ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి దాడి- లై అప్ డేట్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి దాడి-లై అప్ డేట్:

చైనా లోని వుహాన్ నగరంలో డిసెంబర్ 16 2019 న కరోనా యొక్క మొట్ట మొదటి కేసు నమోదు కాగా. ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల పై దాడి చేసింది. దిని భారిన పడిన దేశాలలో మొదటి మూడు స్థానాల్లో అమెరికా, ఇటాలి, చైనా కలవు. ఈ కరోనా వైరస్ కి ఇప్పటి వరకు ఎలాంటి మందు కాని, వ్యాక్సిన్ కాని ఇంకా రాలేదు. కాని ఇటివల కరోనా వైరస్ కు టికా ను హైదరాబాదు చెందిన ఒక ప్రొఫెసర్ తయారు చేయడం జరిగింది. అయితే ఈ టికా ఇంకా పూర్తీ స్థాయిలో అందుబాటులో రాలేదు. త్వరలోనే ఈ టికా పూర్తీ స్థాయిలో అందుబాటులో రానుంది.

అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజు కు పెరుగుతూనే ఉన్నాయి. అగ్రరాజ్యం అయినా అమెరికా ఈ వైరస్ దెబ్బకు కుదేలైంది. నిన్న ఒక్క రోజే 19,452 మంది కి పాసిటివ్ వచ్చింది అంటే మీరు ఈ మహమ్మారి ఎంత త్వరగా సోకుతుంది అని. ప్రస్తుతం అమెరికా లో మొత్తం 123,578 (ఈ రోజు వరకు) కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 2231 మంది చనిపోవడం జరిగింది. నిన్న ఒక్క రోజే 525 మంది చనీపోవడం జరిగింది.

ప్రపంచ ఆరోగ్య సూచిక లో మెరుగైన స్థానంలో గల ఇటలి దేశం కరోనా దెబ్బకు విలవిలలాడుతుంది. ప్రస్తుతం ప్రంచంలో అత్యధిక మరణాలు (10,023) సంభాసించిన దేశంగా ఇటలి నిలిచింది. నిన్న ఒక్క రోజే 889 మంది చనిపోవడం జరిగింది. ఇటలి లో ఈ రోజు వరకి మొత్తం 92,472 పాసిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

చైనా ప్రస్తుతం కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో విజయం సాధించింది అని చెప్పవచ్చు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వుహాన్ సిటిలో తిరగడం దీనికి నిదర్శనం. గత 60 రోజుల  లాక్ డౌన్ కుడా అక్కడ ఎత్తివేయడం కుడా జరిగింది. చైనా లో ఇపుడు రోజుకు 50-60 కేసులు మాత్రమె నమోదు అవుతున్నాయి. చైనా లో ఈ రోజు వరకి మొత్తం 81,394 పాసిటివ్ కేసులు నమోదు కాగా 74,971 మంది కోలుకోగా 3,295 మంది బాధితులు చనిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *