అగర్వాల్ నియామకం జరిగింది. ప్రసార భారతి చట్టం ప్రకారం, భారత వైస్ ప్రెసిడెంట్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మరియు I&B సెక్రటరీతో కూడిన ముగ్గురు సభ్యుల సెర్చ్ కమిటీ ప్రసార భారతి బోర్డు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా గురిస్తుంది.
- ప్రసార భారతి స్థాపన :1993
- ప్రసార భారతి ప్రధాన కార్యాలయం : న్యు డిల్లి
- ప్రసార భారతి సియివో :శశి శేఖర్ (వెంపటి ప్రస్తుతం – మయాంక్ కుమార్ అగర్వాల్)
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రసార భారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా మయాంక్ కుమార్ అగర్వాల్ నియామకం
ఎవరు : మయాంక్ కుమార్ అగర్వాల్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు : జూన్ 10
బహుభాషల వినియోగంపై ఆమోదించిన తీర్మానంలో మొదటిసారిగా హిందీని చేర్చిన ఐరాసా :

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ జూన్ 10న బహుభాషల వినియోగంపై ఆమోదించిన తీర్మానంలో మొదటిసారిగా హిందీని కూడా చేర్చింది. 193 దేశాలతో కూడిన సర్వప్రతినిధి సభలో ఈ ప్రతిపాదనకు భారత్ సహా 80కి పైగా దేశాలు మద్దతిచ్చాయి. ఆరు అధికార భాషలైన ఇంగ్లిష్, ఫ్రెంచి, చైనీస్, స్పానిష్, అరబిక్, రష్యన్ తో పాటు అనధికారిక భాషలైన హిందీ, స్వాహిలీ, పర్షియన్, బంగా, ఉర్దూలను కూడా ఐరాస ఉత్తరప్రత్యుత్తరాల్లో వాడాలని తీర్మానం పేర్కొంది. ఐరాస తన కార్యకలాపాల్లో సమగ్రత సాధించేందుకు బహుళ భాషలను సమంగా స్వీకరించాలని భారత్ పేర్కొంది. ఐరాస గ్లోబల్ కమ్యూనికే షన్స్ ఉత్తర ప్రత్యుత్తరాలకు ఈ భాషలను కూడా ఉపయోగించడాన్ని ప్రశంసించింది.
- ఐక్యరాజ్య సమితి స్థాపన : 1945 అక్టోబర్ 24
- ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం :న్యూయార్క్
- ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరి జనరల్ :అంటోనియో గుటేరస్
- ఐక్య రాజ్య సమితిలోని అధికార భాషలసంఖ్య : ఆరు (ఇంగ్లిష్, ఫ్రెంచి, చైనీస్, స్పానిష్, అరబిక్, రష్యన్)
క్విక్ రివ్యు :
ఏమిటి: బహుభాషల వినియోగంపై ఆమోదించిన తీర్మానంలో మొదటిసారిగా హిందీని చేర్చిన ఐరాసా
ఎవరు : ఐరాసా
ఎక్కడ: న్యూయార్క్
ఎప్పుడు : జూన్ 10
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో ఏడో స్థానంలో నిలిచిన భారత్ :

గత ఏడాది (2021) భారత్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు “(ఎల్డీఐ) 45 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3.47 లక్షల కోట్ల) మేర వచ్చాయని ఐక్వరాజ్య సమితి (యూఎన్) వెల్లడించింది. 2020లో భారత్ కు చేరిన ఎఫ్డీఐ 64 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి తక్కువే. అయితే 2021లో ఏపీడీఐలను అత్యధికంగా ఆకర్షించిన ప్రపంచంలోని తొలి 10 దేశాల్లో భారత్ తన స్థానాన్ని 8 నుంచి 7కు మెరుగుపరుచుకుంది. తొలి 6 స్థానాల్లో వరుసగా అమెరికా, చైనా, హాంకాంగ్, సింగపూర్, కెనడా, బ్రెజిల్ ఉన్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో ఏడో స్థానంలో నిలిచిన భారత్
ఎవరు : భారత్
ఎప్పుడు : జూన్ 10
‘కరెన్సీ పర్యవేక్షణ జాబితా’లో భారత్ ను చేర్చిన అమెరికా దేశం :

అమెరికా తన కరెన్సీ పర్యవేక్షణ జాబితాలో భారత్ తో సహా 12 దేశాలను చేర్చింది. దీని కింద ఆయా దేశాల్లోని కరెన్సీ, స్థూల ఆర్థిక విధానాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఇటలీ, మలేసియా, సింగపూర్, థాయ్లాండ్, తైవాన్, వియత్నాం, మెక్సికోలు ఈ జాబితాలో ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్. డిసెంబరు సంబంధించిన ఆర్థిక నివేదికల్లో వెలుగుచూసిన రెండు కారణాల వల్ల భారత్ ను ఈ జాబితాలో కొనసాగిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ శాఖ కాంగ్రెస్ కు ఒక నివేదిక సమర్పించింది. ఇందులో ఒకటి అమెరికాతో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యంలో గణనీయ స్థాయిలో భారత కు మిగులు ఉండటం కాగా రెండోది ఫోరెక్స్ మార్కెట్లపై ఏకపక్షంగా జోక్యం చేసుకోవడం.
- అమెరికా దేశ రాజధాని :వాషింగ్టన్
- అమెరికా దేశ కరెన్సీ :యుఎస్ డాలర్
- అమెరికా దేశ అద్యక్షుడు : జో బైడేన్
- అమెరికా దేశ ఉపాధ్యక్షుడు : కమలా హ్యారిస్
క్విక్ రివ్యు :
ఏమిటి: ‘కరెన్సీ పర్యవేక్షణ జాబితా’లో భారత్ ను చేర్చిన అమెరికా దేశం
ఎవరు : అమెరికా దేశం
ఎక్కడ: అమెరికా దేశం
ఎప్పుడు : జూన్ 10
పారా షూటింగ్ ప్రపంచకప్ లో రెండు స్వర్ణ పతకాలను గెలుచుకున్న రాహుల్ జాకాడ్:

పారా షూటింగ్ ప్రపంచకప్ లో రాహుల్ జాకడ మెరిశాడుజూన్ 10న 10మీ. మిక్స్డ్ ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో పసిడి సాధించిన అతడు టీమ్ కేటగిరిలోనూ స్వర్ణ పతకంను కైవసం చేసుకున్నాడు. 10 మీటర్ల పిస్టల్ ఫైనల్లో రాహుల్ (367) మన దేశానికే చెందిన రుబీనా ఫ్రాన్సిస్ (355)పై గెలిచి పసిడి దక్కించున్నాడు. ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో దీపేందర్ సింగ్, ఆకాశ్ తో కలిసి రాహుల్ స్వర్ణం సొంతం చేసుకున్నాడు. 2019లో క్రొయేషియాలో జరిగిన పారా షూటింగ్ ప్రపంచకప్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో స్వర్ణం గెలిచిన 35 ఏళ్ల రాహుల్ జకాడ్, టోక్యో పారాలింపిక్స్ లో 25 మీటర్ల పిస్టల్లో అయిదో స్థానంలో నిలిచాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: పారా షూటింగ్ ప్రపంచకప్ లో రెండు స్వర్ణ పతకాలను గెలుచుకున్న రాహుల్ జాకాడ్
ఎవరు : రాహుల్ జాకాడ్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు : జూన్ 10
అంతర్జాతీయ బ్యాడ్మింటన్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన గురు సాయి దత్ :

కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత RMV గురుసాయి దత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. గ్లాస్గోలో జరిగిన 2014 కామన్వెల్త్ గేమ్స్ లో కాంస్యం సాధించినహైదరాబాద్ కు చెందిన 32 ఏళ్ల అతను గత కొన్నేళ్లుగా అనేక గాయాలతో పోరాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాడు. 2008 కామన్వెల్త్ యూత్ గేమ్స్ బంగారు పతక విజేత మరియు ప్రపంచ జూనియర్ కాంస్య పతకాన్ని సాధించిన గురుసాయి దత్. గురుసాయి దత్ 2010 ఇండియా ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్లో రెండవ అత్యుత్తమ స్థానంలో నిలిచాడు. అతను దక్షిణాసియా క్రీడలలో భారతదేశానికి సాతినిధ్యం వహించాడు మరియు టీమ్ విభాగంలో బంగారు పతకం లో భాగమే కాకుండా సింగిల్స్ ఈవెంట్ లో రజతం గెలుచుకున్నాడు. అతను 2012 టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్లో టైటిల్ ను క్లెయిమ్ చేయడంతో పాటు, 2015లో బల్గేరియన్ ఇంటర్నేషనల్ ను గెలుచుకున్నాడు. అతను 2008లో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ట్రోఫీని కూడా గెలుచుకున్నాడు. 2014 CWGలో ఇంగ్లండుకు చెందిన రాజీవ్ ఔసేఫన్ను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకోవడం అతని అతిపెద్ద గుర్తింపు
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన గురు సాయి దత్
ఎవరు : గురు సాయి దత్
ఎప్పుడు : జూన్ 10
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |