
సిఎం కెసిఆర్ ద్వారా ప్రకటన చేయబడిన ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ నియామకాల యొక్క పూర్తి వివరాలు
ప్రభుత్వ విభాగాలలో ఉద్యోగాల నియామకాల పైన ప్రకటన :
కొత్తగా ఏర్పడిన మల్టీ జోన్ జోన్ ల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
మల్టీ జోన్ | జోన్ | జిల్లాలు |
మల్టీ జోన్ | జోన్ -1 కాళేశ్వరం | అసిఫాబాద్, మురంభీం,మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి,ములుగు జిల్లాలు |
జోన్ -2 బాసర | ఆదిలాబాద్, నిర్మల్, నిజుమాబాద్, జగిత్యాల జిల్లాలు | |
జోన్ -3రాజన్న | కరీంనగర్, సిరిసిల్లా రాజన్న సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలు | |
జోన్ -4 భద్రద్రి | కొత్తగూడెం-భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్,హన్మకొండ జిల్లాలు | |
జోన్ -5 యదాద్రి | సూర్యాపేట, నల్లగొండ యాదాద్రి భువన గిరి, జనగాం జిల్లాలు | |
మల్టీ జోన్ -2 | జోన్ -6 చార్మినార్ | మేడ్చల్మ,మల్కాజ్ గిరి హైదరాబాద్, గిరి రంగారెడ్డి సంగారెడ్డి,వికారాబాద్ జిల్లాలు |
జోన్ -7 జోగులాంబ | మహబూబ్ నగర్, నారాయణ్ పేట, జోగుళాంబ-గద్వాల,జోగులాంబ రాష్ట్ర ప్రముత్వం ప్రతిపాదించిన సవరణలకు వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలు |
11. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు గౌరవ రాష్ట్రపతిగారు ఆమోదం తెలపడంతో 2021 లో తుది ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా స్థానిక క్యాడర్ వ్యవస్థీకరణ ప్రక్రియ గతేడాది ఆగస్టులో పూర్తయ్యింది.
- పలు ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత.. ప్రస్తుత ఉద్యోగులను కొత్త స్థానిక క్యాడర్ల కింద కేటాయించే ప్రక్రియను గతేడాది డిసెంబరులో ప్రభుత్వం పూర్తి చేసింది. దీంతో ప్రతీ జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కొత్త స్థానిక క్యాడర్లలో నేరుగా భర్తీ చేయాల్సిన ఖాళీల వివరాల పై స్పష్టత వచ్చింది. ఖాళీల భర్తీ గురించి నోటిఫికేషన్లు జారీ చేయటానికి మార్గం సుగమమైంది.
- ఉమ్మడి రాష్ట్ర నుంచి తెలంగాణకు కాంటాక్టు ఉద్యోగులు వారసత్వంగా లభించారు. ప్రభుత్వరంగంలో ఇంత పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులండటం సబబు కాదని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఈ నేపధ్యంలోనే రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే 2014 జూన్ 2 వాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్న వారిపై మానవీయ దృక్పదంతో సభుత్వం రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించింది. అయితే కొన్ని రాజకీయ పార్టీలు సంకుచిత మనస్తత్వంతో కోర్టులో కేసులు చేసిన నేపధ్యంలో హైకోర్టు జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వుల కారణంగా ఈ ప్రక్రియ మధ్యలో నిలిచిపోయింది. ప్రభుత్వం పట్టు విడవకుండా న్యాయ పోరాటం చేసింది. ప్రభుత్వ పోరాటం ఫలితంగా గతేడాది డిసెంబరు 7న సంబంధిత రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలను వెలువరించింది.అవరోదాలన్నీ తొలగిపోయిన నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తున్నది. ఇక పై రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగ నియామకాలుండవు.
- యూనివర్సిటీల్లో 2,020 బోధన పోస్టులను 2,774 బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం. ప్రతిపాదించింది. దీంతో మొత్తం ప్రత్యేక నియామక ఖాళీలు 91,142 ఉన్నాయని తేలింది. కాంటాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా రాష్ట్రంలోని నేరుగా నియామకం చేయాల్సిన ఖాళీల ఉన్నట్లు తేలింది.
15. ఈ పోస్టుల భర్తీ ని వెంటనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందనే శుభవార్తను రాష్ట్ర యువతకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ భర్తీ ప్రేక్రియ వల్ల ఏటా సుమారు 7,000 కోట్ల రూపాయలు అదనపు భారం రాష్ట్ర ఖజానా పై పడుతుంది. అయినా కూడా ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది.
16. ఇక నుంచి ఖాళీలను ముందే గుర్తించి సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ను ప్రకటించి, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని విభాగాలు తమ వద్ద ప్రతీ సంవత్సరం ఏర్పడి ఖాళీల వివరాలు సిద్ధం చేస్తాయి. నోటిఫికేషన్ల జారీ కోసం ఆయా నియామక సంస్థలకు సమాచారం ఇస్తాయి
17. ఉద్యోగార్ధులు అన్ని నియామక పరీక్షల్లో పోటి పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
18.పోలీస్ శాఖ వంటి యూనిఫాం ‘సర్వీసులు మనహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని ఐదేండ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల మరెంతనుంది ఉద్యోగార్ధులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నది. ఈ నిర్ణయం వల్ల ఓసీలకు ఈ 44 ఏండ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లకు దివ్యాంగులకు 54 ఏండ్లకు గరిష్ట వయోపరిమితి పెరుగుతుంది.
స్థానిక క్యాడర్, విభాగాల వారిగా ఈ పోస్టుల వివరాలు కింద ఉన్న విధంగా ఉన్నాయి.
టేబుల్ 1 గ్రూపుల వారిగా ఖాళీలు
క్రమ సంఖ్య | గ్రూపులు | డైరెక్ట్ రిక్రూట్ మెంట్ వేకన్సీలు |
1 | గ్రూప్ -1 | 503 |
2 | గ్రూప్ -2 | 582 |
3 | గ్రూప్ -3 | 1,373 |
4 | గ్రూప్ -4 | 9,168 |
టేబుల్ 2 క్యాడర్ వారిగా ఖాళీలు :
క్రమ సంఖ్య | లోకల్ క్య్తాదర్ | డైరెక్ట్ రిక్రూట్ మెంట్ వేకన్సీలు |
1 | జిల్లాలు | 39,829 |
2 | జోనల్ | 18,866 |
3 | మల్టీ జోనల్ | 13,170 |
4 | సచివాలయం, హెచ్డివో లు, విశ్వవిద్యాయాలు | 8,147 |
టేబుల 3: జిల్లాల వారీగా ఖాళీలు
క్ర.సం. | జిల్లాలు | డైరెక్ట్ రిక్రూట్ మెంట్ వేకన్సీలు |
1 | హైదరాబాద్ | 5,268 |
2 | నిజామాబాద్. | 1976 |
3 | మేడ్చల్ మల్కాజ్ గిరి | 1769 |
4 | రంగారెడ్డి | 1561 |
5 | కరీం నగర్ | 1465 |
6 | నల్లగొండ | 1398 |
7 | కామారెడ్డి | 1340 |
8 | ఖమ్మం | 1340 |
9 | భద్రాద్రి కొత్తగూడెం | 1,316 |
10 | నాగర్కర్నూల్ | 1257 |
11 | సంగారెడ్డి | 1243 |
12 | మహబూబ్ నగర్ | 1213 |
13 | ఆదిలాబాద్ | 1193 |
14 | సిద్దిపేట్ | 1,178 |
15 | మహబూబాబాద్ | 1,172 |
16 | హన్మకొండ | 1,157 |
17 | మెదక్ | 1,149 |
18 | జగిత్యాల | 1,063 |
19 | మంచిర్యాల | 1.025 |
20 | యాదాద్రి భువనగిరి | 1,010 |
21 | జయశంకర్ భూపాలపల్లి | 918 |
22 | నిర్మల్ | 876 |
23 | వరంగల్ | 842 |
24 | కొమురంభీం ఆసిఫాబాద్ | 825 |
25 | పెద్దపల్లి | 800 |
26 | జనగాం | 760 |
27 | నారాయణ పెట్ | 741 |
28 | వికారాబాద్ | 738 |
29 | సూర్యాపేట | 719 |
30 | ములుగు | 696 |
31 | జోగులాంబ గద్వాల్ | 662 |
32 | రాజన్న సిరిసిల్ల | 601 |
33 | వనపర్హ్తి | 556 |
మొత్తం | 39,829 |
టేబుల 4:జోన్ ల వారీగా ఖాళీలు
క్ర.సం. | జోన్ | డైరెక్ట్ రిక్రూట్ మెంట్ వేకన్సీలు |
1 | జోన్ -1 కాళేశ్వరం | 1630 |
2 | జోన్ -2 బాసర | 2328 |
3 | జోన్ -3రాజన్న | 2403 |
4 | జోన్ -4 భద్రద్రి | 2858 |
5 | జోన్ -5 యదాద్రి | 2160 |
6 | జోన్ -6 చార్మినార్ | 5297 |
7 | జోన్ -7 జోగులాంబ | 2190 |
మొత్తం | 18,866 |
టేబుల్ 5: మల్టీ జోన్ వారీగా ఖాళీలు
క్ర.సం | లోకల్ క్యాడర్ | డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలు |
1 | మల్టీజోన్ 1 | 6,800 |
2 | మల్టీజోన్ 2 | 6.370 |
మల్టీటోన్ మొత్తం | 13,170 |
టేబుల్ 6: శాఖల వారిగా ఖాళీలు
క్ర.సం | డిపార్ట్ మెంట్ | డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకన్సీలు |
1 | హోం శాఖ | 18334 |
2 | సెకండరీ ఎడ్యుకేషన్ | 13086 |
3 | హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్చేర్ | 12755 |
3 | హయ్యర్ ఎడ్యుకేషన్ | 7878 |
5 | బీసీల సంక్షేమం | 4311 |
6 | రెవెన్యూ డిపార్ట్మెంట్ | 3560 |
7 | షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ | 2879 |
8 | ఇరిగేషన్ మరియు కమాండ్ | 2692 |
9 | ట్రైబల్ వెల్ఫేర్ | 2399 |
10 | మైనారిటీస్ వెల్ఫేర్ | 1825 |
11 | ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ | 1598 |
12 | పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ | 1455 |
13 | లేబర్ మరియు ఎంప్లాయిమెంట్ | 1221 |
14 | ఫైనాన్స్ | 1146 |
15 | మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ | 895 |
16 | మున్సిపల్ అడ్మినిస్టేషన్ మరియు అర్బన్ డెవలప్ మెంట్ | 859 |
17 | అగ్రికల్చర్ మరియు కో-ఆపరేషన్ | 801 |
18 | ట్రాన్స్పోర్ట్, రోడ్స్ మరియు బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ | 563 |
19 | న్యాయశాఖ | 386 |
20 | పశుపోషణ మరియు మత్స్య విభాగం | 353 |
21 | జనరల్ అడ్మినిస్ట్రేషన్ | 343 |
22 | ఇండస్ట్రీస్ మరియు కామర్స్ | 233 |
23 | యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం మరియు కల్చర్ | 184 |
24 | ప్లానింగ్ | 136 |
25 | ఫుడ్ మరియు సివిల్ సప్లయిస్ | 106 |
26 | లెజిస్లేచర్ | 25 |
27 | ఎనర్జీ | 16 |
మొత్తం | 80,039 |
Download Study Material in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |