
నిన్న జరిగిన కేసిఆర్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70 కరోనా కేసులు నమోదు
ఒకరు మృతి
తాజాగా 11 మందికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు సమాచారం
58 మంది ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు.
- ఒక వ్యక్తి డిస్జార్జ్ అయ్యాడు. మిగిలిన 10 మందిని రేపు డిస్జార్జ్ చేస్తాం
- రాష్ట్రంలో 5746 క్వారంటైన్ టీమ్స్ పనిచేస్తున్నాయి
- 25,937 మంది ప్రభుత్వ పర్యవేక్షణలో క్వారంటైన్ లో ఉన్నారు.
30 మార్చి నాటికి 1899 మంది
31 మార్చి 1440
1 ఏప్రిల్ 1461
2 ఏప్రిల్ 1877
3 ఏప్రిల్ 1477
4 ఏప్రిల్ 1453
5 ఏప్రిల్ 914
6 ఏప్రిల్ 454
7 ఏప్రిల్ 397
నాటికి క్వారంటైన్ లో నుంచి బయటపడుతరు.
7తర్వాత తెలంగాణలో కరోనా పేషంట్లే ఉండరు. కొత్త కేసులు చేరకపోతే. చేరితే కష్టం. ప్రస్తుతానికి ఆ అవకాశం లేదు.
లాక్ డౌన్లో ప్రతి ఒక్కరు భాధ్యతగా మెలగాలి.
130 కోట్లు ఉన్న దేశంలో కరోనా పేషంట్లు తక్కువగా ఉండడం సంతోషకరం.
మెడికల్ ఇన్ఫ్రాస్టక్చర్ ఉండాల్సినంత లేదు. కావున లాక్ డౌన్ ఖచ్చితంగా పాటించాలి.
సౌత్ కోరియాలో ఒక్కరితో 50 వేల మందికి కరోనా సోకింది. కావున తగు జాగ్రత్తగా ఉండాల్సిందే. క్రమశిక్షణ పాటించాలి. ప్రజల కోఆపరేషన్ గొప్పగా ఉంది.
హోం క్వారంటైన్లో ఉన్నవారిని రోజుకు రెండుసార్లు పర్యవేక్షిస్తున్నరు.
50లక్షల పంటలు ప్రస్తుతం ఉంది
40వేల ఎకరాలలో వరిపంట రానుంది. గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో రాలేదు.
వరి చేతికి వస్తుంది. మక్క కూడా అందనుంది. యాసంగిలో 14 లక్షల టన్నుల మొక్కజొన్న దిగుబడి రానుంది. ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది.
నష్టం వచ్చిన ప్రభుత్వమే కొంటది. కానీ నియంత్రిత విధానంలో మక్కలను మార్కెట్ కు తీసుకురావాలి.
100 శాతం ప్రతి గింజను కొంటాం. రాష్ట్రంలో కోటి 5 లక్షల టన్నుల ధాన్యం వస్తుంది, మొత్తాన్ని మద్దతు ధరకు కొంటాం. అన్ని మార్కెట్లు బంద్ పెట్టినం. గ్రామాలలోనే కొంటాం. నియంత్రిత విధానంలో కొనుగోలు చేస్తాం. రూ.3200 కోట్లు మార్క్ ఫెడ్ గ్యారంటీ ఇచ్చాం.
మార్కెట్ కు వచ్చి జబ్బులు కొని తెచ్చుకోవద్దు. కూపన్ పద్దతిలో రైతుకు వచ్చిన కూపన్ తేదీరోజే తీసుకురావాలి.
డైలాగ్ లు కొడుతలేం. నిజంగానే కొంటాం. నేను సీఎంగా చెబుతున్నా.
నెలన్నరలో కూపన్లు ఇస్తారు. ఆన్ లైన్లో డబ్బులు వేస్తాం.
వరి కొసేందుకు పక్క రాష్ట్రం నుంచే హార్వేస్టర్లు వస్తాయి.
ట్రాక్టర్లను హర్వేస్టర్లు ఎక్కించే వారికి అనుమతులు ఇస్తున్నాం. వారికి స్పెషల్ పాసులు ఇవ్వనున్నాం. మౌంటెడ్ హర్వేస్టర్లు ఎక్కిస్తరు.
ఏఈవోలు రైతులకు కూపన్లు ఇవ్వాలి. వారి పాత్ర కీలకం.
ప్రత్యేక పరిస్థితిలో రైతుల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎక్కడా ఆదుర్థా పడొద్దు. పడితే పోలీసులు కొడతరు. కూపన్ ఇచ్చిన డేట్ ప్రకారమే కొనుగోలు కేంద్రం వద్దకు రావాలి. పైరవీలు ఉండవు.
బీహార్ హమాలీలు రానిదే పనికాదు.
ధాన్యం కొనుగోలుకు డబ్బులు లేవు ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నాం
ఈ పరిస్తితిలో కూడా సివిల్ సప్లై కార్పోరేషన్ రూ.25 వేల కోట్లు సమకూర్చింది. గతం ఎప్పుడు ఈ స్థాయిలో జరుగలేదు.
ముళ్లకంచెలు, రాళ్లు పెట్టానరు. కాబట్టి సర్పంచులు వాటిని తీసివేయాలి.
మన ఊరు ధాన్యం అమ్ముకోవాలంటే ఇవి తీయాలి. మంచిదే కానీ తప్పదు తీయాలి. పట్టువిడుపులతో పనిచేసుకోవాలి. గంగాలం, సబ్బులు పెట్టి ఎవరొచ్చినా కడుక్కొని రావాలని పెట్టుర్రి
Click here for RRB NTPC Free Mock Test in Telugu
బియ్యం ఊర్లో ఇవ్వాలంటే కంచెలు తీయాలి. రూ.1500 బ్యాంకులలో రేపటి నుంచి పడుతయి.
కొటి 5 లక్షల ధాన్యం కొనుగోలుకు 70 లక్షల బ్యాగులన కావాలి. కానీ 35 లక్షల బ్యాగులే ఉన్నాయి. అవి సమకూర్చుకునే ఏర్పాట్లు చేస్తున్నం.
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సున్నండబ్బలు పెట్టి సామాజిక దూరం, నియంత్రణ పాటించాలి.
నిమ్మ, బత్తాయి, సంత్రాలు మనకే అమ్మెలా చూడాలి.
బయటి రాష్ట్రాల నుంచి వచ్చే గూడ్స్ ని అనుమతించాలి. మన రాష్ట్రం నుంచి వెళ్లే వాటిని అనుమతించాలి.
పండ్లు తెచ్చే వాహానాకు ఉద్యానవన అధికారులు పాసులు ఇవ్వాలి.
మన ఇండ్లలో, కిరాణా దుకాణాలలో సరుకులు నిండుకోనివ్వవద్దు.
రైస్ మిల్లర్లను కొనుగోళ్లు చేయనియ్యాలి. కానీ కనీస మద్దతు ధర ఖచ్చితంగా ఇవ్వాలి. రేపు రైస్ మిల్లర్లతో సమావేశం పెట్టిన. మాట్లాడుతా.
జిల్లా కలెక్టర్ అధ్యక్షునిగా సమన్వయ కమిటీలు వేసుకుని మానిటరింగ్ చేయాలి.
ఇతర రాష్ట్రాలకు చెందిన దాదాపు 12,436 బృందాలకు 12 కేజీల బియ్యం ఇవ్వనున్నాం. ఏవరూ ఉపవాసం ఉండొద్దు. ప్రతి ఒక్కరికి రూ.500 ఇవ్వాలి.
మన రాష్ట్రానికి డేవలప్ మెంట్ పార్టనర్స్ వాళ్లు. ఎవరు వచ్చిన కడుపుల పెట్టుకుని సాదుకుంటం. అవసరమైతే భోజనాలు పెట్టాలి. ఎవరికి ఆకలి అనేది ఉండకుండా చూసుకుంటాం.
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |