Current Affairs in Telugu 27-09-2019

Current Affairs in Telugu 27-09-2019 :

rrb ntpc online exams in telugu

ప్రపంచంలో అత్యుత్తమ పర్యాటక దేశంగా స్పెయిన్:

స్పెయిన్ ఈ ఏడాదిలో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక దేశంగా ఘనత సాధించింది.వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన సర్వేలో స్పెయిన్ మొదటి స్థానంలో నిలిచింది.3000 కిలోమీటర్ల సముద్ర తీరం, యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన 48 ప్రదేశాలు, చక్కటి వాతావరణం ప్రశాంతత వెరసి స్పెయిన్ ఉత్తమ పర్యాటక దేశంగా నిలిపాయి. ఈ పట్టికలో ఫ్రాన్స్ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో ఫ్జర్మని ఉండగా తరువాతి స్థానాల్లో వరుసగా…జపాన్, అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్, ఆస్ట్రేలియా, ఇటలి, కెనడా, స్విట్జర్లాండ్ చోటు దక్కించుకున్నాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి : ప్రపంచ అత్యుత్తమ పర్యాటక దేశం

ఎప్పుడు : 26-09-2019

ఎవరు : స్పెయిన్

ఇంటర్నేషనల్ ఎగ్(EGG) కమిషన్ చైర్మన్ గా సురేష్ చిట్టూరి:

ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ చైర్మన్ గా శ్రీనివాస ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ చిట్టూరి నియమితులయ్యారు.కోపెన్ హగన్ (డెన్మార్క్) లో జరిగిన ఐఈసి గ్లోబల్ లీడర్షిప్ సమావేశంలో ఆయనను నియమించారు. ఐఈసికి చైర్మన్ గా బాద్యతలు చేపట్టనున్న మొట్టమొదటి ఆసియా వ్యక్తీ శ్రీనివాస్ చిట్టూరి కావడం విశేషం.

క్విక్ రివ్యు :

ఏమిటి : ప్రపంచ ఎగ్ కమిషన్ (ఐఈసి) చైర్మన్

ఎప్పుడు : 26-09-2019

ఎవరు : శ్రీనివాస్ చిట్టూరి

పాఠశాల విద్యా నాణ్యతలో తెలంగాణకు 14 వ స్థానం , ఆంధ్రప్రదేశ్ కు 4వ స్థానం:

పాఠశాల స్థాయిలో పిల్లలకు నాణ్యమైన విద్య అందించే విషయంలో దక్షిణాది రాష్ట్రాలు దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే మెరుగైన పనితీరును కనపరుస్తున్నాయి. నీతిఆయోగ్ దేశవ్యాప్తంగా 20 పెద్ద రాష్ట్రాలు, 8 చిన్న రాష్ట్రాలలోని  పాఠశాల విద్యా ప్రమాణాలను పరీక్షించి తాజాగా ‘స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటి ఇండెక్స్” ర్యాంకింగ్స్ రూపొందించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో, తెలంగాణ 14వ స్థానంలో నిలిచింది.

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

రాష్టాల వారిగా పాఠశాల విద్యానాణ్యత ర్యాంకింగ్ :

కేరళ 1
రాజస్తాన్ 2
కర్ణాటక 3
ఆంధ్రప్రదేశ్ 4
గుజరాత్ 5
అస్సాం 6
మహారాష్ట్ర 7
తమిళనాడు 8
హిమాచల్ ప్రదేశ్ 9
ఉత్తరాఖండ్ 10
హరియాణ 11
ఓడిశా 12
ఛత్తీస్ ఘడ్ 13
తెలంగాణ 14
మధ్యప్రదేశ్ 15
జ్హార్ఖండ్ 16
బిహార్ 17
పంచాబ్ 18
జమ్మూ కాశ్మీర్ 19
ఉత్తరప్రదేశ్ 20

క్విక్ రివ్యు :

ఏమిటి : నీతిఅయోగ్ ద్వారా ఈ ఏడాదికి గాను పాటశాల విద్యా నాణ్యత పై సర్వే

ఎప్పుడు : 26-09-2019

ఎవరు : ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో, తెలంగాణ 14వ స్థానంలో

ఇరాన్ అధ్యక్షుడితో మోది భేటి :

ప్రధాని మోది 26-09-2019 న ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహాని తో భేటి అయ్యారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ విరామ సమయంలో ఈ సమావేశం జరిగింది. ఇద్దరు నేతలు పలు అంశాల పై చర్చలు జరిపారు. అమెరికా విధించిన ఆంక్షలమేరకు ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయడంతో ఈ భేటికి ప్రాధాన్యత ఏర్పడింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : మోది మరియు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహాని భేటి

ఎప్పుడు : 26-09-2019

క్యాన్సర్ మరణాలను తగ్గించడంలో విటమిన్ “డి” పాత్ర:

క్యాన్సర్ మహమ్మారి కారణంగా సంభవించే మరణాలను తగ్గించడంలో విటమిన్ “డి” దోహదపడుతుందని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. గుండె పోటు ముప్పును ఇది తగ్గించగలదని తెలిపారు. చేపల ద్వారా లభించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు విటమిన్ డి …క్యాన్సర్ , హృద్రోగులకు అడ్డుకట్ట వేయగలదని నిర్దారించారు. విటమిన్ ‘డి’ తగినంతగా సంగ్రహిస్తూ, వారానికి సగటున 112 గ్రాముల చేపలను ఆహారంగా తిసుకున్నవారిలో హృద్రోగాల ముప్పు బాగా తగ్గుతుందిఅని పేర్కొన్నారు.

కుశాగ్ర ఖాతాలో నాలుగో స్వర్ణం :

ఆసియా స్విమింగ్ చాంపియన్ షిప్ లో భారత స్విమ్మర్ కుశాగ్ర రావత్ నాలుగో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకున్నాడు. 26-09-2019 న జరిగిన పురుషుల 400 మీటర్ల ఫ్రీ స్టైల్ లో అగ్రస్థానంలో నిలిచాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఆసియా స్విమింగ్ చాంపియన్ షిప్

ఎప్పుడు : 26-09-2019

ఎవరు : భారత స్విమ్మర్ కుశాగ్ర కు స్వర్ణం

Manavidya Youtube Channel

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *